మెల్‌బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో శనివారం పెను సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన 19 ఏళ్ల లిండా నొస్కోవా తన కెరీర్‌లోనే గొప్ప ప్రదర్శన చేసి నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత స్వియాటెక్‌ను బోల్తా కొట్టించింది.
2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 50వ ర్యాంకర్ నొస్కోవా 3–6, 6–3, 6–4తో స్వియాటెక్‌ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మాజీ చాంపియన్ అజరెంకా (బెలారస్), 12వ సీడ్ కిన్‌వెన్ జెంగ్ (చైనా), 19వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ అల్‌కరాజ్ (స్పెయిన్), మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు.
Comments
Please login to add a commentAdd a comment