
యూఎస్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ దూసుకుపోతున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్‌ను ఓడించి క్వార్టర్స్‌కు ప్రవేశించిన నాదల్ 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకునేందుకు మరింత దగ్గరయ్యాడు. భారత కాలామన ప్రకారం ఆదివారం తెల్లవారజామున జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో నాదల్.. తన స్నేహితుడైన రిచర్డ్ గాస్కెట్‌ను 6-0, 6-1, 7-5తో మట్టికరిపించాడు. కాగా యూఎస్ ఓపెన్‌లో నాదల్ క్వార్టర్స్ చేరడం ఇది 18వ సారి కాగా.. తన మిత్రుడిపై ఆధిక్యం కూడా 18-0నే కావడం విశేషం.
47వ విజయం.. షూ విరగొట్టిన అల్కరాజ్
ఇక 19 ఏళ్ల టెన్నిస్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ ఈ సీజన్‌లో 47వ విజయాన్ని అందుకున్నాడు. మూడో రౌండ్‌లో అమెరికాకు చెందిన జెన్సన్ బ్రూక్స్‌ను 6-3, 6-3, 6-3తో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. ఈ సీజన్‌లో 47 విజయాలతో రికార్డు బ్రేక్ చేసిన ఆనందలో అల్కరాజ్ తన షూస్‌ను విరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక క్వార్టర్స్‌లో 2014 చాంపియన్ మారిన్ సిలిచ్‌ను ఎదుర్కోనున్నాడు.
ముగురుజాకు షాక్.. క్వార్టర్స్ చేరిన స్వియాటెక్
ఇక మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్ వరుసగా రెండో ఏడాది క్వార్టర్స్‌కు చేరుకుంది. మూడో రౌండ్‌లో అన్ సీడెడ్ అయిన లారెన్ డేవిస్‌ను 6-3, 6-4తో మట్టికరిపించి నాలుగో రౌండ్‌కు చేరుకుంది. ఇక తొమ్మిదో సీడ్ గార్బిన్ ముగురుజాకు మూడో రౌండ్‌లో చుక్కెదురైంది. మూడో రౌండ్‌లో పెట్రో క్విటోవా చేతిలో 5-7, 6-3, 7-6(12-10)తో ఓడిపోయిన ముగురజా ఇంటిబాట పట్టింది. కాగా క్వార్టర్స్‌లో క్విటోవా.. అమెరికాకు చెందిన జెస్సీకా పెగులాతో తలపడనుంది.
🎾🇪🇸 نُقطة المُباراة والفوز رقم 1066 لرافاييل نادال بمسيرته الإحترافية والرقم 38 لهُ بهذا الموسم 👏🏻 #RafaelNadal𓃵 pic.twitter.com/jpxVTtmDOM
— عشاق التنس Arab Tennis (@ArabTennis20) September 4, 2022