యూఎస్ ఓపెన్‌కు నాదల్ దూరం | Rafael Nadal to miss U.S. Open with wrist injury | Sakshi
Sakshi News home page

యూఎస్ ఓపెన్‌కు నాదల్ దూరం

Published Tue, Aug 19 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

యూఎస్ ఓపెన్‌కు  నాదల్ దూరం

యూఎస్ ఓపెన్‌కు నాదల్ దూరం

బార్సిలోనా: గతేడాది యూఎస్ ఓపెన్ గెలుచుకున్న స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్ గాయం కారణంగా ఈసారి బరిలోకి దిగడం లేదు. మణికట్టు గాయంతో బాధపడుతున్న 28 ఏళ్ల నాదల్ గత నెల వింబుల్డన్‌లో ఓటమి అనంతరం టెన్నిస్‌కు దూరంగా ఉన్నాడు. ‘ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో ఆడలేకపోతున్నందుకు క్షమించాలి. గత మూడేళ్లుగా ఈ టోర్నీలో నేను ఫైనల్స్ ఆడాను. ఇది నాకు కష్టకాలం. తిరిగి బరిలోకి దిగేందుకు అత్యుత్తమ స్థాయిలో కష్టపడతాను’ అని తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement