
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన యుఎస్ ఓపెన్ ఫైనల్‌లో ట్యునీషియాకు చెందిన ఓన్స్ జబీర్‌ను ఓడించి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 52 నిమిషాలు పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6-2, 7-6, (7-5) తేడాతో ఓన్స్ జబీర్‌పై స్వియాటెక్ విజయం సాధించింది.
ఈ విజయంతో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను పోలాండ్ భామ తన ఖాతాలో వేసుకుంది. అదే విధంగా 2016 తర్వాత ఒకే సీజన్‌లో రెండు గ్రాండ్ స్లామ్‌లను గెలుచుకున్న మొదటి మహిళగా స్వియాటెక్ నిలిచింది.
చదవండి: IND-W vs ENG-W: భారత్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం!
Comments
Please login to add a commentAdd a comment