లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్‌సీడ్ ఇగా స్వియటెక్ (పోలండ్) 6-4, 4-6, 6-3తో లెస్లీ కెర్కోవ్ (నెదర్లాండ్స్)పై గెలుపొందగా, అన్‌సీడెడ్ కెటీ బౌల్టర్ (ఇంగ్లండ్) 3-6, 7-6 (7/4), 6-4తో ఆరో సీడ్ కరోలినా ప్లిస్కొవా (చెక్ రిపబ్లిక్)కు షాకిచ్చింది. నాలుగో సీడ్ పౌలా బడొసా (స్పెయిన్) 6-3, 6-2తో ఇరినా (రొమేనియా)పై, 12వ సీడ్ ఒస్టాపెంకొ (లాత్వియా) 6-2, 6-2తో విక్‌మయేర్ (బెల్జియం)పై అలవోక విజయం సాధించారు.
మరో వైపు పురుషుల విభాగంలో రెండు సార్లు చాంపియన్ (2013, 2016), బ్రిటన్ స్టార్ అండీ ముర్రే ఈ సారి రెండో రౌండ్‌తోనే సరిపెట్టుకున్నాడు. ముర్రే 4-6, 6-7 (4/7), 7-6 (7/3), 4-6తో 20వ సీడ్ జాన్ ఇస్నర్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్లో స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ నాదల్ 6-4, 6-4, 4-6, 3-0తో రికార్డస్ బెరంకిస్ (లిథువేనియా)పై ఆధిక్యంలో ఉన్న దశలో వర్షంతో మ్యాచ్ ఆగిపోయింది. నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6-2, 6-3, 7-5తో జోర్డాన్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. 16వ సీడ్ సిమోన హలెప్ (రొమేనియా) 7-5, 6-4తో ఫ్లిప్‌కెన్స్ (బెల్జియం)పై, 25వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 7-6 (7/5)తో అన బొగ్దన్ (రొమేనియా)పై గెలుపొందారు.
చదవండి: SL VS AUS 1st Test Day 2: వర్ష బీభత్సానికి అతలాకుతలమైన స్టేడియం
Comments
Please login to add a commentAdd a comment