
Madrid Open: మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను ఓడించి బెలారస్ స్టార్ సబలెంకా మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీలో రెండోసారి చాంపియన్‌గా నిలిచింది.
2021లో ఈ టైటిల్‌ను నెగ్గిన రెండో ర్యాంకర్ సబలెంకా ఈ ఏడాది ఫైనల్లో 6–3, 3–6, 6–3తో స్వియాటెక్‌పై గెలిచింది. సబలెంకా కెరీర్‌లో ఇది 12వ సింగిల్స్ టైటిల్. విజేతగా నిలిచిన సబలెంకాకు 11,05,265 యూరోల (రూ. 10 కోట్ల 12 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment