Madrid open
-
వరల్డ్ నంబర్ వన్‌కు షాక్
Madrid Open: మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను ఓడించి బెలారస్ స్టార్ సబలెంకా మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీలో రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. 2021లో ఈ టైటిల్‌ను నెగ్గిన రెండో ర్యాంకర్ సబలెంకా ఈ ఏడాది ఫైనల్లో 6–3, 3–6, 6–3తో స్వియాటెక్‌పై గెలిచింది. సబలెంకా కెరీర్లో ఇది 12వ సింగిల్స్ టైటిల్. విజేతగా నిలిచిన సబలెంకాకు 11,05,265 యూరోల (రూ. 10 కోట్ల 12 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. -
Madrid Open 2023: అద్భుత ప్రదర్శన.. ఫైనల్లో బోపన్న జోడీ
మాడ్రిడ్: ఈ సీజన్లో తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ నాలుగో టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 5–7, 7–6 (7/3), 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీని ఓడించింది. మాడ్రిడ్ మాస్టర్స్ టోర్నీలో బోపన్న ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 2015లో ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన బోపన్న, 2016లో రన్నరప్‌గా నిలిచాడు. ఏడేళ్ల తర్వాత మరోసారి ఈ టోర్నీ లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ సీజన్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో, దోహా ఓపెన్‌లో టైటిల్ సాధించి, రోటర్‌డామ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. బోరిస్ గెల్ఫాండ్‌పై అర్జున్ గెలుపు టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ శుభారంభం చేశాడు. స్వీడన్లో గురువారం మొదలైన ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లు జరుగుతాయి. తొలి రౌండ్లో 19 ఏళ్ల అర్జున్ 41 ఎత్తుల్లో ఇజ్రాయెల్ గ్రాండ్‌మాస్టర్ బోరిస్ గెల్ఫాండ్‌పై గెలుపొందాడు. 54 ఏళ్ల గెల్ఫాండ్ 2012 ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో విశ్వనాథన్ ఆనంద్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. -
Madrid Open: టోర్నీ నుంచి వైదొలిగిన బియాంక
మాడ్రిడ్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మాజీ చాంపియన్, మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా) కరోనా వైరస్ బారిన పడింది. ఈనెల 29 నుంచి జరిగే మాడ్రిడ్ ఓపెన్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. మాడ్రిడ్‌కు బయలుదేరేముందు నిర్వహించిన రెండు పరీక్షల్లో 20 ఏళ్ల ఆండ్రెస్కూకు నెగెటివ్ రాగా... మాడ్రిడ్‌లో అడుగుపెట్టాక పాజిటివ్ రావడంతో టోర్నీ నుంచి వైదొలిగింది. చదవండి: World Chess Championship: కార్ల్సన్ ప్రత్యర్థి అతడే! -
మాడ్రిడ్ మాస్టర్ జకోవిచ్
మాడ్రిడ్: ప్రపంచ నెం.1, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్ చేరింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ముగిసిన మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్–1000 సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ తుదిపోరులో జకో 6–3, 6–4తో గ్రీస్ యువ సంచలనం స్టెఫానో సిట్సిపాస్‌పై గెలు పొందాడు. గంటా 32 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌ల్లో సిట్సిపాస్ నుంచి జకోవిచ్‌కు పెద్ద ప్రతిఘటన ఎదురుకాలేదు. దీంతో తొలి సెట్ ఆరంభమైన 12 నిమిషాల్లోనే 3–0తో ఆధిక్యంలోకి వెళ్లిన జకోవిచ్ ఆ తర్వాత మరో మూడు పాయింట్లు సాధించి 6–3తో 40 నిమిషాల్లోనే సెట్‌ను ముగించాడు. రెండో సెట్లో సిట్సిపాస్ పుంజుకోవడంతో హోరాహోరీ సాగింది. ఒక దశలో 4–4తో సమంగా నిలిచినప్పటికీ జకోవిచ్ మరోసారి విజృంభించి సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు. జకోవిచ్ రెండు ఏస్‌లు సంధించి, రెండు బ్రేక్ పాయింట్లు గెలుచు కోగా, సిట్స్పాస్ ఒక ఏస్ మాత్రమే కొట్టి, ఒక అనవసర తప్పిదం చేశాడు. జకోవిచ్ ఖాతాలో ఇది 33వ ఏటీపీ మాస్టర్స్–1000 టైటిల్. మొత్తమ్మీద అతని ఖాతాలో 74 టైటిళ్లు ఉన్నాయి. -
థీమ్ చేతిలో ఫెడరర్‌కు షాక్
మాడ్రిడ్: మూడేళ్ల తర్వాత క్లే కోర్టులపై పునరాగమనం చేసిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పోరాటం మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ ఫెడరర్ 6–3, 6–7 (11/13), 4–6తో ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ రెండు మ్యాచ్ పాయింట్లను చేజార్చుకున్నాడు. రెండో సెట్ టైబ్రేక్‌లో 8–7 వద్ద, 10–9 వద్ద ఫెడరర్‌కు గెలిచే అవకాశం వచ్చినా వాటిని వృథా చేసుకున్నాడు. కీలకదశలో సంయమనంతో ఆడిన థీమ్ రెండో సెట్‌ను టైబ్రేక్‌లో సొంతం చేసుకున్నాడు. అనంతరం మూడో సెట్లోని మూడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన థీమ్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఫెడరర్‌తో ఇప్పటివరకు ఆరుసార్లు తలపడిన థీమ్ నాలుగుసార్లు గెలుపొందడం విశేషం. -
ముచ్చటగా మూడోసారి...
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీ మాడ్రిడ్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఫైనల్లో క్విటోవా 7–6 (8/6), 4–6, 6–3తో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. తద్వారా ఈ టోర్నీని మూడుసార్లు గెలిచిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 2011, 2015లలో కూడా క్విటోవా ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. విజేత క్విటోవాకు 11,90,490 యూరోల (రూ. 9 కోట్ల 58 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
29 మాస్టర్స్ టైటిల్స్ తో రికార్డు!
కెరీర్లో 29వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ వశం * ఫైనల్లో ముర్రేపై విజయం * రూ. 6 కోట్ల 93 లక్షల ప్రైజ్‌మనీ సొంతం మాడ్రిడ్: ఈ సీజన్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఐదో టైటిల్‌ను సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో ఈ సెర్బియా స్టార్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రెండు గంటల ఆరు నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-2, 3-6, 6-3తో డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలుపొందాడు. ఈ విజయంతో జొకోవిచ్ అత్యధికంగా 29 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్‌ను నెగ్గిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఈ టోర్నీకి ముందు జొకోవిచ్, నాదల్ 28 టైటిల్స్‌తో సమఉజ్జీగా నిలిచారు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 9,12,000 యూరోల (రూ. 6 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా జొకోవిచ్‌కిది 64వ సింగిల్స్ టైటిల్. ఈ క్రమంలో అతను కెరీర్లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో బోర్గ్ (స్వీడన్), సంప్రాస్ (అమెరికా)తో కలిసి సంయుక్తంగా ఏడో స్థానానికి చేరుకున్నాడు. కానర్స్ (అమెరికా-109 టైటిల్స్), లెండిల్ (అమెరికా-94), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్-88 టైటిల్స్) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. రెండో ర్యాంక్‌లోకి ఫెడరర్ మాడ్రిడ్ ఓపెన్‌లో టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమైన ఆండీ ముర్రే రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. దాంతో ఆరు నెలల తర్వాత ఫెడరర్ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. జొకోవిచ్ 16,550 పాయింట్లతో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. -
ఫైనల్లో సానియా జోడి
మాడ్రిడ్:భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ పోరులో సానియా ద్వయం 6-2, 6-0 తేడాతో వానియా కింగ్ (అమెరికా)-అల్లా కుద్రెత్సోవా (రష్యా)పై గెలిచి ఫైనల్ చేరింది. 50 నిమిషాల పాటు జరిగిన పోరులో సానియా జోడి ఆద్యంత ఆకట్టుకుని తుది పోరుకు సిద్ధమైంది. ఈ సీజన్లో ఇప్పటికే నాలుగు టైటిల్ సాధించిన సానియా జోడి.. మరో టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇదిలా ఉండగా, సానియా జోడికి ఇది వరుసగా రెండో ఫైనల్. అంతకుముందు స్టట్గర్ట్ టోర్నమెంట్లో సానియా-హింగిస్ ల ద్వయం ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. -
మాడ్రిడ్ ఫైనల్లో నడాల్
మాడ్రిడ్: స్పెయిన్ యోధుడు రఫెల్ నడాల్ మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో నడాల్ 6-4, 6-3తో స్పెయిన్‌కే చెందిన రాబర్ట్ బాటిస్టాపై విజయం సాధించాడు. గంటా 43 నిమిషాల పాటు జరిగిన పోరులో నడాల్ వరుస సెట్లో విజయం సాధించాడు. ఈ టోర్నీలో నడాల్ ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరాడు. ఫైనల్లో నడాల్ జపాన్ ఆటగాడు కీ నిషికొరితో తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్లో రష్యా భామ మరియా షరపోవా, నాలుగో సీడ్ సిమోనా హలెప్ తలపడనున్నారు.