ఫైనల్లో సానియా జోడి | Sania mirza, Martina Hingis inch closer to fifth title of 2016 season | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సానియా జోడి

Published Fri, May 6 2016 7:33 PM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM

Sania mirza, Martina Hingis inch closer to fifth title of 2016 season

మాడ్రిడ్:భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ పోరులో సానియా ద్వయం 6-2, 6-0 తేడాతో వానియా కింగ్ (అమెరికా)-అల్లా కుద్రెత్సోవా (రష్యా)పై గెలిచి ఫైనల్ చేరింది.

 

50 నిమిషాల పాటు జరిగిన పోరులో సానియా జోడి ఆద్యంత ఆకట్టుకుని తుది పోరుకు సిద్ధమైంది. ఈ సీజన్లో ఇప్పటికే నాలుగు టైటిల్ సాధించిన సానియా జోడి.. మరో టైటిల్కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది.  ఇదిలా ఉండగా, సానియా జోడికి ఇది వరుసగా రెండో ఫైనల్. అంతకుముందు స్టట్గర్ట్ టోర్నమెంట్లో సానియా-హింగిస్ ల ద్వయం ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement