Roland Garros stadium
-
జొకోవిచ్‌దే ఫ్రెంచ్ ఓపెన్.. ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మెన్స్ సింగిల్స్ విజేతగా సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో కాస్పర్ రూడ్‌పై 7-6 6-3 7-5 తేడాతో విజయం సాధించాడు. జొకోవిచ్ ఖాతాలో ఇది మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కాగా.. ఓవరాల్‌గా 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఓపెన్ శకంలో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన తొలి ఆటగాడిగా జొకోవిచ్ చరిత్రకెక్కాడు. 🏆 Forever raising the bar 🏆@DjokerNole masters Casper Ruud 7-6(1), 6-3, 7-5 to win a third Roland-Garros title and an unprecedented 23rd Grand Slam men’s singles title.⁰#RolandGarros pic.twitter.com/9IfTi39alB— Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time 21:50: మూడోసెట్లో హోరాహోరీ మూడోసెట్లో జొకోవిచ్, కాస్పర్ రూడ్ల్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటివరకు 5-5తో సమానంగా ఉండడంతో సెట్ టైబ్రేక్‌కు దారితీసే అవకాశం ఉంది. Time: 20:50: రెండో సెట్లో గెలుపు జొకోవిచ్‌దే తొలిసెట్‌ను గెలుచుకోవడానికి కష్టపడిన జొకోవిచ్‌కు రెండో సెట్లో మాత్రం పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వలేదు. 6-3తో రెండో సెట్‌ను గెలుచుకున్న జొకోవిచ్ కేవలం 45 నిమిషాల్లోనే కాస్పర్ రూడ్‌ను ఓడించి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. మరికొద్ది సేపట్లో నిర్ణయాత్మక మూడోసెట్ జరగనుంది. Too strong. @DjokerNole takes the 2nd. #RolandGarros pic.twitter.com/uv2pb44Esh — Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time: 20:45.. రెండో సెట్లో దూకుడు మీదున్న జొకోవిచ్ తొలిసెట్‌ను సొంతం చేసుకున్న జొకోవిచ్ రెండో సెట్లోనూ దూకుడు కనబరుస్తున్నాడు. తొలిసెట్లో పోటీ ఇచ్చిన రూడ్ ఒక్కసారి మాత్రమే జొకోవిచ్ సర్వీస్ బ్రేక్ చేయగలిగాడు. అదే సమయంలో జొకోవిచ్ మాత్రం నాలుగుసార్లు రూడ్ సర్వీస్ బ్రేక్ చేయగలిగాడు. ప్రస్తుతం జొకోవిచ్ 5-2తో రెండోసెట్లో ఆధిక్యంలో ఉన్నాడు. Time:20:06.. తొలి సెట్ సొంతం చేసుకున్న జొకోవిచ్ ఇక హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను జొకోవిచ్ సొంతం చేసుకున్నాడు. తొలి సెట్లో ఇద్దరు పోటాపోటీగా తలపడ్డారు. జొకో సర్వీస్‌లను బ్రేక్ చేస్తూ ఒక దశలో కాస్పర్ రూడ్ 3-0తో ఆధిక్యంలో కనిపించాడు. అయితే జొకోవిచ్ మళ్లీ ఫుంజుకొని రూడ్ సర్వీస్ బ్రేక్ చేసి మూడు పాయింట్లు సాధించాడు. దీంతో 6-6తో తొలి సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. ఇక కీలక టైబ్రేక్‌లో జొకోవిచ్ తన జోరు చూపించి విన్నర్స్ సంధించి 7-6(7-1)తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. Here, there, everywhere 🏃♂️#RolandGarros pic.twitter.com/VuWtw0fCN2 — Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time: 18:30.. ప్రారంభమైన ఫైనల్ పోరు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా జొకోవిచ్, కాస్పర్ రూడ్ మధ్య జరుగుతున్న పురుషుల సింగిల్స్ ఫైనల్ హోరాహోరీగా మొదలైంది. 23వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న పట్టుదలతో జొకోవిచ్ ఒకవైపు ఉంటే.. జొకో జోరుకు అడ్డుకట్ట వేయాలనే యోచనతో కాస్పర్ రూడ్ ఉన్నాడు. -
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత స్వియాటెక్
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా వరల్డ్ నెంబర్ వన్.. పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి కరోలినా ముకోవాపై 6-2,5-7,6-4తో గెలుపొందింది. 2 గంటల 46 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను ఇగా స్వియాటెక్ 6-2తో పెద్దగా కష్టపడకుండానే సొంతం చేసుకుంది. అయితే రెండోసెట్లో ఫుంజుకున్న కరోలినా ముకోవా స్వియాటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 7-5తో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక కీలకమైన మూడో సెట్లో తన అనుభవాన్నంతా రంగరించిన స్వియాటెక్ కరోలినాకు అవకాశం ఇవ్వకుండా 6-4తో సెట్ గెలవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గడం ఇది మూడోసారి. 2020, 2022లో విజేతగా అవతరించిన స్వియాటెక్.. 2023లోనే విజేతగా నిలిచి హ్యాట్రిక్ ఫ్రెంచ్ఓపెన్ను కైవసం చేసుకుంది. గత నాలుగేళ్లలో రోలాండ్ గారోస్ టైటిల్‌ను మూడుసార్లు నెగ్గిన క్రీడాకారిణిగా స్వియాటెక్ చరిత్ర సృష్ఠించింది. THAT MOMENT 🥹🇵🇱#RolandGarros #Paris @iga_swiatek @WTA pic.twitter.com/Dy0NnNLOZD — Roland-Garros (@rolandgarros) June 10, 2023 Hat's off, champ 🤭#RolandGarros | @iga_swiatek pic.twitter.com/Iw49NVgC9K — Roland-Garros (@rolandgarros) June 10, 2023 చదవండి: 'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్‌లోనే ఉంది!' -
French Open 2021: నాదల్ ఓటమి.. ఫైనల్లో జకోవిచ్
పారిస్: ప్రపంచం నెంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ టోర్నీలో అడుగుపెట్టాడు. 13 సార్లు ఛాంపియన్ అయిన రఫెల్ నాదల్‌ను జకోవిచ్ చిత్తుగా ఓడించాడు. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి రొలాండ్‌గారోస్‌లో జరిగిన మ్యాచ్‌లో జకోవిచ్ 3-6, 6-3, 7-6(7/4), 6-2 సెట్స్‌తో నాదల్‌ను ఓడించడం విశేషం. నాదల్‌కి గత పదహారేళ్లలో(2005 నుంచి) క్లే కోర్టు గ్రాండ్ స్లామ్లో ఆడిన 108 మ్యాచ్‌లలో ఇది మూడో ఓటమి కాగా, 14 సెమీ ఫైనల్స్‌లో మొదటి ఓటమి. అంతేకాదు ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌ను రెండుసార్లు ఓడించిన ఏకైక వ్యక్తి జకోవిచ్ కావడం విశేషం. ఇక రోలాండ్ గారోస్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదటి సెట్‌నే కోల్పోవడం రఫెల్ నాదల్‌కి ఇదే ఫస్ట్ టైం. జకోవిచ్ గనుక ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిస్తే.. 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ దక్కించుకోవడంతో పాటు నాలుగు గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ రెండేసి సార్లు గెల్చుకున్న ప్లేయర్‌గా రికార్డు సొంతం చేసుకుంటాడు. కాగా, ఓటమిపై నాదల్ స్పందిస్తూ. ‘బెస్ట్ ప్లేయర్ గెలిచాడు’ అని జకోవిచ్‌పై పొగడ్తలు గుప్పించగా. 34 ఏళ్ల సెర్బియన్ ప్లేయర్ జకోవిచ్ తన విక్టరీలలో ఇది గొప్పదని చెప్పుకొచ్చాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 4️⃣ hours and 1️⃣1️⃣ minutes You've earned that smile @DjokerNole!#RolandGarros pic.twitter.com/75wWsWNUwY — Roland-Garros (@rolandgarros) June 11, 2021 ఇక జకోవిచ్ ఆదివారం జరగబోయే ఫైనల్మ్యాచ్లో స్టెఫనోస్ సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న మొట్టమొదటి గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్ కావడం విశేషం. గతంలో మూడుసార్లు గ్రాండ్ స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయిన ఈ యువ కెరటం.. శుక్రవారం జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడి మూడున్నర గంటల హోరాహోరీ పోరు తర్వాత విజయం సాధించాడు. చదవండి: ట్రాప్ చేసి వీడియో తీయమన్నారు -
రోలాండ్ గారోస్‌లో నాదల్ 100వ విజయం
-
జొకోవిచ్ కొత్త చరిత్ర
పారిస్: ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఓపెన్ శకంలో వరుసగా పదేళ్లు ఈ టోర్నీలో కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో జాన్ లెనార్డ్ స్ట్రాఫ్ (జర్మనీ)పై అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 2005 నుంచి క్రమం తప్పకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న జొకోవిచ్ 2010 నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు క్వార్టర్ ఫైనల్‌కు, రెండుసార్లు సెమీఫైనల్‌కు, నాలుగుసార్లు ఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జొకోవిచ్ ఆడతాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జ్వెరెవ్ 3–6, 6–2, 6–2, 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్ ఫాగ్నిని (ఇటలీ)పై... ఏడో సీడ్ నిషికోరి (జపాన్) 6–2, 6–7 (8/10), 6–2, 6–7 (8/10), 7–5తో బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–4, 6–2తో మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పెయిర్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక ఐదో సెట్లో నిషికోరి 1–4, 3–5తో వెనుకబడినప్పటికీ పుంజుకొని నెగ్గడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్‌తో నిషికోరి తలపడతాడు. క్వార్టర్స్‌లో హలెప్, కీస్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా), ఎనిమిదో సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), 14వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), అన్‌సీడెడ్ అనిసిమోవా (అమెరికా) క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో హలెప్ 6–1, 6–0తో స్వియాటెక్ (పోలాండ్)పై, యాష్లే బార్టీ 6–3, 3–6, 6–0తో సోఫియా కెనిన్ (అమెరికా)పై, కీస్ 6–2, 6–4తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, 17 ఏళ్ల అనిసిమోవా 6–3, 6–0తో క్వాలిఫయర్ అలియోనా బొల్సోవా (స్పెయిన్)పై విజయం సాధించారు. మూడో రౌండ్లో టాప్ సీడ్ నయోమి ఒసాకా (జపాన్)పై నెగ్గిన సినియకోవా, అమెరికా దిగ్గజం సెరెనాను ఓడించిన సోఫియా కెనిన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం తడబడ్డారు. -
ఫ్రెంచ్ ఓపెన్‌లో షరపోవా జోరు
-
ఆ నలుగురి కోసం...
సంచలనాలకు మారుపేరు, మహామహులే ‘ఎర్ర’ మట్టికరిచే రోలండ్ గారోస్ స్టేడియంకు 86 ఏళ్ల చరిత్ర ఉంది. 1927వ సంవత్సరం ఫ్రాన్స్ టెన్నిస్ లోకానికి చిరకాలం గుర్తుండిపోతుంది. ఆ దేశపు ఆటగాళ్లు జాక్వస్ బ్రూగ్నాన్, జీన్ బొరోట్రా, హెన్సీ కోచెట్, రెనీ లాకోస్ట్ కలసి అప్పట్లో అతి పెద్ద సంచలనాన్ని నమోదు చేశారు. ఈ నలుగురు అమెరికా గడ్డపై అమెరికాను ఓడించి డేవిస్‌కప్‌ను గెలుచుకున్నారు. నిబంధన ప్రకారం తర్వాతి ఏడాది ఈ రెండు జట్ల మధ్యే ఫ్రాన్స్‌లో రీ మ్యాచ్ కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే డేవిస్ కప్‌లాంటి పెద్ద ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే స్థాయి స్టేడియం పారిస్‌లో లేదు. ఒక రకంగా పరువు పోగొట్టుకునే పరిస్థితి తయారైంది. ఈ దశలో ఒక ప్రైవేట్ క్లబ్‌కు చెందినవారు మూడు హెక్టార్ల భూమి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే కొన్నాళ్ల క్రితం మరణించిన తమ క్లబ్ సీనియర్ సభ్యుడు రోలండ్ గారోస్ పేరు దానికి పెట్టాలని షరతు విధించారు. విమానయాన రంగ నిపుణుడైన గారోస్‌కు మధ్యధరా సముద్రం మీదుగా విమానం నడిపిన తొలి వ్యక్తిగా కూడా గుర్తింపు ఉంది. దాంతో 1928లో రోలండ్ గారోస్ స్టేడియం సిద్ధమైంది. తొలిసారి అక్కడే ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ (ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్) టోర్నీని నిర్వహించారు. అదే ఏడాది చివర్లో ఫ్రాన్స్-అమెరికా పోరు కూడా అక్కడే జరిగింది. ఈ సారి కూడా ఫ్రెంచివారు తమ ఆధిక్యం ప్రదర్శిస్తూ సొంతగడ్డపై కూడా చెలరేగి డేవిస్‌కప్‌ను నిలబెట్టుకున్నారు. తమ దేశపు గౌరవం కాపాడేందుకు ఆ నలుగురి కోసం కొత్త స్టేడియంను కట్టాల్సి వచ్చింది.