జొకోవిచ్‌దే ఫ్రెంచ్‌ ఓపెన్‌.. ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్‌ | French Open 2023 Mens Single Final Djokovic Vs Casper-Rudd-Live Updates | Sakshi
Sakshi News home page

French Open 2023 Final: జొకోవిచ్‌దే ఫ్రెంచ్‌ ఓపెన్‌.. ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్‌

Published Sun, Jun 11 2023 8:23 PM | Last Updated on Sun, Jun 11 2023 10:12 PM

French Open 2023 Mens Single Final Djokovic Vs Casper-Rudd-Live Updates - Sakshi

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మెన్స్‌ సింగిల్స్‌ విజేతగా సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో కాస్పర్‌ రూడ్‌పై 7-6 6-3 7-5 తేడాతో విజయం సాధించాడు. జొకోవిచ్‌ ఖాతాలో ఇది మూడో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కాగా.. ఓవరాల్‌గా 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం. ఓపెన్‌ శకంలో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన తొలి ఆటగాడిగా జొకోవిచ్‌ చరిత్రకెక్కాడు.

Time 21:50: మూడోసెట్‌లో హోరాహోరీ
మూడోసెట్‌లో జొకోవిచ్‌, కాస్పర్‌ రూడ్‌ల్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటివరకు 5-5తో సమానంగా ఉండడంతో సెట్‌ టైబ్రేక్‌కు దారితీసే అవకాశం ఉంది.

Time: 20:50: రెండో సెట్‌లో గెలుపు జొకోవిచ్‌దే
తొలిసెట్‌ను గెలుచుకోవడానికి కష్టపడిన జొకోవిచ్‌కు రెండో సెట్‌లో మాత్రం పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వలేదు. 6-3తో రెండో సెట్‌ను గెలుచుకున్న జొకోవిచ్ కేవలం 45 నిమిషాల్లోనే కాస్పర్‌ రూడ్‌ను ఓడించి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. మరికొద్ది సేపట్లో నిర్ణయాత్మక మూడోసెట్‌ జరగనుంది. 

Time: 20:45.. రెండో సెట్‌లో దూకుడు మీదున్న జొకోవిచ్‌
తొలిసెట్‌ను సొంతం చేసుకున్న జొకోవిచ్‌ రెండో సెట్‌లోనూ దూకుడు కనబరుస్తున్నాడు. తొలిసెట్‌లో పోటీ ఇచ్చిన రూడ్‌ ఒక్కసారి మాత్రమే జొకోవిచ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేయగలిగాడు. అదే సమయంలో జొకోవిచ్‌ మాత్రం నాలుగుసార్లు రూడ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేయగలిగాడు. ప్రస్తుతం జొకోవిచ్‌ 5-2తో రెండోసెట్‌లో ఆధిక్యంలో ఉన్నాడు.

Time:20:06.. తొలి సెట్‌ సొంతం చేసుకున్న జొకోవిచ్‌
ఇక హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను జొకోవిచ్‌ సొంతం చేసుకున్నాడు. తొలి సెట్‌లో ఇద్దరు పోటాపోటీగా తలపడ్డారు. జొకో సర్వీస్‌లను బ్రేక్‌ చేస్తూ  ఒక దశలో కాస్పర్‌ రూడ్‌ 3-0తో ఆధిక్యంలో కనిపించాడు. అయితే జొకోవిచ్‌ మళ్లీ ఫుంజుకొని రూడ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసి మూడు పాయింట్లు సాధించాడు. దీంతో 6-6తో తొలి సెట్‌ టైబ్రేక్‌కు దారి తీసింది. ఇక కీలక టైబ్రేక్‌లో జొకోవిచ్‌ తన జోరు చూపించి విన్నర్స్‌ సంధించి 7-6(7-1)తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు.

Time: 18:30.. ప్రారంభమైన ఫైనల్‌ పోరు


ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా జొకోవిచ్‌, కాస్పర్‌ రూడ్‌ మధ్య జరుగుతున్న పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ హోరాహోరీగా మొదలైంది. 23వ గ్రాండ్‌స్లామ్‌ గెలవాలన్న పట్టుదలతో జొకోవిచ్‌ ఒకవైపు ఉంటే.. జొకో జోరుకు అడ్డుకట్ట వేయాలనే యోచనతో కాస్పర్‌ రూడ్‌ ఉన్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement