French Open Grand Slam tournament final
-
జొకోవిచ్‌దే ఫ్రెంచ్ ఓపెన్.. ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మెన్స్ సింగిల్స్ విజేతగా సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో కాస్పర్ రూడ్‌పై 7-6 6-3 7-5 తేడాతో విజయం సాధించాడు. జొకోవిచ్ ఖాతాలో ఇది మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కాగా.. ఓవరాల్‌గా 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఓపెన్ శకంలో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన తొలి ఆటగాడిగా జొకోవిచ్ చరిత్రకెక్కాడు. 🏆 Forever raising the bar 🏆@DjokerNole masters Casper Ruud 7-6(1), 6-3, 7-5 to win a third Roland-Garros title and an unprecedented 23rd Grand Slam men’s singles title.⁰#RolandGarros pic.twitter.com/9IfTi39alB— Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time 21:50: మూడోసెట్లో హోరాహోరీ మూడోసెట్లో జొకోవిచ్, కాస్పర్ రూడ్ల్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటివరకు 5-5తో సమానంగా ఉండడంతో సెట్ టైబ్రేక్‌కు దారితీసే అవకాశం ఉంది. Time: 20:50: రెండో సెట్లో గెలుపు జొకోవిచ్‌దే తొలిసెట్‌ను గెలుచుకోవడానికి కష్టపడిన జొకోవిచ్‌కు రెండో సెట్లో మాత్రం పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వలేదు. 6-3తో రెండో సెట్‌ను గెలుచుకున్న జొకోవిచ్ కేవలం 45 నిమిషాల్లోనే కాస్పర్ రూడ్‌ను ఓడించి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. మరికొద్ది సేపట్లో నిర్ణయాత్మక మూడోసెట్ జరగనుంది. Too strong. @DjokerNole takes the 2nd. #RolandGarros pic.twitter.com/uv2pb44Esh — Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time: 20:45.. రెండో సెట్లో దూకుడు మీదున్న జొకోవిచ్ తొలిసెట్‌ను సొంతం చేసుకున్న జొకోవిచ్ రెండో సెట్లోనూ దూకుడు కనబరుస్తున్నాడు. తొలిసెట్లో పోటీ ఇచ్చిన రూడ్ ఒక్కసారి మాత్రమే జొకోవిచ్ సర్వీస్ బ్రేక్ చేయగలిగాడు. అదే సమయంలో జొకోవిచ్ మాత్రం నాలుగుసార్లు రూడ్ సర్వీస్ బ్రేక్ చేయగలిగాడు. ప్రస్తుతం జొకోవిచ్ 5-2తో రెండోసెట్లో ఆధిక్యంలో ఉన్నాడు. Time:20:06.. తొలి సెట్ సొంతం చేసుకున్న జొకోవిచ్ ఇక హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను జొకోవిచ్ సొంతం చేసుకున్నాడు. తొలి సెట్లో ఇద్దరు పోటాపోటీగా తలపడ్డారు. జొకో సర్వీస్‌లను బ్రేక్ చేస్తూ ఒక దశలో కాస్పర్ రూడ్ 3-0తో ఆధిక్యంలో కనిపించాడు. అయితే జొకోవిచ్ మళ్లీ ఫుంజుకొని రూడ్ సర్వీస్ బ్రేక్ చేసి మూడు పాయింట్లు సాధించాడు. దీంతో 6-6తో తొలి సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. ఇక కీలక టైబ్రేక్‌లో జొకోవిచ్ తన జోరు చూపించి విన్నర్స్ సంధించి 7-6(7-1)తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. Here, there, everywhere 🏃♂️#RolandGarros pic.twitter.com/VuWtw0fCN2 — Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time: 18:30.. ప్రారంభమైన ఫైనల్ పోరు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా జొకోవిచ్, కాస్పర్ రూడ్ మధ్య జరుగుతున్న పురుషుల సింగిల్స్ ఫైనల్ హోరాహోరీగా మొదలైంది. 23వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న పట్టుదలతో జొకోవిచ్ ఒకవైపు ఉంటే.. జొకో జోరుకు అడ్డుకట్ట వేయాలనే యోచనతో కాస్పర్ రూడ్ ఉన్నాడు. -
‘స్వీట్ స్వియాటెక్’
పారిస్ గడ్డపై పోలండ్ గర్ల్ మెరిసింది... తొలి మ్యాచ్‌నుంచి ఒక్క సెట్ కూడా కోల్పోకుండా దూసుకొచ్చిన ఇగా స్వియాటెక్ చివరి వరకు అదే జోరు కొనసాగించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను అందుకొని కొత్త చరిత్ర సృష్టించింది. విజేతగా నిలిచే క్రమంలో ఎన్నో ఘనతలు తన ఖాతాలో వేసుకున్న 19 ఏళ్ల ఈ అమ్మాయి ఆనందానికి ఎర్ర మట్టి కోట వేదికైంది. మరో వైపు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన సోఫియా కెనిన్ మాత్రం ఏమాత్రం పోరాటం ప్రదర్శించకుండా పరాజయంపాలైంది. పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఇగా స్వియాటెక్ (పోలండ్) గెలుచుకుంది. శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో స్వియాటెక్ 6–4, 6–1 తేడాతో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా)ను చిత్తు చేసింది. గంటా 24 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. ఈ టోర్నీకి ముందు 54వ ర్యాంక్‌తో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన పోలండ్ ప్లేయర్ తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 16 లక్షల యూరోలు (సుమారు రూ. 13 కోట్ల 82 లక్షలు), రన్నరప్‌గా నిలిచిన కెనిన్‌కు 8 లక్షల యూరోలు (సుమారు రూ. 7 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. అలవోకగా... మ్యాచ్ ఆరంభంనుంచే ఆధిపత్యం ప్రదర్శించిన స్వియాటెక్ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 3–0తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. అయితే కోలుకున్న కెనిన్ పట్టుదలగా ఆడటంతో స్కోరు 3–3కు చేరింది. ఈ దశలో మళ్లీ బ్రేక్ సాధించిన పోలండ్ అమ్మాయి 5–3తో ముందంజ వేసింది. తర్వాతి గేమ్‌ను కెనిన్‌కు కోల్పోయినా మరుసటి గేమ్‌లో మళ్లీ చెలరేగి సెట్‌ను గెలుచుకుంది. రెండో సెట్లో ఆమెకు తిరుగులేకుండా పోయింది. తొలి గేమ్‌లో స్వియాటెక్ సర్వీస్‌ను కెనిన్ బ్రేక్ చేసి 1–0తో ఆధిక్యం సాధించింది. అయితే ఇక్కడినుంచి ఇగా చెలరేగిపోయింది. వరుసగా ఆరు గేమ్‌లు గెలుచుకొని టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇగా షాట్లకు ప్రత్యర్థి వద్ద సమాధానం లేకపోయింది. తుది పోరులో స్వియాటెక్ 25 విన్నర్లు కొట్టగా 17 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ మాత్రమే చేసింది. స్వియాటెక్ ఘనతలివీ... ► పోలండ్ తరఫున గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి మహిళ ► అన్‌సీడెడ్‌గా దిగి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన రెండో మహిళ ► గత 40 ఏళ్లలో పురుషుల, మహిళల విభాగాల్లో కెరీర్లో తొలి టైటిల్‌గా గ్రాండ్‌స్లామ్‌ను గెలిచిన నాలుగో క్రీడాకారిణి ► మోనికా సెలెస్ (18 ఏళ్ల 187) రోజుల తర్వాత పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన (19 ఏళ్ల 132 రోజులు) మహిళ. ► 1975 తర్వాత ఇంత తక్కువ ర్యాంక్ (54) ఉన్న క్రీడాకారిణి ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం ఇదే మొదటిసారి. -
సూపర్ స్వియాటెక్
పారిస్: ఏమాత్రం అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన పోలాండ్ టీనేజర్ ఇగా స్వియాటెక్ కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఈ అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో 19 ఏళ్ల స్వియాటెక్ 70 నిమిషాల్లో 6–2, 6–1తో క్వాలిఫయర్, 131వ ర్యాంకర్ నదియా పొడొరోస్కా (అర్జెంటీనా)పై గెలుపొందింది. తద్వారా ఓపెన్ శకంలో (1968 నుంచి) ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలి పోలాండ్ క్రీడాకారిణిగా నిలిచింది. 1968కు ముందు ఫ్రెంచ్ చాంపియన్‌షిప్ పేరుతో నిర్వహించిన ఈ టోర్నీలో 1939లో పోలాండ్ క్రీడాకారిణి జద్విగా జెద్రెజౌస్కా ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. 2012లో అగ్నెస్కా రద్వాన్‌స్కా వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాక మరో పోలాండ్ క్రీడాకారిణి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరడం ఇదే ప్రథమం. ఫైనల్ చేరే క్రమంలో స్వియాటెక్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. అన్‌సీడెడ్ హోదాలో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన ఏడో క్రీడాకారిణిగా స్వియాటెక్ గుర్తింపు పొందింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 54వ స్థానంలో ఉన్న స్వియాటెక్ ఇప్పటివరకు మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టూర్ టైటిల్ నెగ్గకపోవడం గమనార్హం. 1975లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తక్కువ ర్యాంకర్ స్వియాటెక్ కావడం విశేషం. శనివారం జరిగే ఫైనల్లో నాలుగో సీడ్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా)తో స్వియాటెక్ అమీతుమీ తేల్చుకుంటుంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరిన తొలి మహిళా క్వాలిఫయర్‌గా రికార్డు నెలకొల్పిన నదియా పొడొరోస్కా కీలకమ్యాచ్‌లో తేలిపోయింది. స్వియాటెక్ దూకుడైన ఆటకు సమాధానం ఇవ్వలేక పొడొరోస్కా మ్యాచ్‌లో కేవలం మూడు గేమ్‌లు గెలిచి సంతృప్తి పడింది. స్వియాటెక్ ఏకంగా 23 విన్నర్స్ కొట్టగా... పొడొరోస్కా కేవలం ఆరింటితో సరిపెట్టుకుంది. ఇద్దరూ 20 చొప్పున అనవసర తప్పిదాలు చేసినా స్వియాటెక్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తుది ఫలితాన్ని శాసించింది. 1983 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇద్దరు అన్‌సీడెడ్ క్రీడాకారిణుల మధ్య సెమీఫైనల్ జరగడం ఇదే తొలిసారి. సోఫియా శ్రమించి... ఇద్దరు సీడెడ్ క్రీడాకారిణుల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్లో ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ 6–4, 7–5తో ఏడో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సోఫియా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 40 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకున్న సోఫియాకు రెండో సెట్లో గట్టిపోటీనే లభించింది. రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన క్విటోవా రెండో సెట్లో ఒకదశలో 3–5తో వెనుకబడింది. ఆ తర్వాత సోఫియా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఆమె స్కోరును 5–5తో సమం చేసింది. కానీ 11వ గేమ్‌లో క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సోఫియా ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. జొకోవిచ్ పదోసారి సెమీస్‌కు... బుధవారం రాత్రి ఆలస్యంగా ముగిసిన పురుషుల సింగిల్స్ చివరి క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) 4–6, 6–2, 6–3, 6–4తో 17వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)పై గెలుపొందాడు. పదోసారి ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి సెట్‌ను కోల్పోయినా పట్టుదలతో పోరాడి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లలో నెగ్గి ఐదో సీడ్ సిట్సిపాస్‌తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. -
రిటైరయ్యే ఆలోచన లేదు: సెరెనా విలియమ్స్
ఈ ఏడాది ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో ఓడినప్పటికీ... తనకు ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచన లేదని అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ స్పష్టం చేసింది. ఈ నెలలోనే ప్రారంభమయ్యే వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగుతానని... టైటిల్ నెగ్గేందుకు తనవంతుగా కృషి చేస్తానని 35 ఏళ్ల సెరెనా తెలిపింది. 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సెరెనా సమం చేస్తుందని ఆమె కోచ్ ప్యాట్రిక్ విశ్వాసం వ్యక్తం చేశారు.