ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం హృదయాన్ని కలిచివేస్తే..అక్కడ జరగుతున్న కొన్ని ఘటనలు అత్యంత విస్తుపోయేలా ఉన్నాయి. తమ వాళ్లను కోల్పోయి వారిని కనుగొనడం, గుర్తుపట్టడంతో నరకయాతన చూస్తుంటే..కొందరు వాటినే క్యాష్ చేసుకోవాలనే దురాలోచనతో ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రిలీఫ్ ఫండ్ కోసం కక్కుర్తి పడి దారుణాలకు తెగబడుతున్నారు. అచ్చం అలానే ఇక్కడో మహిళ అలాంటి దారుణానికే తెగబడి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టుకుంది.
వివరాల్లోకెళ్తే..కటక్ జిల్లాలోని మణిబండకు చెందిన గీతాంజలి దత్తా జూన్ 2న జరిగిన ప్రమాదంలో తన భర్త బిజయ్ దత్తా చనిపోయాడంటూ అక్కడ ఉన్న మృతదేహాన్ని తన భర్తగా గుర్తించినట్లు చెప్పింది. ఐతే డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తర్వాత ఆమె వాదన తప్పు అని తేలింది. దీంతో పోలీసులు ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే ఆమె భర్త మానియబంధ్ మాత్రమే ఊరుకోలేదు. ఏకంగా పోలీస్టేషన్‌కు వచ్చి ఆమెపై ఫిర్యాదు చేశాడు.
గత 13 ఏళ్లుగా విడివిడిగా జీవిస్తున్నట్లు అతను పోలీసులకు తెలిపాడు. ప్రజాధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించినందుకు, పైగా తననే చనిపోయినట్లు ప్రయత్నించినందుకు గీతాంజలిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజయ్ డిమాండ్ చేశారు. ఐతే ఘటన బాలోసోర్ జిల్లాలో బహనాగా పోలీస్టేషన్లో జరిగింది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని గీతాంజలి భర్తకు తెలిపినట్లు మణిబండ పోలీస్టేషన్ ఇన్‌చార్జ్ బసంత్ కుమార్ తెలిపారు.
ఇదిలా ఉండగా, ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా మృతదేహాలపై నకిలీ హక్కుదారుల ముసుగులో వచ్చే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వేస్‌ని, ఒడిశా పోలీసులను కోరారు. కాగా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరణించిన వారి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించగా, ప్రధాని నరేంద్ర మోదీ రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు.
(చదవండి: ఆ దుర్ఘటన మిగిల్చిన కన్నీటి కథలు..తమ వాళ్ల కోసం తల్లడిల్లుతున్న కుటుంబాలు)
Comments
Please login to add a commentAdd a comment