పనికిమాలిన పిల్‌: కోర్టు వినూత్న జరిమానా | Karnataka High Court Orderd A Man to Deposit Rs 5,000 for flood relief | Sakshi
Sakshi News home page

పనికిమాలిన పిల్‌: కోర్టు వినూత్న జరిమానా

Published Fri, Aug 24 2018 2:59 PM | Last Updated on Fri, Aug 24 2018 2:59 PM

Karnataka High Court Orderd A Man to Deposit Rs 5,000 for flood relief  - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్నాటక హైకోర్టు వినూత్న తీర్పునిచ్చింది. టెర్రరిస్తుల దాడిపై తాను చేసిన హెచ‍్చరికను పట్టించుకోలేదంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినకోర్టు పిటిషనరుకు జరిమానా విధించింది. శివమోగ జిల్లా తుడూర్ గ్రామానికి చెందిన హరీశ్చంద్ర గౌడ అనే పిటిషన్‌దారు నవంబరు 26, 2008 ముంబై ఉగ్రదాడిపై తాను అందించిన సమాచారాన్ని పట్టించుకోలేదంటూ పిటిషన్‌దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ పనికిమాలిన పిల్‌గా బెంచ్‌ కొట్టిపారేసింది. రూ.5వేలను కొడగు వరద బాధితులకు అందించాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినేశ్‌ మహేశ్వరి నేతృత‍్వంలోని బెంచ్‌ ఆదేశించింది. 30రోజులలోపు ముఖ్యమంత్రి సహాయనిధి ఈ సొమ్మును డిపాజిట్‌ చేయాలని స్పష్టం చేసింది. అంతేకాదు దీనికి సంబంధించిన మెమోను కూడా కోర్టుకు సమర్పించాలని తెలిపింది. అలాగే ఇకపై ఇలాంటి వ్యర్థమైన పిటిషన్లు దాఖలు చేయవద్దని, నిజమైన సమస్యలపై స్పందించాలని కోరారు.

కాగా నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందినవాడిననీ, 42 సంవత్సరాలు పాటు ఏఐసీసీలో కొనసాగినట్టు గౌడ చెప్పుకున్నారు. 2005లో కూడా తాను అధికారులను హెచ్చరించానని అయినా అధికారులు పటక్టించుకోలేదని వాదించారు.ఈ నేపథ్యంలో 2010జూన్‌లోఅప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు లేఖ రాయగా ఆమె మహారాష్ట్ర మంత్రిత్వశాఖకు రాశారని చెప్పారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎలాంటి చర్యతీసుకోలేదని గౌడ వాదించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement