
న్యూఢిల్లీ: కోవిడ్–19తో చనిపోయిన వారి కుటుం బాలకు పరిహారం విషయంలో నిబంధ నలను రూపొందించేందుకు గడువును సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరో నాలుగు వారాలు పెంచింది. మార్గదర్శకాల రూపకల్పన పూర్తి కావొస్తోందనీ, వాటిని పూర్తి స్థాయిలో పరిశీలిం చేందుకు మరి కొంత సమయం కావాలన్న కేంద్రం అభ్యర్థన మేరకు సోమవారం జస్టిస్ డీవై చంద్ర చూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలిచ్చింది.
జూన్ 30వ తేదీన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ధర్మాసనానికి నివేదించారు. మరి కొన్ని ఆదేశాల అమలు తీరును పూర్తి స్థాయిలో వివరిస్తూ, దాన్ని కోర్టు ఎదుటకు తీసుకొచ్చి అఫిడవిట్ రూపంలో దాఖలు చేసేందుకు రెండు వారాలు కావాలని కోరారు. దీంతో, కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో మార్గదర్శకాల రూపకల్పనకు 4 వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment