అవన్నీ పెద్ద పెద్ద టీ కంపెనీలు. కోట్లకు కోట్ల లాభాలు ఆర్జిస్తుంటాయి. కానీ ముఖ్యమంత్రి సహాయ నిధికి అవన్నీ కలిపి మరీ ఇచ్చిన విరాళం మాత్రం 15.23 లక్షల రూపాయలు మాత్రమే!! దీంతో అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్కి ఎక్కడలేని కోపం వచ్చింది. మీరు పారేసే ముష్టి నాకు అక్కర్లేదంటూ ఆ సొమ్మును తిప్పి పంపేశారు. ఇండియన్ టీ అసోసియేషన్ అనే పేరుతో మొత్తం 25 ప్రధాన టీ కంపెనలన్నీ కలిసి మరీ ఇంత తక్కువ మొత్తం ఇవ్వడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ, ఈ కంపెనీలన్నీ భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని మాత్రం ఇవి అస్సలు పట్టించుకోవడంలేదని సీఎంవో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అందుకే ఆ చెక్కులను మొత్తం 25 కంపెనీలకు తిప్పి పంపేస్తున్నారు. మొత్తం అన్ని కంపెనీలలో అత్యల్పంగా 6,675 రూపాయలు పంపగా, అత్యధికంగా 3,88,700 రూపాయలు పంపారు.
మీరు పాడేసే ముష్టి మాకు అక్కర్లేదు: అసోం సీఎం
Published Fri, Nov 29 2013 4:10 PM | Last Updated on Sat, Aug 11 2018 4:36 PM
Advertisement