Assam Chief Minister
-
చొరబాటుదార్లను తరిమికొట్టాలి
రాంచీ: అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ వివాదాస్పద మరోసారి వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ నుంచి చొరబాటుదారులను తరిమికొట్టాలని అన్నారు. లేకపోతే రాష్ట్రంలో హిందువుల జనాభా మరో 20 ఏళ్లలో సగానికి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువులంతా ఐక్యంగా ఉండాలని కోరారు. శనివారం పాలాములో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో హిమంతబిశ్వ శర్మ ప్రసంగించారు. ఆయన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ–ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. చొరబాటుదార్లను బయటకు వెళ్లగొట్టడానికి, హిందువులను కాపాడడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. జార్ఖండ్‌లో పలు ప్రాంతాల్లో హిందువుల జనాభా ఇప్పటికే భారీగా తగ్గిపోయిందని గుర్తుచేశారు. భారతదేశాన్ని హిందువులు కాపాడుతున్నారని, జైశ్రీరామ్ అని నినదించడానికి అందరూ ఐక్యమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఓ వర్గం ప్రజలు ఎల్లప్పుడూ జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకే ఓటు వేస్తున్నారని, హిందువుల ఓట్లు మాత్రం పారీ్టల వారీగా చీలిపోతున్నాయని తెలిపారు. అలా కాకుండా హిందువులంతా ఒక్కటై జేఎంఎం కూటమిని ఓడించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాం«దీపై హిమంతబిశ్వ శర్మ మండిపడ్డారు. రాహుల్ విభజన రాజకీయాలు చేస్తున్నారని, హిందువుల మధ్య చిచ్చుపెట్టి విడదీస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్‌లో అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. అస్సాంలో జార్ఖండ్ గిరిజనులకు గుర్తింపేదీ?: హేమంత్ సోరెన్ అస్సాంలో జార్ఖండ్ గిరిజనుల గుర్తింపును హిమంతబిశ్వ శర్మ ప్రభుత్వం చెరిపేస్తోందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. జార్ఖండ్ నుంచి వెళ్లిన గిరిజనులకు అస్సాంలో ఎస్టీ హోదా కలి్పంచడం లేదని విమర్శించారు. శనివారం కుంతీ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో సోరెన్ మాట్లాడారు. జార్ఖండ్ మూలాలున్న ప్రజలు అస్సాం టీ తోటల్లో పని చేస్తున్నారని, వారి బతుకులు దుర్బరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అస్సాం ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. బీజేపీపై సోరెన్ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ కుల మతాల పేరిట సమాజాన్ని విచి్ఛన్నం చేస్తోందని దుయ్యబట్టారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామని, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హేమంత్ సోరెన్ ధీమా వ్యక్తంచేశారు. -
అస్సాంలో బాలికపై సామూహిక అత్యాచారం
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో దారుణం జరిగింది. నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కలి్పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షిస్తామని, మహిళలకు రక్షణ కలి్పస్తామని హామీ ఇచ్చారు. నాగావ్ జిల్లాలోని ధింగ్ ప్రాంతంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ వచి్చ, ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి, రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలు పదో తరగతి చదువుతోందని, దుండగుల దుశ్చర్య వల్ల గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. స్థానికులు గమనించి, తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. బాధితురాలిని అసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న మరొకడి కోసం గాలింపు ముమ్మరం చేశామని అస్సాం డీజీపీ జి.పి.సింగ్ చెప్పారు. ముష్కరుల ఆగడాలను అడ్డుకుంటాం బాలికపై అత్యాచారం గురించి తెలియగానే శుక్రవారం అస్సాం అట్టుడికిపోయింది. జనం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని మండిçపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో దుకాణాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. మైనర్ బాలికపై అత్యాచార ఘటన ఘటన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అస్సాంలో ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా రెచి్చపోతున్నారని, వారి ఆగడాలను కచి్చతంగా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో గత రెండు నెలల్లో 23 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కొనసాగుతున్న వలసల వల్ల స్థానికులు మైనార్టీలుగా మారిపోతున్నారని చెప్పారు. -
అస్సాం సీఎం శర్మకు ఈసీ నోటీసు
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారం సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో ఈనెల 18వ తేదీన జరిగిన ఎన్నికల ప్రచార సభలో హిమాంత శర్మ మాట్లాడుతూ..‘ఒక చోటికి ఒక అక్బర్ వచ్చాడంటే అతడు మరో 100 మంది అక్బర్లను పిలుస్తాడు. అందుకే సాధ్యమైనంత త్వరగా అక్బర్‌ను పంపించివేయాలి. అలా చేయలేకపోతే కౌశల్య మాత పుట్టిన ఈ నేల అపవిత్రమవుతుంది’ అంటూ రాష్ట్ర కేబినెట్లోని ఏకైక ముస్లిం మంత్రి మహ్మద్ అక్బర్నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తమకు సమాధానమివ్వాలని ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
స్టేజ్ ఎక్కి.. మైక్ లాక్కొని.. అస్సాం సీఎంను నిలదీసే యత్నం!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు శుక్రవారం వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టమైంది. మొజంజాహి (ఎంజే) మార్కెట్ వద్ద హిమంత ఉన్న వేదిక పైకి టీఆర్ఎస్ నేత నంద కిషోర్ వ్యాస్ దూసుకువెళ్లారు. ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ప్రసంగిస్తుండగా అడ్డుకుని మైక్ లాగా రు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంజే మార్కెట్ ప్రాంతానికి చేరుకోవడానికి ముందు హిమంత చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి ఎంజే మార్కెట్ వద్దకు చేరుకున్న హిమంత ఉత్సవ సమితి వేదిక పైకి ఎక్కారు. ఆ సమయంలో భగవంతరావు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పుడు వేదిక పైకి దూసుకెళ్లిన నంద కిషోర్.. భగవంతరావు మైకును పక్కకు లాగారు. పక్కనున్న హిమంతను నిలదీసేందుకు ప్రయత్నించారు. వేదికపై ఉన్న సమితి నేతలు అప్రమత్తమై నంద కిషోర్‌ను బలవంతంగా స్టేజ్ కిందకు తీసుకుపోయారు. అక్కడే ఉన్న మహిళా భక్తులు నంద కిషోర్‌పై అసహనం వ్యక్తం చేయడంతోపాటు ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గులాబీ కండువా ధరించిన నంద కిషోర్ ముఖ్యమంత్రి ఉన్న వేదికపైకి వెళ్తున్నా పోలీసులు అడ్డుకోలేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు మార్కెట్ దగ్గర ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. టీఆర్ఎస్ నేతలు, హిమంతకు పోటీగా మంత్రి తలసాని ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఉత్సవ సమితి సభ్యులు, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. బండి సంజయ్, డీకే అరుణ ఖండన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేత మైక్ లాక్కోవడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. హిమంతపై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు పెట్టాలని, ఈ దాడికి పురిగొల్పిన రాష్ట్ర మంత్రులపైనా కేసు నమోదు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్ గురించి గొప్పలు చెప్పుకునే కేసీఆర్, అస్సాం సీఎంకు సరైన భద్రత కల్పించలేక పోవడం సిగ్గుచేటని అరుణ విమర్శించారు. కుటుంబ పార్టీలు దేశం కోసం ఆలోచించవు: హిమంత తెలంగాణలో ఒక్క కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ విమ ర్శించారు. ప్రభుత్వం అనేది ప్రజలందరి కోసం పనిచేయాలి గానీ, ఒక కుటుంబం కోసం కాదన్నారు. కుటుంబ పార్టీలు కొడుకు, కూతురు గురించి తప్ప దేశం కోసం ఆలోచించవని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు మంచి జరగాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని, గణపతిని కోరుకున్నట్లు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజల్ని ఏకం చేయడానికి కేసీఆర్‌కు మరో 50 ఏళ్లు పడుతుందేమోనని ఎద్దేవాచేశారు. రాహుల్‌గాంధీకి నిజంగా దేశ భక్తి ఉంటే 1947లో ఎక్కడైతే విభజన జరిగిందో అక్కడ భారత్ జోడో యాత్ర చేయాలని వ్యాఖ్యానించారు. ఎక్కడైతే జోడించాలో అక్కడ ఆ పనిచేయాలి తప్ప పటిష్టంగా ఉన్న దేశంలో ‘భారత్ జోడోలు’ ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వినాయక శోభాయాత్రను చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు అబిడ్స్: సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదని టీఆర్ఎస్ నాయకుడు నందకిశోర్ వ్యాస్ (నందుబిలాల్) పేర్కొన్నారు. కేసీఆర్‌ను విమర్శించినందుకే తాను మైకు లాక్కున్నానని చెప్పారు. అబిడ్స్ పోలీస్‌స్టేషన్ దగ్గర నందకిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలకు వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఆధ్యాత్మిక భావంతో, దేవుడిపైనే ప్రసంగించాలన్నారు. సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను విమర్శిస్తూ హైదరాబాద్‌లో అలజడి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల! -
టీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డ ఈటెల రాజేందర్
-
వరద ప్రభావిత ప్రాంతంలో సీఎం బైక్ రైడ్.. వీడియో వైరల్
డిస్పూర్: దేశంలో భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు నీటమునిగాయి. గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. తముల్పూర్ జిల్లా సందర్శనకు వెళ్లిన క్రమంలో బైక్‌పై చక్కర్లు కొట్టారు. పింక్ రంగు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై పలు ప్రాంతాలను సందర్శించారు. జిల్లాలోని బగరిబారి ప్రాంతంలో బైక్ రైడ్ చేశానంటూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు సీఎం. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. Took a motor-bike ride to Bagaribari embankment breach site during my visit to Tamulpur. pic.twitter.com/uE4z8TgqV0 — Himanta Biswa Sarma (@himantabiswa) July 14, 2022 బైక్ రైడ్ తర్వాత బోట్లో ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాలను చుట్టి వచ్చారు సీఎం. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అస్సాంలోని కచార్, చిరాంగ్, మోరిగావ్, నగావ్, తముల్పూర్ జిల్లాలు నీట మునిగాయి. సుమారు 2,50,300 మందిపై వరద ప్రభావం పడింది. ఆయా జిల్లాల్లో 76 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది అస్సాం ప్రభుత్వం. ఇప్పటి వరకు 17,014 మందిని సురక్షిత శిబిరాలకు తరలించారు. బొంగాయ్‌గావ్, ధుబ్రీ, కమ్రూప్, లఖింపుర్, మంజులీ, మోరిగావ్, దక్షిణ సల్మారా, టింసుకియా జిల్లాల్లో వరదల కారణంగా భూములు కోతకు గురయ్యయి. ఇదీ చూడండి: అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 15 మంది మృతి! -
అసోంలో 15 నుంచి కరోనా ఆంక్షల ఎత్తివేత
గౌహతి: రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలన్నింటినీ ఫిబ్రవరి 15 నుంచి ఎత్తేయాలని అసోం నిర్ణయించింది. కరోనా విజృంభణ, కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం హిమంత బిశ్వశర్మ సోమవారం మీడియాకు వెల్లడించారు. వచ్చే రెండు నెలల వ్యవధిలో స్కూలు బోర్డు పరీక్షలు, మున్సిపల్ తదితర ఎన్నికలు షెడ్యూల్ మేరకే జరుగుతాయని చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే స్టూడెంట్లంతా వ్యాక్సిన్ రెండు డోసులు విధిగా వేసుకోవాలన్నారు. ‘‘ఇక రాత్రి కర్ఫ్యూలుండవు. షాపింగ్, సినిమా మాల్స్ పూర్తి సామర్థ్యంతో నడుస్తాయి. పెళ్లిళ్లు, వేడుకలను రాత్రిళ్లు కూడా జరుపుకోవచ్చు. వాటిలో పాల్గొనే వాళ్లంతా విధిగా రెండు డోసులూ వేసుకోవాలి. మాస్కు ధరించాలి.’’ అని వివరించారు. దేశంలో 83,876 కేసులు దేశవ్యాప్తంగా సోమవారం 83,876 కొత్త కరోనా కేసులు, 895 మరణాలు నమోదయ్యాయి. మరణాల్లో 515 కేరళలో, 66 మహారాష్ట్రలో జరిగాయి. ఒమిక్రాన్ విజృంభణ తర్వాత గత 32 రోజుల్లో రోజువారీ కరోనా కేసులు లక్ష కంటే తగ్గడం ఇదే తొలిసారి. దేశంలో మొత్తం కరోనా కేసులు 4,2,72,014కు, మరణాలు 5,02,874కు చేరాయి. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 11,08,938కి తగ్గాయి. కోవిడ్ రికవరీ రేటు 96,19 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ పేర్కొంది. -
విద్యార్థి నేత నుంచి సీఎం పీఠం వరకు
గువాహటి: అస్సాం రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ రాజకీయ ప్రస్థానం ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్(ఏఏఎస్‌యూ)లో విద్యార్థి నేతగా ప్రారంభమైంది. 1991–92లో రాజనీతి శాస్త్రంలో పీజీ చేస్తున్న సమయంలో ప్రఖ్యాత కాటన్ కాలేజ్ యూనియన్ సొసైటీకి జనరల్ సెక్రటరీగా శర్మ పనిచేశారు. ఏఏఎస్‌యూలో పనిచేస్తున్న సమయంలో రాష్ట్రంలో కీలక నేతలైన ప్రఫుల్ల కుమార్ మహంత, భ్రిగు కుమార్ ఫుకాన్‌లకు దగ్గరయ్యారు. 90లలో నాటి ముఖ్యమంత్రి హితేశ్వర్సైకియా శర్మను కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చారు. ఆయన అండతో శర్మ రాజకీయంగా ఎంతో ఎదిగారు. అనంతరం, జలుక్బరి అసెంబ్లీ స్థానం నుంచి తన రాజకీయ గురువు భ్రిగు ఫుకాన్ పైనే గెలుపొం దారు. ఇదే నియోజకవర్గం నుంచి 2006, 2011, 2016ల్లో కూడా ఆయన గెలుపొందారు. తాజా ఎన్నికల్లో లక్షకు పైగా మెజారిటీ సాధించారు. తరుణ్ గొగోయ్‌తో విభేదించి కాంగ్రెస్‌లో ఉండగా నాటి సీఎం తరుణ్ గొగోయ్‌కి అత్యంత విశ్వసనీయ సహచరుడిగా వ్యవహరించారు. ఆయన మంత్రివర్గంలో పలు కీలక పోర్ట్‌ఫోలియోలను సమర్ధవంతంగా నిర్వహించారు. 2011లో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని కాంగ్రెస్ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి హిమంత రాజకీయ వ్యూహాలే కారణం. కానీ 2013లో తరుణ్ గొగోయి తన కుమారుడు గౌరవ్ గొగోయ్‌కి తన వారసుడిగా ప్రాముఖ్యత ఇస్తున్న నేపథ్యంలో తరుణ్ గొగోయ్‌తో హిమంత బిశ్వ శర్మకు విబేధాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్‌లో ఉంటే సీఎం కావాలన్న తన లక్ష్యం నెరవేరదన్న అభిప్రాయంతో.. ఆ తరువాత రెండేళ్లకు మరో 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి శర్మ బీజేపీలో చేరారు. అంతకుముందు, అస్సాంలో అధికార సంక్షోభంపై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని కలిశారు. ఆ తరువాత ఆ సమావేశం గురించి శర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ‘అస్సాంలో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడం కన్నా.. ఆయన తన కుక్కలకు బిస్కెట్లు వేయడంపైననే ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు’ అని ఆ భేటీ అనంతరం శర్మ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ఉండగా ఆయనపై శారద చిట్ ఫండ్స్, లూయిస్ బెర్జర్ కుంభకోణాల్లో పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలొచ్చాయి. బీజేపీ ప్రభుత్వంలో ఆర్థికం, ఆరోగ్యం, విద్య తదితర కీలక శాఖలను నిర్వహించారు. నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ కన్వీనర్‌గా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో, 2017లో మణిపూర్‌లో కూటమి ఏర్పాటులో, మేఘాలయలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. నాగాలాండ్‌లో హెచ్బీఎస్గా చిరపరిచితుడైన శర్మ.. బీజేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. గత సోనోవాల్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ కూడా నిర్వహించిన శర్మ.. కరోనా సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో వైద్య రంగంలో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేశారు. ప్రస్తుతం మొత్తం ఈశాన్య ప్రాంతంలోనే అత్యంత శక్తిమంతమైన నేతగా, బీజేపీలో ట్రబుల్ షూటర్‌గా ఎదిగారు. శర్మ 2001 నుంచి అన్ని ప్రభుత్వాల్లో మంత్రిగా ఉండడం విశేషం. ఈశాన్యంలో బలోపేతం కావాడానికి శర్మ వంటి నేత అవసరమని గుర్తించిన బీజేపీ ఆయనను విజయవంతంగా తమ పార్టీలోకి తీసుకువచ్చింది. బీజేపీలోకి వస్తూనే వరుసగా మూడు పర్యాయాలు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ను గద్దె దించడంలో హిమంత కీలకపాత్ర పోషించారు. -
అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
దిస్పూర్ : పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలు, నిరసనలతో దేశం అట్టుడుకుతోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ చట్టంపై రగులుతున్న నిరసనలపై అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ శుక్రవారం స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా హింసాకాండకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. హింసాత్మక చర్యలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ‘హింసకు పాల్పడుతున్న వారిని విడిచిపెట్టం. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశాం. అసోం అస్సామీ ప్రజలతోనే ఉంది. ఇందుకోసం అవసరమైతే ఏ చట్టాన్ని అయినా తీసుకువస్తాం. అసోం ప్రజలు చేసుకున్న 1985 ఒప్పందంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం ఒప్పందాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా హామీయిచ్చారు’ అని సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. భారత ముస్లింలు, రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ హక్కులకు ఎలాంటి భంగం కలగదని ఆయన హామీ ఇచ్చారు. కాగా అసోంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించామని పోలీసులు తెలిపారు. పౌరులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టు పెట్టకూడదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్ధరించడంలో మీ సహకారం కోసం ఎదురు చూస్తున్నామని అసోం పోలీసులు ట్వీట్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్రంలో డిసెంబర్ 11న ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. -
మరో ముఖ్యమంత్రికి ఎసరు
వరుసపెట్టి ముఖ్యమంత్రులను మార్చిపారేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్లుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను మార్చాలని ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస పెద్దలు.. ఇప్పుడు అసోం సీఎం తరుణ్ గొగోయ్ పదవికి కూడా ఎసరు పెడుతున్నారు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన గొగోయ్ మీద ప్రజల్లో వ్యతిరేకత మాట ఎలా ఉన్నా.. అంతర్గతంగా ఆయన మంత్రివర్గంలోనే వ్యతిరేకత రావడంతో ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్ర విద్య, ఆరోగ్యశాఖల మంత్రి హిమంత విశ్వశర్మ నాయకత్వంలో గొగోయ్ వ్యతిరేక శిబిరం ఇటీవలి కాలంలో బాగా చురుగ్గా వ్యవహరిస్తోంది. పదమూడేళ్లుగా సీఎంగా ఉన్న గొగోయ్.. ఈసారి తమ రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సొంత పార్టీని పెద్దగా గెలిపించుకోలేకపోయారు. మొత్తం 13 లోక్‌సభ స్థానాలుండగా కాంగ్రెస్ పార్టీకి కేవలం మూడు మాత్రమే వచ్చాయి. దాంతో ఆయన మీద వ్యతిరేకత మరింత పెరిగింది. 2016 సంవత్సరంలో అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందువల్ల ఈ రెండేళ్ల పాటు కొత్త ముఖాన్ని తీసుకొస్తే ఫలితం ఏమైనా ఉండచ్చేమోనని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. -
గొగోయ్ రాజీనామాను తిరస్కరించిన సోనియా
న్యూఢిల్లీ: అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాజీనామాను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తిరస్కరించారని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిలోమని సేన్ దేకా తెలిపారు. దేశ రాజధానికి చేరుకున్న తరుణ్ గొగోయ్ ఈ మధ్యాహ్నం సోనియా, రాహుల్ గాంధీలను కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలని భావించారు. తన నిర్ణయాన్ని అధినేత్రి ముందుంచారు. అయితే పదవికి రాజీనామా చేయొద్దని గొగోయ్‌కు సోనియా సూచించారు. -
పరాజయ భారంతో.. నేడు రాజీనామా!
ఈశాన్య రాష్ట్రమైన అసోంను ఏకఛత్రాధిపత్యంగా పదమూడేళ్లుగా అప్రతిహతంగా పాలిస్తున్న తరుణ్ గొగోయ్.. తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత తానే వహిస్తానని, ఇకమీదట ముఖ్యమంత్రి పదవి వద్దని చెబుతూ గురువారం నాడే రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే అసోంలో ఈసారి బీజేపీ పాగా వేసింది. అక్కడ మొత్తం 14 లోక్‌సభ స్థానాలుండగా.. ఏడింటిని బీజేపీ సొంతం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి మూడంటే మూడే స్థానాలు దక్కాయి. మరో మూడు స్థానాలను అస్సాం యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఏయూడీఎఫ్) గెలుచుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ మాత్రం ఎలాగోలా తమ కుటుంబ ప్రతిష్ఠను కాపాడుతూ కలియాబార్ పార్లమెటరీ నియోజకవర్గంలో 94వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. 2001 నుంచి అసోంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో కొనసాగుతోంది. గొగోయ్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే క్రమశిక్షణ రాహిత్యం, ముఠాతత్వం లాంటివి ఇటీవల అక్కడ ఎక్కువైపోయాయని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుందని తెలుస్తోంది. 2009లో ఏడు సీట్లను సాధించిన కాంగ్రెస్, ఈసారి వాటిలో నాలుగింటిని కోల్పోయింది. ఆరు స్థానాల కంటే తక్కువ వస్తే రాజీనామా చేస్తానని ముందే చెప్పినందున అలా చేస్తున్నట్లు గొగోయ్ చెప్పారు. -
మీరు పాడేసే ముష్టి మాకు అక్కర్లేదు: అసోం సీఎం
అవన్నీ పెద్ద పెద్ద టీ కంపెనీలు. కోట్లకు కోట్ల లాభాలు ఆర్జిస్తుంటాయి. కానీ ముఖ్యమంత్రి సహాయ నిధికి అవన్నీ కలిపి మరీ ఇచ్చిన విరాళం మాత్రం 15.23 లక్షల రూపాయలు మాత్రమే!! దీంతో అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌కి ఎక్కడలేని కోపం వచ్చింది. మీరు పారేసే ముష్టి నాకు అక్కర్లేదంటూ ఆ సొమ్మును తిప్పి పంపేశారు. ఇండియన్ టీ అసోసియేషన్ అనే పేరుతో మొత్తం 25 ప్రధాన టీ కంపెనలన్నీ కలిసి మరీ ఇంత తక్కువ మొత్తం ఇవ్వడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ, ఈ కంపెనీలన్నీ భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని మాత్రం ఇవి అస్సలు పట్టించుకోవడంలేదని సీఎంవో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అందుకే ఆ చెక్కులను మొత్తం 25 కంపెనీలకు తిప్పి పంపేస్తున్నారు. మొత్తం అన్ని కంపెనీలలో అత్యల్పంగా 6,675 రూపాయలు పంపగా, అత్యధికంగా 3,88,700 రూపాయలు పంపారు. -
కాంగ్రెస్ తరపున నిందితులకు టికెట్లిచ్చాం: తరుణ్ గొగోయ్
క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్లు ఇచ్చామని ఆ పార్టీకి చెందిన అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అన్నారు. దోషులుగా తేలిన చట్టసభ సభ్యుల్నిరక్షించేందుకు ఆర్డినెన్స్ తేవడం అనాలోచిత నిర్ణయమన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ఆయన సమర్థించారు. నేరస్తులు ఎన్నికల్లో పోటి చేయకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎలాంటి మార్గదర్శకాలనూ రూపొందించలేదని గొగోయ్ చెప్పారు. రాజకీయాల్ని పారదర్శకం ఉండాలని, రాహుల్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని గొగోయ్ అన్నారు. వివాదాస్పద ఆర్డినెన్స్‌ను తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.