గొగోయ్ రాజీనామాను తిరస్కరించిన సోనియా
న్యూఢిల్లీ: అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాజీనామాను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తిరస్కరించారని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిలోమని సేన్ దేకా తెలిపారు. దేశ రాజధానికి చేరుకున్న తరుణ్ గొగోయ్ ఈ మధ్యాహ్నం సోనియా, రాహుల్ గాంధీలను కలిశారు.
లోక్సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలని భావించారు. తన నిర్ణయాన్ని అధినేత్రి ముందుంచారు. అయితే పదవికి రాజీనామా చేయొద్దని గొగోయ్కు సోనియా సూచించారు.