
న్యూఢిల్లీ: టీ, కాఫీ చైన్.. చాయ్ పాయింట్ 2026 మే నెలకల్లా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యే ప్రణాళికల్లో ఉంది. ఈ అంశాన్ని ప్రతిరోజు సుమారు 9 లక్షల కప్పుల టీ, కాఫీ విక్రయిస్తున్న సంస్థ సహవ్యవస్థాపకుడు తరుణ్ ఖన్నా తెలియజేశారు. అయితే కుంభమేళాలో రోజుకి 10 లక్షలకంటే అధికంగా విక్రయించినట్లు తెలియజేశారు.
ముంబైలో తమ విద్యార్ధి అములీక్ సింగ్ బిజ్రాల్‌తో కలసి ఒక కేఫ్‌లో టీ తాగే సమయంలో 2009లో చాయ్ పాయింట్ ప్రారంభించే ఆలోచన వచ్చినట్లు హార్వార్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఖన్నా వెల్లడించారు. ప్లాస్టిక్ కప్పులలో అంత శుభ్రతలేని విధంగా అందిస్తున్న చాయ్ స్థానే అత్యున్నత నాణ్యతతో, పరిశుభ్రంగా అందుబాటు ధరలో సువాసనలతో కూడిన చాయ్ అందించాలనే ఆలోచనతో చాయ్ పాయింట్‌కు తెరతీసినట్లు వివరించారు.
దీంతో టీ అందించే వ్యక్తు(చోటూ)లకు ఉపాధిని సైతం కల్పించవచ్చని భావించినట్లు తెలియజేశారు. దీంతో 2010లో బెంగళూరులోని కోరమంగళలో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అములీక్‌తో కలిసి ఐదుగురు ఉద్యోగులతో బిజినెస్‌ను మొదలుపెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రోజుకి 90 లక్షల కప్పుల టీ, కాఫీలను విక్రయిస్తున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment