
ఇటీవల ఎన్నికల కోడ్‌తో టీడబ్బా తొలగింపు
సిరిసిల్ల నడి»ొడ్డున మళ్లీ బాధితుడి టీస్టాల్‌ను ప్రారంభించిన కేటీఆర్
సిరిసిల్ల: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ చిరు వ్యాపారి.. కేటీఆర్ పేరుతో నడుపుకుంటున్న టీ కొట్టు డబ్బాను అధికారులు ఇటీవల ఎన్నికల సమయంలో మూసివేయించిన విషయం తెలిసిందే. దీంతో ఆ వ్యాపారికి కేటీఆర్ అండగా నిలిచారు. మళ్లీ టీకొట్టు పెట్టిస్తానని భరోసా ఇచ్చారు.
గత నెలలో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మఘాట్ వద్ద కేటీఆర్ పేరు, ఫొటోతో ఉన్న టీస్టాల్‌ను అధికారులు మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ లేదన్న సాకుతో ఫిబ్రవరి 19న మూయించారు. అయితే బీఆర్‌ఎస్ అభిమానులు, కేటీఆర్ అనుచరులు అదే రోజు సాయంత్రమే హోటల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్‌తో టీస్టాల్‌ను తెరిపించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 21న సాయంత్రం టీస్టాల్ డబ్బాకు అనుమతి లేదని పేర్కొంటూ మున్సిపల్ అధికారులు ఆ డబ్బాను పోలీస్ రక్షణ మధ్య తొలగించి, ట్రాక్టర్‌పై మరోచోటికి తరలించారు. ఈ చర్యతో శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి కన్నీరు పెట్టుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్, బత్తుల శ్రీనివాస్‌కు ఫోన్ చేసి తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. ఇచి్చన మాట ప్రకారం ఇటీవల సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా శ్రీనివాస్‌కు ఆర్థిక సాయం చేశారు. ఆ డబ్బులతో మరోచోట హోటల్ పెట్టుకోవాలని కేటీఆర్ సలహా ఇచ్చారు. కేటీఆర్ సలహాతో పట్టణంలోని గాం«దీచౌక్‌లో శ్రీనివాస్ కొత్తగా టీస్టాల్‌ను కేటీఆర్ పేరుతో ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం కేటీఆర్, ఎమ్మెల్సీ రమణతో కలసి శ్రీనివాస్ టీస్టాల్‌ను ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment