కొత్తూరు: తిత్లీ తుఫాన్ కారణంగా మండలంలోని పత్తి, బొప్పాయి, అరటి, చెరుకు, వరి, కూరగాయ పంటలు తీవ్రంగా నష్టపోయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కొత్తూరు, కర్లెమ్మ, మహసింగి, సిరుసువాడ, మాకవరం, కుంటిభద్ర, వసప, పారాపురం నివగాం గ్రామాలతో పాటు పలు గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు మండల కేంద్రం కొత్తూరు నాలు గు రోడ్ల కూడలిలో ఆదివారం ఆందోళన చేపట్టారు. మండలాన్ని తుఫాన్ ప్రభావిత మండలం గా గుర్తించాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనతో సుమారు నాలుగు గంటల పాటు ట్రాఫిక్ నిలి చిపోయింది. తుఫాన్ కారణంగా ఇన్ని పంటలు పాడైతే ఒక్క అధికారి కూడా చూడడానికి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు నాలుగు గంటల పాటు వారు నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈఓ, తహసీల్దార్లు పట్టించుకోవ డం లేదని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఆందోళన ఉద్ధృతం కావడంతో స్థానిక ఎస్‌ఐ రవికుమార్ తన సిబ్బం దితో ఆందోళన చేస్తున్న రైతులతో చర్చించారు. కానీ ఏఓ, తహసీల్దార్ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెప్పారు. ఏఓ వాహిని రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసినా వారు నినాదాలు చేస్తూనే ఉన్నారు. అనంతరం తహసీల్దార్ సావిత్రి వచ్చి పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు.
ప్రభావిత మండలం ప్రకటన తన పరిధిలో లేదని చెప్పారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్య ఆం దోళన వద్దకు చేరుకుని అధికారులు నదీ తీర గ్రామాలకు వెళ్లినందున ఇక్కడి గ్రామాలు చూడలేకపోయారని సర్దిచెప్పారు. కొత్తూరు మండలాన్ని తుఫాన్ ప్రభావిత మండలంగా ప్రకటిస్తున్నట్లు అర్డీవో చెప్పారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. వెంటనే ఆర్డీవో, తహసీల్దార్, ఏఓలు కర్లెమ్మ రెవెన్యూ గ్రూప్ పరిధిలో పాడైన పంటలను పరిశీలించారు.
రెడ్డి శాంతి మద్దతు
కొత్తూరు మండలాన్ని తుఫాన్ ప్రభావిత మండలంగా గుర్తించి రైతులకు ఆదుకోవాలని కొత్తూరు నాలుగు రోడ్ల కూడలిలో రైతులు చేసిన ధర్నాకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి మద్దతు తెలిపారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. తుఫాన్ వచ్చి నాలుగు రోజు లు గడుస్తున్నా మండలాన్ని అధికారులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు.
కూలిపోయిన ఇళ్లకు, పలు రకాల తోటలకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించకపోవడం అన్యాయమన్నారు. రెడ్డి శాంతితో పాటు పార్టీ మండల అధ్యక్షుడు సారిపల్లి ప్రసాదరావు, పార్టీ యూత్ అధ్యక్షుడు పడాల లక్ష్మణరావు, జిల్లా ప్రదాన కార్యదర్శి రేగేటి కన్నయ్య స్వామి, పార్టీ నేతలు ఎద్దు హరిదాసు, గండివల్స ఆనందరావు, ప్రసాదరావు, తిరుపతిరావు, వి. శ్రీనివాసరావు,రాజులు నాయుడులతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment