Rain Alert to farmers about the crop పాట్నా: పశ్చిమ దిశగా వీస్తున్నగాలుల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రంగా పెరిగింది. పొగమంచు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ చలి మాత్రం తారా స్థాయికి చేరుకుంది. కాగా ఈ నెల చివరివారంలో 27 నుంచి 30 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని బీహార్ వాతావరణశాఖ హెచ్చరించింది. దీనివల్ల వ్యవసాయానికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా సూచించింది.
బీహార్‌లోని పలు జిల్లాల్లో ఈ వారంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేఅవకాశం ఉందని పాట్నా వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయి. కుప్పలూడ్చి, పంట ఇంటికి చేరే సమయంలో ఈ వర్షాల కారణంగా రైతులకు నష్టం వాటిల్లే ఆవకాశం ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ రైతులకు సూచించింది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో పశువుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా వర్షాల అనంతరం రాష్ట్రంలో చలి తీవ్రత కూడా ఒక్కసారిగా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా. డిసెంబర్ 27 నుంచి 30 మధ్య ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని, వర్షం పడే అవకాశంతో పాటు పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
చదవండి: కేఎఫ్‌సీ చికెన్‌లో కోడి తల.. కస్టమర్‌కు చేదు అనుభవం!
Comments
Please login to add a commentAdd a comment