rain areas
-
తెలంగాణకు 'ఎల్లో అలర్ట్'..రెండ్రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు యాక్టివ్‌గా ఉండటం.. ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ఈ క్రమంలోనే గురువారం నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
మోరంచపల్లి కాలరాత్రికి ఏడాది ప్రస్తుతం ఎలా ఉందంటే..
-
జల ప్రళయం.. మునిగిన 44వ జాతీయ రహదారి..
ఆదిలాబాద్: భారీ వర్షాలకు హైదరాబాద్–నాగ్‌పూర్ 44వ జాతీయ రహదారి నీట మునిగింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంలకు స్వర్ణ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సోన్ మండలంలోని కడ్తాల్ వద్ద 44వ జాతీయ రహదారిపై వర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్‌లో 44 వ జాతీయ రహదారి హైదరాబాద్–నాగ్‌పూర్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇరు వైపుల జాతీయ రహదారిపై గంటల తరబడి వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సోన్ ఎస్సై సంతోషం రవీందర్ తన సిబ్బందితో అక్కడకు చేరుకొని ఎవరు వెళ్లకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. -
హై అలర్ట్..
భద్రాద్రి: వర్షాలు, వరదలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రభుత్వ సిబ్బంది పని చేసే కార్యస్థానాల్లోనే అందుబాటులో ఉండాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆదేశించారు. రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో గోదావరి వరద పరిస్థితిపై భద్రాచలం ఆర్డీఓ కార్యాలయం నుంచి రాత్రి రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, రహదారులు భవనాలు, మిషన్ భగీరథ, విద్యుత్, వైద్య, సెక్టోరియల్, మండల ప్రత్యేక అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లా ఆరెంజ్ జోన్లో ఉందని తెలిపారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు హై అలర్ట్‌గా ఉండాలన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన టీములు, ప్రత్యేక అధికారులు, సెక్టోరియల్ అధికారులు కేటాయించిన మండలాల్లో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని వివరించారు. సమస్యాత్మక, ముంపునకు గురయ్యే ప్రాంతాల సమగ్ర జాబితా సిద్ధంగా ఉండాలని, చెరువుల పరిరక్షణ చర్యలు చేపట్టాలని, ఇసుక బస్తాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. రోడ్లపైకి నీరు చేరిన ప్రాంతాల్లో రాకపోకలను నియంత్రించాలని చెప్పారు. అప్రమత్తంగా ఉండాలి శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, నీట మునిగే ప్రాంతాల్లో ప్రయాణాలు చేయకుండా ట్రాక్టర్లు అడ్డుగా పెట్టాలని వివరించారు. ములకలపల్లిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. మండల స్థాయి బృందాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్కడా విద్యుత్ సమస్య రావొద్దని, ఫిర్యాదులు వస్తే తక్షణమే పరిష్కరించాలని, తాగునీటి సమస్య వచ్చిన ప్రాంతాల్లో పంచాయతీ, రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. తాగునీటి పరీక్షలు చేయాలన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లకుండా చూడాలన్నారు. రెండు రోజులు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, నీళ్లు నిలిచే ప్రాంతాల్లో రవాణా సేవలు నిలిపి వేసేందుకు పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, మధుసూదన్ రాజు, ఇతర అధికారులు భీమ్లా, డాక్టర్ శిరీష, డాక్టర్ రవిబాబు, మరియన్న, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలు బుధవారం జిల్లాలో ఒక్క దమ్మపేట మండలం మినహా జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. కరకగూడెం మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 22 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత భారీ వర్షపాతం నమోదైన మండలాల్లో చర్ల, పినపాక, సుజాతనగర్, ఇల్లెందు, కొత్తగూడెం మండలాలు ఉన్నాయి. మిగిలిన మండలాల్లోనూ భారీగానే వానలు పడ్డాయి. రెండో ప్రమాద హెచ్చరిక బుధవారం ఉదయం నుంచి తాలిపేరు ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన వర్షాలతో దాదాపు రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రాజెక్టుకు చేరింది. దీంతో ప్రాజెక్టు గేట్లన్నింటినీ ఎత్తి కిందకు వదులుతున్నారు. మరోవైపు ఎగువన ప్రాణహిత, ఇంద్రావతి వరదకు తాలిపేరు కూడా జతవ్వడంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉగ్రరూపం దాల్చింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 48 అడుగులకు వరద రాలేదు. కానీ బుధవారం రాత్రి రెండో ప్రమాద హెచ్చరికను దాటుకుని 49 అడుగుల పైకి వరద చేరుకుంది. దీంతో ముందు జాగ్రత్తగా భద్రాచలంలోని కొత్తకాలనీ, చర్ల మండల దండుపేట, రాళ్లగూడెం లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇటీవల బదిలీపై వెళ్లిన ఐఏఎస్ అధికారి అనుదీప్ భద్రాచలం కేంద్రంగా వరద సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆపదలో ఉంటే.. ఆపదలో ఉన్నవారు తమ ఫొటోలు, వాట్సాప్ లొకేషన్, పంపి పోలీసుల సేవలు పొందాలని ఎస్పీ డాక్టర్ వినీత్ కోరారు. జిల్లా పోలీస్ రెస్క్యూ కంట్రోల్ వాట్సాప్ నంబర్ 87126 82128కు ఫోన్ చేసి సహాయం పొందాలని విజ్ఞప్తి చేశారు. కంట్రోల్ రూమ్ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయన్నారు. -
ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడున్నారు?
బంజారాహిల్స్: ట్రాఫిక్‌లో ఇరుక్కుని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సినీ నటి డింపుల్ హయతి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ ఫొటోను ట్యాగ్ చేస్తూ నగర పోలీసులు, మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పరిస్థితి ఘోరంగా ఉందని, ఇంటికి చేరుకోవాలంటే గంటకుపైగా సమయం పడుతుందంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. ఒక వేళ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి..? మళ్లీ మనం హైదరాబాద్‌లో అడుగు పెట్టగలమా..? ప్రియమైన ప్రభుత్వమా మాకు ఉచితంగా ఇంధనం లభించదు అంటూ పోస్టు చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నగర వాసులు ఆమెను సమర్ధిస్తూ రీ ట్వీట్లు చేశారు. ఆమెను సమర్థించేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. -
నాలా మరణాలు.. ఇంకెన్నాళ్లు?
హైదరాబాద్: విశ్వనగరం.. ఆకాశమార్గాలు.. ఫ్లైఓవర్లు.. ఎలివేటెడ్ కారిడార్లు.. ఎక్స్‌ప్రెస్‌వేలు.. అండర్‌పాస్‌లతో ఘనత చాటుకుంటున్న ప్రభుత్వం ‘నాలా మరణాలను’ మాత్రం నిలువరించలేకపోతోంది. జీహెచ్ఎంసీ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా మరో పసిప్రాణం నాలాకు బలైపోయింది. పాల కోసం వెళ్తూ చిన్నారి నాలాలో పడి మత్యువాత పడటానికి కారణం జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమేనని వెల్లడైంది. నాలాల్లో మరణాలు జరగరాదని గత రెండేళ్లుగా మంత్రి కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు చేస్తూ.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నా ఘోరం జరిగిపోయింది. గత వర్షాకాలం నాలా మరణాలు లేవనుకుంటుండగానే ఈసారి వానాకాలం రాకముందే వేసవిలోనే అయినా నాలాలో పసిప్రాణం బలైపోయింది. దీనికి పూర్తి బాధ్యత జీహెచ్ఎంసీ, వాటర్బోర్డులదేనని చెప్పక తప్పదు. వీడీసీసీ రోడ్డు కోసం జీహెచ్ఎంసీ ఉన్న రోడ్డును తవ్వి పనులు చేపట్టింది. డ్రైనేజీ లైన్ వేయడంలో వాటర్‌బోర్డు జాప్యం చేసింది. పనుల ప్రాంతంలో గుంతను పట్టించుకోలేదు. పనులు జరిగే ప్రాంతాల్లో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, ఏర్పాటు చేయాల్సిన సైనేజీలు వంటివి పూర్తిగా గాలికొదిలేశారు. వికేంద్రీకరణ ఇందుకేనా? ► ఎక్కడైనా అధికార వికేంద్రీకరణ సత్ఫలితాలిస్తుంది. జీహెచ్ఎంసీలో మాత్రం అది వ్యతిరేక ఫలితాలిస్తోంది. జీహెచ్ఎంసీలో జోన్లకు విస్తృతాధికారాలిచ్చారు. కమిషనర్ తనకున్న అధికారాలను కూడా జోన్లకు ధారాదత్తం చేశారు. దాంతో ఇక జోన్ల వారు ఆడిందిఆటగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో పనుల తీరును పరిశీలిస్తున్న వారే లేకుండాపోయారు. ప్రధాన కార్యాలయ అధికారులు తనిఖీలు చేస్తారన్న భయం లేదు. జోన్లలోని దిగువస్థాయి అధికారులు, సిబ్బంది సైతం పనుల కంటే పైఆదాయానికే శ్రద్ధ చూపుతున్నారని గత మూడేళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వ పెద్దలు సైతం పట్టించుకున్న పాపాన పోలేదు. ► సర్కిళ్లు, జోన్లలోనే మంజూరు నుంచి పూర్తయ్యే వరకు పనులు జరుగుతుండటంతో ఉన్నతాధికారులను పట్టించుకోవడం మానేశారు. కమిషనర్, మేయర్ క్షేత్రస్థాయి పర్యటనల్లేవు. నిర్లక్ష్యం వహిస్తున్నవారిని పట్టించుకుంటున్నవారు లేరు. నిర్లక్ష్యం కారణంగానే బాలిక అసువులు బాసింది. దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రం పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తూతూమంత్రపు ప్రకటనలు చేయడం.. చర్యల్లో భాగంగా దిగువస్థాయి వారిని సస్పెండ్ చేయడం వంటి మొక్కుబడి చర్యలు తప్ప కఠిన వైఖరి లేకపోవడంతో పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులను బాధ్యులను చేయడం లేదు. నాలుగురోజులు గడవగానే పరిస్థితులు మళ్లీ మొదటికొస్తున్నాయి. ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ కళాసిగూడ నాలాలో బాలిక మృతి చెందిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బాధ్యులైన ఇద్దరు అధికారులపై వేటు వేసింది. రోడ్డు పనుల సందర్భంగా సరైన భద్రత చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారంటూ సంబంధిత బేగంపేట సర్కిల్ అసిస్టెంట్ ఇంజినీర్ ఎం.తిరుమలయ్య, ఔట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ బి.ఎం. హరికృష్ణలను సస్పెన్షన్ చేసింది. ఈమేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా ఖైరతాబాద్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్. ఇందిరాబాయిని నియమించారు. పది రోజుల్లోగా విచారణ నివేదికను అందజేయాలని ఆదేశించారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేయకుండా, డైవర్షన్ సూచికలు లేకుండా నిర్లక్ష్యం వహించడంతో సస్పెన్షన్ చేసినట్లు పేర్కొన్నారు. పనుల్లో నిర్లక్ష్యమే బాలిక మరణానికి కారణమైందని పేర్కొన్నారు. ఎక్కడ.. ఎలా..? వాన బీభత్సం ఇలా.. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సు అండర్ బ్రిడ్జి కింద వరదలో నిలిచిపోయింది. ►చందానగర్ జాతీయ రహదారిపై వరద నీరు సాఫీగా ప్రవహించకపోవడంతో పక్కనే ఉన్న సెల్లార్లోకి చేరడంతో దుకాణాలు పూర్తిగా మునిగిపోయాయి. దాదాపు రూ.35 లక్షల విలువైన సరుకులు తడిసి ముద్దగా మారాయి. ► మణికొండ పంచవటి కాలనీలో రిటర్నింగ్ వాల్ లేని చోట పందెన్వాగు ఒక్కసారిగా పొంగటంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరింది. ► కీసర– భోగారం ప్రధాన రహదారిలో చెట్ల కొమ్మలు విరిగిపడటంతో పంచాయతీ సిబ్బంది, పోలీసులు జేసీబీ సహాయంతో తొలగించారు. ► గౌతంనగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు చేరి చెరువును తలపించాయి. వర్షం వచ్చిన ప్రతిసారి నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ► గోల్కొండలోని టోలిచౌకి, నదీమ్ కాలమీ, గోల్కొండ హీరాఖానా తదితర ప్రాంతాలలో రోడ్లపై వరదనీరు ప్రవహించింది. ►నాచారం డివిజన్ పరిధిలోని ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాంగణంలో నీరు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు. బాబానగర్, వీఎస్టీ కాలనీ, అంబేడ్కర్‌నగర్, ఎర్రకుంట, రాఘవేంద్రనగర్, ఇందిరానగర్,వీరారెడ్డినగర్‌లో వరద నీటితో ఇబ్బదులు పడ్డారు. ► బోడుప్పల్‌లోని సాయి భవానీనగర్ కాలనీని వరద నీరు ముంచెత్తింది. ► ముషీరాబాద్ డివిజన్ అడిక్‌మెట్ డివిజన్ పద్మా కాలనీ నాలాపై పార్కు చేసిన సుమారు 30 వాహనాలకు పైగా వరదలో అచ్చయ్యనగర్ వరకు కొట్టుకువచ్చాయి. వీటిని జీహెచ్ఎంసీ రెస్క్యూ టీమ్ రెండు భారీ క్రేన్ల సహాయంతో వాహనాలను బయటకు తీశారు. నడుములోతు మేర నీరు ప్రవహించడంతో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థల పాలయ్యారు. వరద ఉద్ధృత్తికి పలు ఇళ్ల గోడలు కూలిపోయాయి. ► బేగంపేట్ నాలా పరీవాహక ప్రాంతాలు నీట మునిగాయి. అల్లంతోటబావి జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. బస్తీ రోడ్లను కాల్వలను తలపించాయి. ► తార్నాక డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మ్యాన్ హోళ్లు, ఓపెన్ నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లు, రహదారులపై బురద పేరుకుపోయింది. లాలాపేట సత్యానగర్, ఇందిరానగర్, చంద్రబాబునగర్, శ్రీపురి కాలనీ, వినోభానగర్ తదితర బస్తీల్లోన్ని రోడ్లపై భారీగా వర్షం నీరు చేరింది. సత్యానగర్ కమ్యునిటీ హాల్ సమీపంలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ముంచెత్తిన వాన...
-
కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
-
స్వయంకృతాపరాధం!
చేసిన పాపం... శాపంగా మారడమంటే ఇదే! పట్టణాభివృద్ధి పేరిట కొన్నేళ్ళ విశృంఖలత్వానికి ఫలితం ఇప్పుడు భారత సాఫ్ట్వేర్ రాజధాని బెంగళూరులో కనిపిస్తోంది. వరుసగా రెండురోజులు రాత్రివేళ కురిసిన వర్షాలతో ప్రాథమిక పౌర వసతుల వ్యవస్థ కుప్పకూలి, అతలాకుతలమైన మహానగరం అంతర్జాతీయ వార్తగా మారింది. సంపన్నులు నివసించే ఖరీదైన ప్రాంతాలు సైతం నీట మునిగిపోయాయి. చుట్టూ నీళ్ళున్నా, అనేకచోట్ల రెండు రోజులుగా తాగునీరు రాని దుఃస్థితి. కరెంట్ కోత సరేసరి. ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, కోటీశ్వరులు సైతం పడవల్లో విలాస వంతమైన విల్లాలు వదిలి పోయిన పరిస్థితి. ప్రపంచ శ్రేణి సంస్థలు, వ్యాపారాలకు నెలవైన నగరంలో కనీస పౌర వసతులు ఎంత దయనీయంగా ఉన్నాయంటే, వర్షాలు ఆగి, గంటలు గడిచినా పలు ప్రాంతాలు ఇప్పటికీ నడుము లోతు నీళ్ళలో నిస్సహాయంగా నిరీక్షిస్తున్నాయి. పట్టణ ప్రణాళిక లోపభూయిష్ఠమై, రియల్ ఎస్టేట్ దురాశ పెరిగితే, వాతావరణ మార్పుల వేళ మన నగరాలకు సంక్షోభం తప్పదని మరోసారి గుర్తుచేస్తున్న ప్రమాద ఘంటిక ఇది. వరుస వర్షాలతో బెంగళూరులోని కీలక ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)లో ప్రయాణ, వాణిజ్య కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ‘భారత సిలికాన్ వ్యాలీ’లోని ఆ రోడ్డులోనే మైక్రోసాఫ్ట్, ఇంటెల్, మోర్గాన్ స్టాన్లీ లాంటి బడా అంతర్జాతీయ సంస్థల ఆఫీసులన్నీ ఉన్నాయి. వాన నీటితో అంతా స్తంభించి, స్థానికంగా కోట్ల రూపాయల మేర ఉత్పత్తి పడిపోయింది. రోడ్లపై నీళ్ళు నిలిచిపోవడంతో బడా బడా సీఈఓలు సైతం చివరకు ట్రాక్టర్లు ఎక్కి వచ్చిన పరిస్థితి. ఆధునిక టెక్నాలజీ కారిడార్లోనే ప్రాథమిక వసతులు ఇలా పేకమేడలా ఉన్నాయంటే, మిగతా నగరంలో ఎలా ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఆదివారం నాటి వర్షపాతం బెంగళూరు చరిత్రలోనే సెప్టెం బర్‌లోకెల్లా మూడో అతి భారీ వర్షపాతమని నిపుణుల మాట. అందుకు తగ్గట్టుగా పౌర వసతులను తీర్చిదిద్దుకోకపోవడమే పెను సమస్య. బెంగళూరులోని మొత్తం 164 చెరువులూ నిండిపోయాయి. ఇంత భారీ వర్షాల తర్వాతా పాత బెంగళూరు నిలకడగా ఉన్నా, వైట్‌ఫీల్డ్, సాఫ్ట్వేర్ ఆఫీసులకు నెలవైన ఖరీదైన కొత్త బెంగళూరు ప్రాంతం చిక్కుల్లో పడడం తప్పు ఎక్కడ జరిగిందో చెబుతోంది. ప్రస్తుత దుఃస్థితికి పాత కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని బీజేపీ, ప్రస్తుత కాషాయ ప్రభుత్వ అసమర్థత – అవినీతి మూలమని కాంగ్రెస్ పార్టీ పరస్పర నిందారోపణల్లో పడ్డాయి. నిజానికి, ఈ తిలాపాపంలో తలా పిడికెడు భాగం ఉంది. రెండు నదుల మధ్య లోయలా, అనేక చెరువులు, నీటి పారుదల వ్యవస్థలు, ఉద్యానాలు నిండిన నగరం బెంగళూరు. ఐటీ విజృంభణతో పట్టణాభివృద్ధి పేరిట ఇష్టారాజ్యంగా చేసిన భవన నిర్మాణాలు చెరువులను ఆక్రమించాయి. నీటి పారుదలను అడ్డగించేశాయి. అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన నగర పాలక సంస్థ, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు కళ్ళు మూసుకొని, భవన నిర్మాతల అత్యాశను అనుమతించారు. చివరకు పకడ్బందీ ప్రణాళిక లేని మైసూరు – బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం సైతం పౌర వసతులపై ఒత్తిడి పెంచేస్తుండడం విషాదం. నిజానికి, ఇది ఒక్క బెంగళూరు పరిస్థితే కాదు. పట్టణ ప్రణాళికలోని లోపాలు, నియమ నిబంధనల్ని యథేచ్ఛగా ఉల్లంఘించడం, అధికారుల అలసత్వం, పెను వాతావరణ మార్పులతో తలెత్తిన సంక్షోభం – ఇవన్నీ మన దేశంలోని అనేక నగరాలను పట్టి పీడిస్తున్నాయి. వాటి ఫలితం 2005లో ముంబయ్, 2015లో చెన్నై, 2016లో గురుగ్రామ్, 2020లో హైదరాబాద్, 2021లో కోల్‌కతా, ఢిల్లీ – ఇలా అనేకచోట్ల చూశాం. కొండలు గుట్టల్ని మింగేసి, చెరువుల్ని కబ్జా చేస్తే భారీ వర్షం కురిసినప్పుడల్లా ‘ఆకస్మిక వరదలు’ తప్పవని హైదరాబాద్, చెన్నై సహా అన్నీ పదే పదే గుర్తుచేస్తున్నాయి. ఇప్పటికీ శరవేగంతో సాగుతున్న పట్టణీకరణ వల్ల నగరాలపై భారం పెరుగు తోంది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలైన మన నగరాలు మరో దశాబ్దంలో ప్రతి 10 మంది భారతీయుల్లో నలుగురికి ఆవాసమవుతాయని అంచనా. ఈ పరిస్థితుల్లో పదే పదే ముంచెత్తుతున్న వరదలు, వాతావరణ మార్పుల రీత్యా ఇటు అభివృద్ధితో పాటు, అటు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని తీరాలి. పటిష్ఠమైన అభివృద్ధి, పర్యావరణ రక్షణ ప్రణాళిక లేకపోతే, కొన్నేళ్ళుగా వివిధ నగరాల్లో చూస్తున్న వరదలు, ఉష్ణతాపాలు అన్నిచోట్లా నిత్యకృత్యమవుతాయి. ఇకనైనా పరిస్థితులు మారాలంటే, పట్టణాలలో కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలి. చెరువులు, నదీతీరాల్లో ఆక్రమణలను అడ్డగించాలి. పంటలు పండే మాగాణి నేలల్నీ, పర్యావరణానికి కీలకమైన మడ అడవుల్నీ రియల్ ఎస్టేట్ మూర్ఖత్వానికి బలి చేస్తే, దాని దుష్ఫలితం అనుభవిస్తామని గ్రహిం చాలి. ఇవాళ్టికీ అనేక నగరాల్లో బ్రిటీషు కాలం నాటి ఏర్పాట్లే ఉన్న మనం వర్షపు నీరు, మురుగు నీటి పారుదల వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలి. ప్రకృతి సిద్ధమైన నీటి వనరులనూ, వాటి నుంచి నీళ్ళు పోయే మార్గాలనూ కాపాడుకోవాలి. అంతులేని ఆశతో, అజ్ఞానంతో వాటిని ధ్వంసం చేస్తే, మన చెత్తతో వాటిని నింపేస్తే ఆనక తాజా బెంగళూరు లాంటి అనుభవాలతో చింతించాల్సి వస్తుంది. ఇవన్నీ జరగాలంటే, పాలకుల్లో నిజాయతీ, చిత్తశుద్ధి ముఖ్యం. అన్నీ సవ్యంగా ఉంటేనే అప్పుడది సుపరిపాలన. ప్రభుత్వాలు అది గుర్తించాలి. చైతన్యవంతమైన పౌర సమాజం సైతం తన వంతుగా బాధ్యతగా ప్రవర్తిస్తేనే ప్రయోజనం. ‘నమ్మ బెంగళూరు’ చెబుతున్న పాఠం ఇదే! -
Rain Alert: ఈ నెల 27 నుంచి 30 వరకు చలిగాలులతో కూడిన వానలు!
Rain Alert to farmers about the crop పాట్నా: పశ్చిమ దిశగా వీస్తున్నగాలుల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రంగా పెరిగింది. పొగమంచు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ చలి మాత్రం తారా స్థాయికి చేరుకుంది. కాగా ఈ నెల చివరివారంలో 27 నుంచి 30 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని బీహార్ వాతావరణశాఖ హెచ్చరించింది. దీనివల్ల వ్యవసాయానికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా సూచించింది. బీహార్‌లోని పలు జిల్లాల్లో ఈ వారంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేఅవకాశం ఉందని పాట్నా వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయి. కుప్పలూడ్చి, పంట ఇంటికి చేరే సమయంలో ఈ వర్షాల కారణంగా రైతులకు నష్టం వాటిల్లే ఆవకాశం ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ రైతులకు సూచించింది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో పశువుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా వర్షాల అనంతరం రాష్ట్రంలో చలి తీవ్రత కూడా ఒక్కసారిగా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా. డిసెంబర్ 27 నుంచి 30 మధ్య ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని, వర్షం పడే అవకాశంతో పాటు పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. చదవండి: కేఎఫ్‌సీ చికెన్‌లో కోడి తల.. కస్టమర్‌కు చేదు అనుభవం! -
రానున్న 12-18 గంటల్లో తీవ్ర మంచు వర్షాలు! రహదారుల మూసివేత..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్, లడఖ్ ఎగువ ప్రాంతాల్లో ఆదివారం (డిసెంబర్ 5) తీవ్రంగా మంచు కురువడంతో బందిపోరా-గురెజ్, సింథన్-కిష్త్వార్, మొఘల్ రహదారులతో సహా సరిహద్దు రహదారులను మూసివేశారు. రానున్న 12 నుంచి 18 గంటల్లో తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారి తెలిపారు. కాశ్మీర్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అంచనా వేసినట్లుగా, అనేక హిల్ స్టేషన్లతో సహా యూనియన్ టెరిటరీ ఎగువ ప్రాంతాల్లో ఉదయం నుండి మంచు వానలు కురుస్తున్నాయి. నిరంతరంగా కురుస్తున్న మంచు కారణంగా అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రోడ్లను మూసివేయాల్సి వచ్చిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో 3 నుంచి 4 అంగుళాలమేర మంచు పేరుకుపోయింది. మరొపక్క ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. చదవండి: కేవలం మూడున్నర గంటల్లో మట్టి ఇళ్లను నిర్మిస్తున్న ఇటలీ.. కారణం తెలుసా.. -
వచ్చే మూడురోజులు విస్తారంగా వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఆది, సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముంటుందని, దీంతో వాతారణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయని వెల్లడించింది. ఐదురోజులు పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబుబాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. హైదరాబాద్‌లో విడతలవారీగా వర్షా లు కురుస్తాయని అంచనా వేసింది. భారీవర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలను అప్రమ త్తం చేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సూ చించింది. రైళ్లు, రోడ్డు ప్రయాణాలకు అంతరాయం కలగవచ్చని, విద్యుత్ సరఫరాలోనూ ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. -
నేడు చంద్రబాబు జిల్లా పర్యటన
సాక్షి, కాకినాడ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లాలోని వర్షపీడిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చంద్రబాబు విశాఖపట్నం జిల్లా నుంచి ఉదయం 11 గంటలకు తుని మీదుగా అన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి తొండంగి, ఒంటిమామిడి, కోనపాప పేట, పిఠాపురం, గొల్లప్రోలుల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తారు. అనంతరం తాటిపర్తి, వన్నెపూడి, ప్రత్తిపాడుల్లో పర్యటించి సుద్దగడ్డ కాలువ ముంపు బాధిత రైతులను, ప్రజలను పరామర్శిస్తారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా తణుకు వెళతాతరు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు రాజప్ప విజ్ఞప్తి చేశారు.