Dimple Hayathi Fires on the Government for Traffic in the City - Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ డీసీపీలు ఎక్కడున్నారు?

Published Fri, Jul 21 2023 5:38 AM | Last Updated on Fri, Jul 21 2023 2:32 PM

- - Sakshi

బంజారాహిల్స్‌: ట్రాఫిక్‌లో ఇరుక్కుని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సినీ నటి డింపుల్‌ హయతి దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ ఫొటోను ట్యాగ్‌ చేస్తూ నగర పోలీసులు, మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పరిస్థితి ఘోరంగా ఉందని, ఇంటికి చేరుకోవాలంటే గంటకుపైగా సమయం పడుతుందంటూ ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ట్రాఫిక్‌ డీసీపీలు ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు.

ఒక వేళ మెడికల్‌ ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి..? మళ్లీ మనం హైదరాబాద్‌లో అడుగు పెట్టగలమా..? ప్రియమైన ప్రభుత్వమా మాకు ఉచితంగా ఇంధనం లభించదు అంటూ పోస్టు చేశారు. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నగర వాసులు ఆమెను సమర్ధిస్తూ రీ ట్వీట్లు చేశారు. ఆమెను సమర్థించేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement