
మలక్‌పేట: రాష్ట్ర ప్రభుత్వం, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ సంయుక్త భాగస్వామ్యంలో మలక్‌పేట ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేయనున్న ఐటీపార్క్‌కు నేడు శంకుస్థాపన జరగనున్నట్లు అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1032 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఐటీపార్క్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. పదెకరాల స్థలంలో 21 అంతస్తుల ఈ భవనానికి ‘ఐ టెక్ న్యూక్లియస్’గా పేరు ఖరారు చేశారు.