హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దాదాపు రెండు వారాలు మాత్రమే గడువుంది. ఈలోగా విస్తృత ప్రచారానికి అధికార బీఆర్‌ఎస్ సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఏ మాత్రం అవకాశం దొరికినా, ఏ స్వల్ప సమయం లభించినా గ్రేటర్ నగరంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వివిధ సంఘాలతో, సమాఖ్యలతో సమావేశమవుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటున్నారు. బీఆర్‌ఎస్‌కే ఎందుకు ఓటేయాలో వివరించి చెబుతున్నారు.
రాష్ట్రమంతా ఒక ఎత్తయితే గ్రేటర్ హైదరాబాద్ నగరం మరో ఎత్తు అనే విధంగా నగరానికి ప్రాధాన్యతనిచ్చారు. అదే అంశాన్ని పార్టీ నేతలకూ వివరిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని వివిధ నియోజకవర్గాల్లో పార్టీ బూత్‌కమిటీల సమావేశాల్లో పాల్గొని వారికి దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజలందరికీ చేరేలా ప్రచారం చేశారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల సమాఖ్యతోనూ సమావేశమయ్యారు. హ్యాండ్లూం అండ్ టెక్స్‌టైల్స్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. బంజారాహిల్స్ నిలోఫర్ కేఫ్‌లోనూ చాయ్ తాగుతున్న కుటుంబాలతో ముచ్చటించారు. ఏం చేసినా తొమ్మిదిన్నరేళ్లలో తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ దానిని కొనసాగించేందుకు తమకే ఓటేయాలని కోరుతున్నారు. వివిధ సమావేశాలతోపాటు విస్తృత రోడ్‌షోలకూ ప్రణాళిక సిద్ధం చేశారు.
రోడ్ షోలు ఇలా..
► 16వ తేదీ నుంచి ప్రతిరోజూ వివిధ ప్రాంతాల్లో రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. ప్రస్తుత షెడ్యూల్ మేరకు..
► 16వ తేదీ: సాయంత్రం 5 గంటలకు కూకట్‌పల్లిలో, రాత్రి 7 గంటలకు కుత్బుల్లాపూర్‌లలో రోడ్‌షోల్లో పాల్గొంటారు.
► 17వ తేదీ: సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్‌షోలో భాగంగా శ్రీరాంనగర్, యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రాత్రి 7 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జహీర్‌నగర్, హిమాయత్‌నగర్‌లలో రోడ్‌షోలో పాల్గొననున్నారు.
► 18వ తేదీ: సాయంత్రం 4 గంటలకు నాంపల్లి నియోజకవర్గంలో 5 గంటలకు గోషామహల్ నియోజకవర్గంలోని బేగంబజార్ చత్రి, పుత్లిబౌలిల్లో రోడ్‌షోల్లో పాల్గొంటారు.రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్‌నియోజకవర్గంలోని శాంతినగర్, ఎస్‌వీఎస్ ప్రాంతాల్లో రోడ్‌షోలో పాల్గొంటారు.
► 19వ తేదీ: సాయంత్రం 5 గంటలకు అంబర్‌పేట నియోజకవర్గంలోని అలీకేఫ్, ఫీవర్ హాస్పిటల్ లేదా చప్పల్ బజార్‌లలో రోడ్‌షోలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్‌నగర్ చౌరస్తా, భోలక్‌పూర్, గాంధీనగర్ కొత్తబ్రిడ్జి దగ్గర రోడ్‌షోల్లో పాల్గొంటారు.
► 20వ తేదీ: ఉప్పల్, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల్లో రోడ్‌షోల్లో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment