![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/28/munigina%2044%20va%20ja%20ra.jpg.webp?itok=_fcxI6n4)
ఆదిలాబాద్: భారీ వర్షాలకు హైదరాబాద్–నాగ్‌పూర్ 44వ జాతీయ రహదారి నీట మునిగింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంలకు స్వర్ణ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సోన్ మండలంలోని కడ్తాల్ వద్ద 44వ జాతీయ రహదారిపై వర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది.
దీంతో గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్‌లో 44 వ జాతీయ రహదారి హైదరాబాద్–నాగ్‌పూర్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇరు వైపుల జాతీయ రహదారిపై గంటల తరబడి వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సోన్ ఎస్సై సంతోషం రవీందర్ తన సిబ్బందితో అక్కడకు చేరుకొని ఎవరు వెళ్లకుండా తగిన చర్యలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment