సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఆది, సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముంటుందని, దీంతో వాతారణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయని వెల్లడించింది. ఐదురోజులు పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు.
అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబుబాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. హైదరాబాద్‌లో విడతలవారీగా వర్షా లు కురుస్తాయని అంచనా వేసింది. భారీవర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలను అప్రమ త్తం చేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సూ చించింది. రైళ్లు, రోడ్డు ప్రయాణాలకు అంతరాయం కలగవచ్చని, విద్యుత్ సరఫరాలోనూ ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment