
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు యాక్టివ్‌గా ఉండటం.. ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఈ క్రమంలోనే గురువారం నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment