ముంబై: రిలయన్స్ జియో ఉచిత సేవల సెగ భారత్ రెండో అతిపెద్ద టెలికాం వోడాఫోన్ ఇండియాను భారీగానే తాకింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వోడీఫోన్ లాభాలు భారీగా క్షీణించాయి. 10.2 శాతం క్షీణతతో రూ. 11,784 కోట్ల ఆపరేటింగ్ లాభాలను ఆర్జించింది. మొత్తం ఆదాయం 0.6 శాతం క్షీణించి 43,095 కోట్లకు పడిపోయింది స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన ఎబిటా లాభం రూ.13,115కోట్లుగా నమోదుచేసింది.
దేశంలోని అతిపెద్ద టెలికాం మేజర్ ఐడియా సెల్యులార్ తో విలీనం కానున్న ఈ సంస్థ గత ఏడాది ఇదే కాలంలో రూ .13,115 కోట్ల లాభాలను ఆర్జించింది. బలమైన పోటీ వాతావరణంలో స్థిరమైన వృద్ధిని సాధించామని వోడాఫోన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ సూద్ ప్రకటించారు. వినియోగదారుల సంఖ్య 209 మిలియన్లకు పెరిగిందన్నారు. డిసెంబర్ 2016 నాటికి కంపెనీ రెవెన్యూ మార్కెట్ వాటాలో 0.7 శాతం వాటా 22.7 శాతానికి చేరింది. ఇది ఒక వినియోగదారునికి సగటు ఆదాయంరూ. 158 గా వోడాఫోన్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో నివేదించింది.
కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 8,311 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది. మార్చి 31 నాటికి కంపెన్ డెట్ రూ .60,200 కోట్లుగా ఉంది
రిలయన్స్ జీయో ఎంట్రీతో దేశీయ టెలికాం మేజర్లు ఆదాయాలను నష్టపోతున్నాయి. జియో నుంచి తమ ఖాతాదారులను రక్షించుకునేందుకు అష్టకష్టాలుపడుతున్న సంగతి తెలిసిందే.
వోడాఫోన్‌కు జియో దెబ్బ
Published Tue, May 16 2017 8:30 PM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM
Advertisement
Advertisement