operating profit
-
చమురు కంపెనీల లాభాలు మూడు రెట్లు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) నిర్వహణ లాభాలు మూడు రెట్లు పెరగనున్నాయి. రూ. 1 లక్ష కోట్లకు చేరనున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ రేట్లు తగ్గడం, దేశీయంగా రిటైల్ రేట్లు అధిక స్థాయిలో ఉండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం.. 2017–2022 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఓఎంసీల నిర్వహణ లాభాలు సగటున రూ. 60,000 కోట్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ. 33,000 కోట్లు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి నిర్వహణ లాభాలు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని మూడు ప్రభుత్వ రంగ ఓఎంసీల మీద నివేదికలో క్రిసిల్ పేర్కొంది. ఆయిల్ కంపెనీలకు ప్రధానంగా రిఫైనింగ్ (ముడి చమురును శుద్ధి చేయడం), రిటైల్ బంకుల ద్వారా ఇంధనాలను మార్కెటింగ్ చేయడం ద్వారా రెండు మార్గాల్లో ఆదాయం వస్తుంది. నివేదికలో మరిన్ని అంశాలు.. ► రష్యా మీద ఆంక్షల నేపథ్యంలో ఇంధనాలకు డిమాండ్ పెరగడంతో 2023 ఆర్థిక సంవత్సరంలో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు సగటున బ్యారెల్‌కు 15 డాలర్లు పలికాయి. అయితే, క్రూడాయిల్ రేట్లు పెరిగినప్పటికీ .. రిటైల్ ఇంధన ధరను ఆ స్థాయిలో పెంచకపోవడంతో, రిఫైనింగ్ మార్జిన్లు పటిష్టంగానే ఉన్నా.. మార్కెటింగ్‌పరంగా నష్టాలు నమోదు చేయాల్సి వచి్చంది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో లాభదాయకత బలహీనపడింది. ► ఈసారి నిర్వహణ లాభాలు లీటరుకు రూ. 5–7 స్థాయికి చేరవచ్చని, స్థూల రిఫైనింగ్ మార్జిన్లు బ్యారెల్‌కు 6–8 డాలర్ల స్థాయికి పరిమితం కావచ్చని నివేదిక పేర్కొంది. ► 2017–23 మధ్య కాలంలో ఆయిల్ కంపెనీలు తమ రిఫైనింగ్, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు రూ. 3.3 లక్షల కోట్లు వెచి్చంచాయి. ఫలితంగా 2017లో రూ. 1.2 లక్షల కోట్లుగా ఉన్న వాటి స్థూల రుణ భారం 2023 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.6 లక్షల కోట్లకు చేరింది. అయితే, లాభదాయకత తక్కువ స్థాయిలోనే కొనసాగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఓఎంసీల పెట్టుబడి వ్యయాలు రూ. 54,000 కోట్ల మేర ఉంటాయని అంచనా. ► ఈసారి క్రూడాయిల్ రేట్లు ఊహించిన దానికన్నా ఎక్కువగా పెరిగినా లేక ముడిచమురు ధర తగ్గకుండా రిటైల్ రేట్లు తగ్గినా అంచనాలు మారిపోవచ్చు. -
ఎయిరిండియా ఆపరేటింగ్ లాభాలు రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ: నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ స్థిరమైన వృద్ధిని కనబరుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా తన పనితీరును నిలకడగా మెరుగుపరుచుకుని రెట్టింపు లాభాలను సాధించింది. రూ .298.03 కోట్లనిర్వహణ లాభాలను సాధించిందని ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఇది రూ.105కోట్లుగా ఉంది. అయితే గత ఏడాదితో పోలిస్తే నికర నష్టాలు మరింత ఎగిసి రూ.5765కోట్లుగా నమోదయ్యాయి. 2015-16 నాటికి నికర నష్టం రు. 3,836.77 కోట్లు. ఎయిర్ ఇండియా భారతదేశంలో మొత్తం ఆర్థిక, కార్యాచరణ పనితీరును మెరుగుపరుచుకుంటోందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా గురువారం లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. టర్నరౌండ్ ప్రణాళికలో భాగంగా, ఎయిర్ ఇండియా మార్గాలను హేతుబద్ధీకరించడం , విస్తరణకోసం వివిధ చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు. ఎయిర్ ఇండియా స్పెషల్ ఆల్టర్నేటివ్ మెకానిజం (ఎఐఎస్ఎంఎం) బిడ్డింగ్ ఆహ్వాన ప్రతిపాదనల డ్రాఫ్ట్ ను ఇంకా ఖరారు చేయాల్సి ఉందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతున్న కారణంగా ఎయిర్ ఇండియా మ్యూజియం ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. -
వోడాఫోన్‌కు జియో దెబ్బ
ముంబై: రిలయన్స్ జియో ఉచిత సేవల సెగ భారత్ రెండో అతిపెద్ద టెలికాం వోడాఫోన్ ఇండియాను భారీగానే తాకింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వోడీఫోన్ లాభాలు భారీగా క్షీణించాయి. 10.2 శాతం క్షీణతతో రూ. 11,784 కోట్ల ఆపరేటింగ్ లాభాలను ఆర్జించింది. మొత్తం ఆదాయం 0.6 శాతం క్షీణించి 43,095 కోట్లకు పడిపోయింది స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన ఎబిటా లాభం రూ.13,115కోట్లుగా నమోదుచేసింది. దేశంలోని అతిపెద్ద టెలికాం మేజర్ ఐడియా సెల్యులార్ తో విలీనం కానున్న ఈ సంస్థ గత ఏడాది ఇదే కాలంలో రూ .13,115 కోట్ల లాభాలను ఆర్జించింది. బలమైన పోటీ వాతావరణంలో స్థిరమైన వృద్ధిని సాధించామని వోడాఫోన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ సూద్ ప్రకటించారు. వినియోగదారుల సంఖ్య 209 మిలియన్లకు పెరిగిందన్నారు. డిసెంబర్ 2016 నాటికి కంపెనీ రెవెన్యూ మార్కెట్ వాటాలో 0.7 శాతం వాటా 22.7 శాతానికి చేరింది. ఇది ఒక వినియోగదారునికి సగటు ఆదాయంరూ. 158 గా వోడాఫోన్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో నివేదించింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 8,311 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది. మార్చి 31 నాటికి కంపెన్ డెట్ రూ .60,200 కోట్లుగా ఉంది రిలయన్స్ జీయో ఎంట్రీతో దేశీయ టెలికాం మేజర్లు ఆదాయాలను నష్టపోతున్నాయి. జియో నుంచి తమ ఖాతాదారులను రక్షించుకునేందుకు అష్టకష్టాలుపడుతున్న సంగతి తెలిసిందే. -
ఆరింతలు పెరిగిన బీఎస్ఎన్ఎల్ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరంలో ఆరింతలు వృద్ధి చెందింది. అంతకు ముందు ఏడాదిలో రూ.672 కోట్లు ఉండగా... 2015-16లో రూ.3,855 కోట్లకు చేరుకుంది. ఆదాయం కూడా గత ఐదేళ్లలోనే అత్యధిక స్థారుులో నమోదైంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం 2016 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సంలో 4.4% పెరిగి రూ.28,449 కోట్లకు చేరినట్టు బీఎస్ఎన్ఎల్ వర్గాలు వెల్లడించారుు. 2009-10 తర్వాత ఈ స్థారుు ఆదాయం రావడం ఇదే మొదటిసారి. ఈ మేరకు ఆర్థిక ఫలితాల నివేదిక గత వారం జరిగిన ఏజీఎం ముందుకు వచ్చింది. 2015-16 సంవత్సరంలో కొత్తగా 25వేల టవర్లను ఏర్పాటు చేయడం వినియోగదారుల పెరుగుదలకు దారితీసింది. ఫలితంగా మొబైల్ విభాగంలో బీఎస్ఎన్ఎల్కు అధిక ఆదాయం లభించింది. ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ విభాగాల్లో వృద్ధి 2 శాతంగా ఉండగా, మొబైల్ విభాగంలో ఇది 8 శాతంగా నమోదైంది. ఒకవైపు ఆదాయం పెరగడం, మరోవైపు వ్యయాలు, వేతనాలు, పరిపాలన, ఇతర ప్రయోజనాల కుదింపు ఫలితంగా పన్ను, వడ్డీ, తరుగుదలకు ముందస్తు లాభం (ఇబిటా) రూ.3,879 కోట్లుగా. మొత్తం ఆదాయంలో ఇబిటా 11.71 శాతంగా ఉంది. -
ఎయిర్ ఇండియాకు రూ.105కోట్ల నిర్వహణ లాభం...
పదేళ్లలో ఇదే తొలిసారి • ఇంధనం ధరలు తగ్గడం, ప్రయాణికుల సంఖ్య పెరగడమే ప్రధాన కారణాలు న్యూఢిల్లీ: పదేళ్లలో ప్రధమంగా ఎయిర్ ఇండియాకు లాభాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎయి ర్ ఇండియా సంస్థ రూ.105 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియాకు రూ.2,636 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయి. ఇంధనం ధరలు తక్కువగా ఉండడం, ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల 2007(ఈ ఏడాదే ఇండియన్ ఎయిర్‌లైన్స్.. ఎయిర్ ఇండియా లో విలీనమైంది) నుంచి చూస్తే, దశాబ్దంలో తొలిసారిగా ఎయిర్ ఇండియా లాభాలను కళ్లజూసింది. 7% పెరిగిన ప్రయాణిల సంఖ్య: గత ఆర్థిక సంవత్సరంలో ఇంధన వ్యయాలు 24% తగ్గడం వల్ల ఎయిర్ ఇండియా లాభాల బాట పట్టింది. ఇంధనం ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాలను ప్రయాణికులకు ఎయిర్ ఇండియా అందించిందని, ఫలితంగా టికెట్ల ధరలు 8% వరకూ తగ్గాయని, దీంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల ద్వారా ప్రయాణించిన వారి సంఖ్య 7 శాతం వృద్ధితో 1.8 కోట్లకు పెరిగింది. -
షాకింగ్లోనూ శాంసంగ్ సంచలనం
సియోల్ : మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ అయిన గెలాక్సీ నోట్7 విఫలం కావడంతో తీవ్ర నిరాశలో ఉన్న శాంసంగ్, లాభాల్లో మాత్రం వెనుకంజ వేయలేదు. ఓ వైపు గెలాక్సీ నోట్7 రీకాల్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మూడో త్రైమాసికంలో నిర్వహణ లాభాల్లో దూసుకెళ్లింది. జూలై-సెప్టెంబర్ కాలంలో 7.8 ట్రిలియన్ వాన్(రూ.46,812కోట్లకు పైగా) నిర్వహణ లాభాలను ఆర్జించినట్టు ఈ దక్షిణ కొరియా దిగ్గజం శుక్రవారం ప్రకటించింది. గతేడాది ఇదే కాలానికి కంటే ఈ లాభాలు 5.55 శాతం ఎక్కువని జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది. కానీ ముందటి త్రైమాసికం కంటే ఈ లాభాలు 4.18 శాతం మేర తగ్గాయని తెలిపింది. అయితే శాంసంగ్ కేవలం 7.4 ట్రిలియన్ వాన్‌ను మాత్రమే ఆర్జించగలదని మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు. వారి అంచనాలను అధిగమించి శాంసంగ్ ఈ లాభాలను ఆర్జించింది. సెమీ కండక్టర్స్, డిస్ప్లే ప్యానెల్స్ విక్రయాలు కంపెనీ లాభాలకు ఎక్కువగా దోహదంచేశాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్లను రీకాల్ చేసినప్పటికీ కంపెనీ అంచనావేసిన దానికంటే ఎక్కువగా లాభాలనార్జించడం విశేషమని విశ్లేషకులు అంటున్నారు. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో కంపెనీ గెలాక్సీ నోట్7ను సెప్టెంబర్ మొదటి నుంచి రీకాల్ చేయడం ప్రారంభించింది. ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థలు సైతం విమాన ప్రయాణాల్లో ఈ ఫోన్ వాడకంపై నిషేధం విధించాయి. యూఎస్ వినియోగదారుని ఉత్పత్తి భద్రతా కమీషన్ ప్రకారం మొత్తం బ్యాటరీ పేలుళ్ల ఘటనలు 92 నమోదయ్యాయి. నోట్7 రీకాల్‌తో కంపెనీకి 1 ట్రిలియన్ వాన్ నష్టం వచ్చినట్టు శాంసంగ్ తెలిపింది. పూర్తి ఆదాయ ఫలితాలను ఈ నెల ఆఖరున కంపెనీ రిపోర్టు చేయనుంది. -
లాభాల్లో దూసుకుపోయిన ఎల్ జీ
సియోల్ : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్ జీ, లాభాల్లో దూసుకుపోయింది. శుక్రవారం ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో నిర్వహణ లాభాలు రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. ఎల్ జీ ప్రధాన వ్యాపారాలైన గృహోపకరణాలు, టెలివిజన్ సెట్లు లాభాలను పెంచడంలో కీలకపాత్ర పోషించాయని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద టీవీల తయారీదారుగా మార్కెట్ షేరును సొంతం చేసుకున్న ఎల్ జీ సంస్థకు ఏప్రిల్-జూన్ లాభాలు రూ.58,500 కోట్లగా రికార్డు అయినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. 2014లో రూ.61,000 కోట్ల త్రైమాసిక లాభాలను నమోదుచేసిన తర్వాత ఇదే అతిపెద్ద త్రైమాసిక లాభాలని కంపెనీ వెల్లడించింది. రెవెన్యూలు కూడా 0.5 శాతానికి ఎగిసి రూ. 14 లక్షల కోట్లను (14ట్రిలియన్) నమోదుచేశాయి. జూలై ఆఖరికి విడుదలయ్యే తుది ఫలితాల్లో మిగతా వివరాలను ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ వెల్లడించనుంది. గృహోపకరణాల వ్యాపారాల్లో ప్రీమియం ఉత్పత్తులు, ఎయిర్ కండీషనర్లకు డిమాండ్ పెరగడంతో, ఎల్ జీ నిర్వహణ లాభాలు ఎగిశాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2016 యూఈఎఫ్ఏ యూరోపియన్ ఛాంపియన్ షిప్ సాకర్ టోర్నమెంట్ లాంటి ప్రధాన క్రీడాంశాలు టీవీల క్రేజ్ ను పెంచాయని, పెద్ద సైజు సెట్లకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. వీక్ డిస్ ప్లే ప్యానెల్ ధరలు కూడా మార్జిన్లు పెంచడానికి దోహదం చేశాయన్నారు. అయితే స్మార్ట్ ఫోన్ల బిజినెస్ లు మాత్రం ఎల్ జీని నిరాశపరిచాయి. వరుసగా ఐదో త్రైమాసికం ఏప్రిల్-జూన్ కూడా మొబైల్ డివైజ్ లో నిర్వహణ నష్టాలను నమోదుచేశాయి. జీ5 స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఈ త్రైమాసికంలో ఎల్ జీ బాగా నిరాశపరిచాయని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. తీవ్ర పోటీ నేపథ్యంలో కేవలం 22 లక్షల మొబైల్ యూనిట్లను మాత్రమే ఎల్ జీ అమ్మినట్టు హెచ్ఎమ్ సీ ఇన్వెస్ట్ మెంట్ అనాలిస్ట్ గ్రేగ్ రో తెలిపారు. మొబైల్ డివైజ్ ల్లో ఎల్ జీ రూ. 9,400 కోట్ల నష్టాలను నమోదుచేసింది. -
బీఎస్ఎన్ఎల్కు భారీ నిర్వహణ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మొబైల్ కంపెనీ నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరంలో జోరుగా పెరిగింది. 2015-16లో బీఎస్ఎన్ఎల్ నిర్వహణ లాభం రూ.2,000 కోట్లకు మించిందని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభంతో పోల్చితే ఇది మూడు రెట్లు అధికమని వివరించారు. గతంలో బీఎస్ఎన్ఎల్కు భారీగా నష్టాలు వచ్చేవని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఆర్థిక సంవత్సరంలోనే రూ.672 కోట్ల నిర్వహణ లాభం వచ్చిందని వివరించారు.