ఆరింతలు పెరిగిన బీఎస్ఎన్ఎల్ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరంలో ఆరింతలు వృద్ధి చెందింది. అంతకు ముందు ఏడాదిలో రూ.672 కోట్లు ఉండగా... 2015-16లో రూ.3,855 కోట్లకు చేరుకుంది. ఆదాయం కూడా గత ఐదేళ్లలోనే అత్యధిక స్థారుులో నమోదైంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం 2016 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సంలో 4.4% పెరిగి రూ.28,449 కోట్లకు చేరినట్టు బీఎస్‌ఎన్‌ఎల్ వర్గాలు వెల్లడించారుు. 2009-10 తర్వాత ఈ స్థారుు ఆదాయం రావడం ఇదే మొదటిసారి.
ఈ మేరకు ఆర్థిక ఫలితాల నివేదిక గత వారం జరిగిన ఏజీఎం ముందుకు వచ్చింది. 2015-16 సంవత్సరంలో కొత్తగా 25వేల టవర్లను ఏర్పాటు చేయడం వినియోగదారుల పెరుగుదలకు దారితీసింది. ఫలితంగా మొబైల్ విభాగంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు అధిక ఆదాయం లభించింది. ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ విభాగాల్లో వృద్ధి 2 శాతంగా ఉండగా, మొబైల్ విభాగంలో ఇది 8 శాతంగా నమోదైంది. ఒకవైపు ఆదాయం పెరగడం, మరోవైపు వ్యయాలు, వేతనాలు, పరిపాలన, ఇతర ప్రయోజనాల కుదింపు ఫలితంగా పన్ను, వడ్డీ, తరుగుదలకు ముందస్తు లాభం (ఇబిటా) రూ.3,879 కోట్లుగా. మొత్తం ఆదాయంలో ఇబిటా 11.71 శాతంగా ఉంది.