2 కోట్లు తగ్గిన బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు
న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల సంఖ్య దాదాపు 2 కోట్లు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఎన్‌ఎల్ 1.78 కోట్ల వైర్‌లెస్ వినియోగదారులను, 20 లక్షల మంది వైర్‌లైన్ యూజర్లను కోల్పోయిందని టెలికం శాఖ అధికారి చెప్పారు. వైర్‌లెస్ వినియోగదారుల తగ్గుదలకు నెట్‌వర్క్, సర్వీసుల నాణ్యత, సామర్థ్యం వంటి అంశాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ ఇతర ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడలేకపోవటమే కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది మే నెల చివరకు బీఎస్‌ఎన్‌ఎల్ వైర్‌లెస్ యూజర్ల సంఖ్య 7.76 కోట్లుగా (మార్కెట్ వాటా 8%), వైర్‌లైన్ వినియోగదారుల సంఖ్య 1.6 కోట్లుగా(మార్కెట్ వాటా 61%) ఉంది.