Number of users
-
ఫ్లిప్‌కార్ట్ యూజర్లు- 10 కోట్లు
బెంగళూరు: దేశీ దిగ్గజ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ వినియోగదారుల సంఖ్య 10 కోట్ల మైలురాయిని అధిగమించింది. దీంతో భారత్ ఆన్లైన్ మార్కెట్ విభాగంలో ఈ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా ఫ్లిప్‌కార్ట్ అవతరించింది. ఫ్లిప్‌కార్ట్‌కు కేవలం ఆరు నెలల కాలంలో 2.5 కోట్ల మంది కొత్త కస్టమర్లు జత కావడం ఆశ్చర్యకరం. ఈ ఏడాది మార్చి నాటికి ఫ్లిప్‌కార్ట్ యూజర్ల సంఖ్య 7.5 కోట్లుగా ఉంది. తాజాగా ఇది 10 కోట్ల మార్క్‌కు చేరింది. దేశీ ఆన్లైన్ షాపింగ్ యూజర్లకు నాణ్యమైన వస్తువులను, అందుబాటు ధరల్లో అందించేందుకు ఎప్పుడూ ముందుంటామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బిన్నీ బన్సాల్ తెలిపారు. -
జీఎస్ఎం వినియోగదారులు@ 77.4 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ ప్రధాన టెలికం కంపెనీల జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య మార్చి చివరి నాటికి 77.4 కోట్లకు చేరిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) తెలిపింది. జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య మార్చి నెలలో కొత్తగా 52.3 లక్షల మేర పెరిగినట్లు పేర్కొంది. ఎయిర్టెల్ కొత్త వినియోగదారులు సంఖ్య అత్యధికంగా 25 లక్షలమేర పెరిగిందని తెలిపింది. దీంతో సంస్థ మొత్తం కస్టమర్లు 25.1 కోట్లకు చేరారని పేర్కొంది. వొడాఫోన్ వినియోగదారుల సంఖ్య 12 లక్షల పెరుగుదలతో 19.7 కోట్లకు ఎగసినట్లు తెలిపింది. ఐడియా (4.5 లక్షల మంది), ఎయిర్‌సెల్ (4 లక్షలు)తో పోలిస్తే టెలినార్ (7 లక్షలు) కస్టమర్ల సంఖ్య మార్చిలో అధికంగా పెరగడం గమనార్హం. -
72 లక్షలు పెరిగిన జీఎస్ఎం మొబైల్ యూజర్లు
న్యూఢిల్లీ: దేశంలో జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య ఫిబ్రవరి నెలలో కొత్తగా 72.5 లక్షల మేర పెరిగింది. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య అదే నెలలో 76.87 కోట్లకు ఎగసిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) తెలిపింది. జీఎస్ఎం యూజర్ల సంఖ్య జనవరిలో 76.14 కోట్లుగా నమోదయ్యింది. కొత్త యూజర్ల పెరుగుదలలో ఎయిర్టెల్ అగ్రస్థానంలో ఉంది. -
మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు @ 37 కోట్లు
♦ ఈ ఏడాది జూన్‌కల్లా ఈస్థాయికి ♦ 50శాతం వృద్ధి: ఐఏఎంఏఐ వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ వాడకం కూడా జోరుగా పెరుగుతోందని ఐఏఎంఏఐ(ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) తెలిపింది. ఈ ఏడాది జూన్ కల్లా మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 55 శాతం వృద్ధితో 37 కోట్లకు పెరుగుతుందని పేర్కొంది. భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ వినియోగం సంబంధిత అంశాల గురించి ఈ సంస్థ వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు.... గత ఏడాది జూన్‌లో 23.8 కోట్లుగా ఉన్న మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి 30.6 కోట్లకు వృద్ధి చెందింది. వీటిల్లో 22 కోట్లు పట్టణ ప్రాంతం వారే. వార్షికంగా చూస్తే మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో 71 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి గ్రామీణ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 93 శాతం వృద్ధితో 8.7 కోట్లకు పెరిగింది. -
వాట్సాప్ యూజర్లు వంద కోట్లు
న్యూయార్క్: మొబైల్ మెసేజింగ్ సేవలందించే వాట్సాప్ యూజర్ల సంఖ్య 100 కోట్ల మైలురాయిని దాటింది. గత అయిదు నెలల్లో అదనంగా 10 కోట్ల మంది యూజర్లు తోడవడంతో ఇది సాధ్యపడిందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ తెలిపారు. దీంతో ప్రపంచ జనాభాలో ప్రతి ఏడుగురిలో ఒకరు తమ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లవుతుందని సంస్థ బ్లాగులో పేర్కొన్నారు. 2014 ఫిబ్రవరిలో సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్.. వాట్సాప్‌ను 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా రోజూ 42 బిలియన్ల మెసేజ్‌లు, 1.6 బిలియన్ల ఫొటోలు, 250 మిలియన్ల వీడియోలను యూజర్లు షేర్ చేసుకుంటున్నారని కౌమ్ తెలిపారు. -
2 కోట్లు తగ్గిన బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య దాదాపు 2 కోట్లు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ 1.78 కోట్ల వైర్లెస్ వినియోగదారులను, 20 లక్షల మంది వైర్‌లైన్ యూజర్లను కోల్పోయిందని టెలికం శాఖ అధికారి చెప్పారు. వైర్లెస్ వినియోగదారుల తగ్గుదలకు నెట్వర్క్, సర్వీసుల నాణ్యత, సామర్థ్యం వంటి అంశాల్లో బీఎస్ఎన్ఎల్ ఇతర ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడలేకపోవటమే కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది మే నెల చివరకు బీఎస్ఎన్ఎల్ వైర్లెస్ యూజర్ల సంఖ్య 7.76 కోట్లుగా (మార్కెట్ వాటా 8%), వైర్‌లైన్ వినియోగదారుల సంఖ్య 1.6 కోట్లుగా(మార్కెట్ వాటా 61%) ఉంది. -
2017 నాటికి నెటిజన్లు @ 50 కోట్లు
- ఐఏఎంఏఐ, కేపీఎంజీల నివేదిక న్యూఢిల్లీ: భారత్‌లో ఇంటర్నెట్ను వినియోగించేవారి సంఖ్య జోరుగా పెరుగుతోంది. 2017 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50.3 కోట్లకు పెరుగుతుందని ఒక నివేదిక వెల్లడించింది. రానున్న కాలంలో మొబైల్ ఇంటర్నెట్ కీలకం కానున్నదంటున్న ఈ నివేదికను ఐఏఎంఏఐ, కేపీఎంజీలు సంయుక్తంగా రూపొందించాయి. మొబైల్ వినియోగదారుల సంఖ్య ఏటా 28 శాతం చొప్పున వృద్ధి చెందుతుండడమే దీనికి ప్రధాన కారణమంటున్న ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు.., - ఈ ఏడాది జూన్ చివరి నాటికి భారత్‌లో మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య (వెర్లైన్, వెర్లైస్ రెండూ కలిపి) 35 కోట్లుగా ఉంది. - 2017 నాటికి మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50.3 కోట్లకు పెరుగుతుంది. దీంట్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య 31.4 కోట్లుగా ఉంటుంది. 2014 నాటికి ఈ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 15.9 కోట్లు మాత్రమే. - 2013-17 కాలానికి మొబైల్ నెట్ యూజర్ల సంఖ్య 28% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తోంది. - భవిష్యత్తులో 2జీ వినియోగదారుల సంఖ్య గణనీయంగా తగ్గి 3జీ యూజర్ల సంఖ్య బాగా పెరుగుతుంది. 2013-17 కాలానికి 3జీ వినియోగదారుల సంఖ్య 61% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుంది. - 2014 చివరికి 8.2 కోట్లుగా ఉన్న 3జీ కస్టమర్ల సంఖ్య 2017 నాటికి 28.4 కోట్లకు పెరుగుతుంది. - మొబైల్ ఇంటర్నెట్ కారణంగా ఇంటర్నెట్ విస్తరణ అనూహ్యంగా ఉండనున్నది. - 90 కోట్లకు పైగా ఉన్న గ్రామీణ భారతీయుల్లో 7 శాతం మంది(దాదాపు 6 కోట్లు) ఇంటర్నెట్ను చురుకుగా వినియోగిస్తున్నారు. - 2012లో మొబైల్ ద్వారా ఇంటర్నెట్ను వినియోగించే గ్రామీణుల సంఖ్య 0.4 శాతమే. రెండేళ్లలో ఈ సంఖ్య 4.4 శాతానికి పెరిగింది. -
జీఎస్ఎం వినియోగదారులు @ 71.6 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో ఏడు జీఎస్ఎం టెలికం ఆపరేటర్ల వినియోగదారుల సంఖ్య మే నెల చివరకు 71.6 కోట్లకు చేరిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) తెలిపింది. ఏడు జీఎస్ఎం టెలికం ఆపరేటర్ల జాబితాలో ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, ఎయిర్‌సెల్, యూనినార్, వీడియోకాన్, ఎంటీఎన్ఎల్ ఉన్నాయి. ఏప్రిల్‌లో 71 కోట్లుగా ఉన్న జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య మే నెలలో 0.66 శాతం వృద్ధితో (46 లక్షలు) 71.6 కోట్లకు చేరింది. ఐడియాకు అత్యధికంగా 12 లక్షల మంది వినియోగదారులు కొత్తగా జతయ్యారు. దీని తర్వాతి స్థానాల్లో ఎయిర్టెల్ (11 లక్షలు), యూనినార్ (9 లక్షలు), ఎయిర్‌సెల్ (7 లక్షలు), వోడాఫోన్ (4 లక్షలు), వీడియోకాన్ ( 1.5 లక్షలు) ఉన్నాయి. 2020 నాటికి మొబైల్ కనెక్షన్లుః140 కోట్లు ముంబై: దేశంలో 2020 నాటికి మొబైల్ కనెక్షన్ల సంఖ్య 140 కోట్లకు చేరుతుందని టెలికం ఉపకరణాల తయారీ సంస్థ ఎరిక్సన్ తెలిపింది. గతేడాది మొబైల్ కనెక్షన్ల సంఖ్య 97 కోట్లుగా ఉందని పేర్కొంది. తక్కువ ధరల్లో వివిధ మొబైల్ హ్యాండ్సెట్స్ అందుబాటులో ఉండటమే మొబైల్ వినియోగదారుల సంఖ్య పెరుగుదలకు కారణమని పేర్కొంది. -
67 కోట్లకు జీఎస్ఎం వినియోగదారులు
సీఓఏఐ వెల్లడి న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో 82.1 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారు. దీంతో అక్టోబర్ చివరి నాటికి 66.21 కోట్లుగా ఉన్న జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య నవంబర్ చివరినాటికి 1.2 శాతం వృద్ధితో 67.02 కోట్లకు పెరిగిందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) పేర్కొంది. లూప్, బీఎస్ఎన్ఎల్ సంస్థల గణాంకాలను మినహాయించామని పేర్కొంది. లెసైన్స్ గడువు పూర్తికావడంతో లూప్ మొబైల్ సంస్థ కార్యకలాపాలు నిలిపేసిందని, బీఎస్ఎన్ఎల్ సంస్థ 2012 సెప్టెంబర్ నుంచి వివరాలను అందజేయడం లేదని వివరించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్, క్వాడ్రంట్ కంపెనీల గణాంకాలు ఈ సమాచారంలో లేవని పేర్కొంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా తమ సంఘంలో చేరిందని, అయితే ఈ సంస్థ ఇంకా కార్యకలాపాలు ప్రారంభించిలేదని వివరించింది.