జీఎస్ఎం వినియోగదారులు@ 77.4 కోట్లు | Top telcos' GSM mobile customers base hits 774 mm: COAI | Sakshi
Sakshi News home page

జీఎస్ఎం వినియోగదారులు@ 77.4 కోట్లు

Published Wed, Apr 13 2016 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

జీఎస్ఎం వినియోగదారులు@ 77.4 కోట్లు

జీఎస్ఎం వినియోగదారులు@ 77.4 కోట్లు

న్యూఢిల్లీ: దేశీ ప్రధాన టెలికం కంపెనీల జీఎస్‌ఎం వినియోగదారుల సంఖ్య మార్చి చివరి నాటికి 77.4 కోట్లకు చేరిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) తెలిపింది. జీఎస్‌ఎం వినియోగదారుల సంఖ్య మార్చి నెలలో కొత్తగా 52.3 లక్షల మేర పెరిగినట్లు పేర్కొంది. ఎయిర్‌టెల్ కొత్త వినియోగదారులు సంఖ్య అత్యధికంగా 25 లక్షలమేర పెరిగిందని తెలిపింది. దీంతో సంస్థ మొత్తం కస్టమర్లు 25.1 కోట్లకు చేరారని పేర్కొంది. వొడాఫోన్ వినియోగదారుల సంఖ్య 12 లక్షల పెరుగుదలతో 19.7 కోట్లకు ఎగసినట్లు తెలిపింది. ఐడియా (4.5 లక్షల మంది), ఎయిర్‌సెల్ (4 లక్షలు)తో పోలిస్తే టెలినార్ (7 లక్షలు) కస్టమర్ల సంఖ్య మార్చిలో అధికంగా పెరగడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement