GSM
-
వుమెన్ సేఫ్టీ.. గొప్పగా ‘చెప్పు’కోవచ్చు!
తాడులా కనిపించేది ఎప్పుడు పామై కాటేస్తుందో తెలియదు. వెలుగులా గోచరించేది ఎప్పుడు చీకటై ముంచేస్తుందో తెలియదు... అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటారు. ఇందుకు ప్రత్యేకంగా వనరులు సమకూర్చుకోకపోయినా నిత్యజీవితంలో మనం ఉపయోగించే వస్తువులతోనే ‘మహిళల భద్రత’ కు అవసరమైన సాంకేతిక దన్ను అందిస్తుంది శాస్త్రీయజ్ఞానం. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విఐటి, తమిళనాడు)కు చెందిన పరిశోధకులు మహిళలకు రక్షణ ఇచ్చే పాదరక్షలకు రూపకల్పన చేశారు. ‘మహిళా భద్రతకు ఎన్నో చట్టాలు ఉన్నా, ఎక్కడో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేము రూపొందించే పాదరక్షలు ఎంతో భద్రతను ఇస్తాయి’ అంటున్నారు ప్రాజెక్ట్ మేకర్స్. తమకు తాముగా జాగ్రత్తపడేలా, విపత్కరమైన పరిస్థితులలో రక్షణ పొందేలా చేసే ఈ స్మార్ట్ పాదరక్షలు ఆత్మరక్షణ ఆయుధాలుగా ఉపయోగపడతాయి. ఎటాకర్స్పై ప్రతిదాడి చేసే అవకాశం వీటిలో ఉంది. జీపిఎస్, జీఎస్ఎం మాడ్యూల్‌ను ఉపయోగించి ఈ పాదరక్షలను డిజైన్ చేశారు. ‘షూ’లలో జీపిఎస్, జీఎస్ఎం మాడ్యుల్ మినియేచర్ వెర్షన్ చిప్‌లను అమర్చుతారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎమర్జెన్సీ–కాంటాక్ట్‌ల కోసం ‘షూ’ను గట్టిగా నొక్కితే సరిపోతుంది. ఎటాకర్‌కు షాక్ ఇవ్వవచ్చు. ‘ఎటాకర్’ను గుర్తించే వీడియో లైవ్ స్ట్రీమింగ్ సాంకేతికత కూడా వీటికి ఉండడం మరో విశేషం. తాజా విషయానికి వస్తే... హిమాచల్‌ప్రదేశ్, సొలాన్ జిల్లాలోని జైపీ యూనివర్శిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (జెయుఐటీ)కి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు సరన్ష్ రోహిల్లా, సాంధిత్య యాదవ్‌లు మహిళలకు రక్షణ ఇచ్చే ‘స్మార్ట్’ షూస్‌ను అభివృద్ధిపరిచారు. ఇవి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ‘కాంటాక్ట్స్’ను అప్రమత్తం చేస్తాయి. లొకేషన్ గురించి తెలియజేస్తాయి. ‘డిజైన్ అండ్ ఎనాలసిస్ ఆఫ్ స్మార్ట్షూ ఫర్ వుమెన్ సేఫ్టీ’ పేరుతో పేపర్ సమర్పించారు. ‘మహిళల భద్రతకు సాంకేతిక జ్ఞానాన్ని విరివిగా వాడుకోవాల్సిన సమయం ఇది. ఇందులో మాది ఒక అడుగు’ అంటున్నారు సరన్ష్,సాంధిత్య. -
గోవాలో మహాకూటమి
జట్టుకట్టిన ఎంజీపీ, జీఎస్ఎం, శివసేన పణాజి: బీజేపీ అవకాశాలను దెబ్బతీయడమే లక్ష్యంగా రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం మహారాష్ట్రవాడి గోమంతక్ పార్టీ(ఎంజీపీ), గోవా సురక్షా మంచ్(జీఎస్ఎం), శివసేన మహాకూటమిగా ఏర్పడ్డాయి. జీఎస్‌ఎంను ఆరెస్సెస్ తిరుగుబాటు నేత సుభాష్ వెలింగ్కర్ స్థాపించగా, ఎంజీపీ ఈ మధ్యే అధికార బీజేపీతో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో , మహారాష్ట్రలో బీజేపీ భాగస్వామిగా ఉన్న శివసేన తొలిసారి గోవాలో అదృష్టం పరీక్షించుకోబోతోంది. 35 నుంచి 40 సీట్లలో పోటీచేయబోతున్న ఈ కూటమి ఎంజీపీ నాయకుడు సుదిన్ ధావలికర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. వెలింగ్కర్ కన్వీనర్‌గా ఓ సమన్వయ కమిటీని కూడా ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ‘ భాగస్వాముల మధ్య సీట్ల పంపకంతో ఎన్నికల్లో పోటీచేస్తాం. ఇది భావసారూప్యాలున్న పార్టీల కలయిక’ అని సుదిన్ ధావలికర్ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతున్న పాఠశాలలకు ప్రభుత్వ గ్రాంట్లను ఉపసంహరించుకోవడమే తొలి నిర్ణయమవుతుందని వెలింగ్కర్ తెలిపారు. -
బీజేపీకి ఎదురుదెబ్బ
పణజి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు గోవాలో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ(ఎంజీపీ) కొత్త కూటమి ఏర్పాటు చేసింది. శివసేన, గో సురక్ష మంచ్(జీఎస్ఎం)తో కలిసి కూటమిగా ఏర్పడింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలికట్టుగా పోటీ చేస్తామని మూడు పార్టీలు ప్రకటించాయి. ఈ కూటమి ఏర్పాటుతో అధికార బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరుసటిరోజే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఎంజీపీ బయటకు వచ్చింది. లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు ఈ నెల 5న గవర్నర్ మృదులా సిన్హాకు లేఖ రాశారు. 2012లో బీజేపీ, ఎంజీపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 21, ఎంజీపీ మూడు స్థానాల్లో గెలిచాయి. -
మా సర్వీసులు అడ్డుకునే యత్నం
♦ జీఎస్ఎం ఆపరేటర్లపై రిలయన్స్ జియో వ్యాఖ్యలు ♦ నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ లేఖ న్యూఢిల్లీ : టెలికం సేవల్ని పరీక్షించే విషయమై రిలయన్స్ జియో, జీఎస్ఎం ఆపరేటర్ల మధ్య వివాదం మరింత ముదురుతోంది. పరీక్షల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా రిలయన్స్ జియో పూర్తి స్థాయి టెలికం సేవలు అందిస్తోందంటూ జీఎస్ఎం ఆపరేటర్లు చేసిన ఆరోపణలపై జియో తీవ్రంగా స్పందించింది. తమ టెలికం సర్వీసులను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. జీఎస్ఎం ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ వాదనలను ఖండిస్తూ బుధవారం 8 పేజీల లేఖను విడుదల చేసింది. సీవోఏఐ ఆరోపణలు ద్వేషపూరితమైనవని, నిరాధారమైనవని, అవాస్తవాలతో కూడుకున్నవని పేర్కొంది. ప్రస్తుతం ఆధిపత్యం చెలాయిస్తున్న ఆపరేటర్ల స్వార్థ ప్రయోజనాలను కాపాడేవిగా ఇవి ఉన్నాయని వ్యాఖ్యానించింది. పోటీ స్ఫూర్తికి విరుద్ధంగా ఇతర టెలికం ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌ను అక్రమంగా అడ్డుకుంటున్నారని ఆర్‌జియో సీనియర్ అధికారి ఆరోపించారు. టెస్ట్ యూజర్లు ఇబ్బందిపడుతున్నారు... ఏడాది కాలంలో 10 కోట్ల పైగా యూజర్లకు చేరాలని నిర్దేశించుకున్నామని, దీనికి తగ్గ స్థాయిలో ఇంటర్‌కనెక్టివిటీ సదుపాయం కల్పించేందుకు ఇతర టెలికం ఆపరేటర్లు కూడా తమ టవర్ల సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని ఆర్‌జియో వివరించింది. ఇందుకోసం ఆయా ఆపరేటర్లకు కొన్ని చోట్ల తమ సొంత ఖర్చుతో పరికరాలను కూడా అందిస్తున్నట్లు తెలియజేసింది. ‘‘కానీ సదరు ఆపరేటర్లు పాయింట్ ఆఫ్ ఇంటర్కనెక్షన్లను (పీవోఐ) మెరుగుపర్చుకోవడం పక్కన పెట్టి అసంబద్ధమైన కారణాలతో పీవోఐ మెరుగుదలను అడ్డుకుంటున్నారు. ఇంటర్ కనెక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల పీవోఐల వద్ద రద్దీ ఎక్కువై.. కాల్స్ కలవటం లేదు. దీంతో ప్రస్తుతం మాకున్న 15 లక్షల మంది టెస్ట్ యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. కాల్ వైఫల్యాల ఉదంతాలు ఏకంగా 65 శాతం మేర ఉంటున్నాయి. ఈ స్థాయిలో కాల్ ఫెయిల్యూర్స్ ఎదురవుతున్న పరిస్థితుల్లో మేం వాణిజ్యపరమైన సేవలు ప్రారంభించడం తెలివైన పని కాదు. ఒకవేళ ప్రారంభిస్తే ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసే ఆర్‌జియో యూజర్లకు, అలాగే వేరే టెలికం సంస్థల నుంచి మా నెట్‌వర్క్‌కు కాల్స్ చేసే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి’’ అని ఆర్‌జియో వివరించింది. ఇవన్నీ అడ్డుకునే యత్నాలే... ‘సీవోఏఐ గత కొద్ది రోజులుగా నియంత్రణ సంస్థ నుంచి మేం అనుచిత ప్రయోజనాలు పొందుతున్నామన్నట్లుగా ఆరోపణలు చేస్తోంది. అదే ఆరోపణలతో పత్రికా ప్రకటనలిస్తోంది. మా టెస్ట్ ట్రయల్స్‌కు వ్యతిరేకంగా లేఖలు రాయడం కూడా చేసింది. ఇవన్నీ కూడా మా లాంటి కొత్త సంస్థను మార్కెట్లో ప్రవేశించకుండా అడ్డుకునేందుకు, ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలే. ట్రయల్స్‌లో పాల్గొంటున్న యూజర్ల నుంచి మేం ఎలాంటి చార్జీలూ వసూలు చేయడం లేదు. కాబట్టి పోటీ సంస్థలను దెబ్బతీసేలా మా టారిఫ్‌లు ఉంటున్నాయన్న ఆరోపణలన్నీ అవాస్తవాలే. నెట్వర్క్ ఇంటర్కనెక్షన్ చార్జీల అంశాన్ని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సమీక్షిస్తోంది. దానికి ముడిపెట్టేలా సీవోఏఐ కావాలనే వివాదం రేపుతోంది’’ అని జియో వివరించింది. వివాదమిదీ.. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో త్వరలో భారీ ఎత్తున టెలికం సర్వీసులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. అయితే, ఇందులో భాగంగా టెస్ట్ కనెక్షన్లు ఇస్తున్న ఆర్‌జియో ఆ ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా పూర్తి స్థాయి సర్వీసులు అందించేస్తోందంటూ టెలికం శాఖకు సీవోఏఐ ఆగస్టు 8న లేఖ రాసింది. దాదాపు 15 లక్షలకు పైగా యూజర్లకిచ్చిన అన్ని కనెక్షన్లు ఆర్‌జియో తక్షణం ఆపేసేలా ఆదేశించాలని కోరింది. భారతీ ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ తదితర సంస్థలు సీవోఏఐలో భాగంగా ఉన్నాయి. దీనిపైనే తాజాగా ఆర్‌జియో స్పందించింది. -
జీఎస్ఎం వినియోగదారులు@ 77.4 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ ప్రధాన టెలికం కంపెనీల జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య మార్చి చివరి నాటికి 77.4 కోట్లకు చేరిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) తెలిపింది. జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య మార్చి నెలలో కొత్తగా 52.3 లక్షల మేర పెరిగినట్లు పేర్కొంది. ఎయిర్టెల్ కొత్త వినియోగదారులు సంఖ్య అత్యధికంగా 25 లక్షలమేర పెరిగిందని తెలిపింది. దీంతో సంస్థ మొత్తం కస్టమర్లు 25.1 కోట్లకు చేరారని పేర్కొంది. వొడాఫోన్ వినియోగదారుల సంఖ్య 12 లక్షల పెరుగుదలతో 19.7 కోట్లకు ఎగసినట్లు తెలిపింది. ఐడియా (4.5 లక్షల మంది), ఎయిర్‌సెల్ (4 లక్షలు)తో పోలిస్తే టెలినార్ (7 లక్షలు) కస్టమర్ల సంఖ్య మార్చిలో అధికంగా పెరగడం గమనార్హం. -
55 లక్షల కొత్త జీఎస్ఎం యూజర్లు
న్యూఢిల్లీ: జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. ఆగస్టులో 55.4 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) పేర్కొంది. ఈ గణాంకాల్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్‌ల వివరాలు లేవు. సీఓఏఐ గణాంకాల ప్రకారం..., * ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి మొత్తం జీఎస్ఎం మొబైల్ యూజర్ల సంఖ్య 74.99 కోట్లకు పెరిగింది. * ఆగస్టులో అత్యధికంగా కొత్త మొబైల్ వినియోగదారులు ఐడియా సెల్యులర్కు లభించారు. 17.2 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఐడియా మొత్తం వినియోగదారుల సంఖ్య 14.18 కోట్లకు చేరింది. మార్కెట్ వాటా 18.91 శాతంగా ఉంది. * వొడాఫోన్‌కు 12.2 లక్షల మంది కొత్తగా వినియోగదారులయ్యారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 17.24 కోట్లకు చేరింది. మార్కెట్ వాటా 23 శాతంగా ఉంది. * కొత్తగా లభించిన 7.69 లక్షల వినియోగదారులతో ఎయిర్టెల్ మొత్తం యూజర్ల సంఖ్య 21.05 కోట్లకు పెరిగింది. మార్కెట్ వాటా 28.07%. * ఎయిర్‌సెల్‌కు 9.05 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. దీంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 7.48 కోట్లకు పెరిగింది. 7.06 లక్షల మంది కొత్త వినియోగదారులతో యూనినార్ మొత్తం వినియోగదారుల సంఖ్య 4.09 కోట్లకు చేరింది. వీడియోకాన్ మొబైల్ సంస్థకు 1.96 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. -
జోరుగా 3జీ డేటా వినియోగం
న్యూఢిల్లీ: భారత్‌లో 3జీ సర్వీసుల వినియోగం భారీగా పెరిగిపోతోంది. గతేడాది 3జీ సర్వీసుల వాడకం రెట్టింపు కంటే ఎక్కువగా ఉందని, అంతర్జాతీయ సగటును మించి పోయిందని నోకియా సొల్యుషన్స్ అండ్ నెట్వర్క్స్(ఎన్ఎస్ఎన్) నివేదిక వెల్లడించింది. అయితే అగ్రశ్రేణి 50 నగరాల్లో 3జీ కవరేజ్ ఇంకా విస్తరించాల్సి ఉందంటున్న ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు..., 2012 డిసెంబర్ చివరికల్లా 8 పెటబైట్స్గా ఉన్న 3జీ డేటా వినియోగం గత ఏడాది డిసెంబర్ చివరికల్లా 21 పెటబైట్స్కు చేరింది. ఒక పెటాబైట్ 1,024 టెర్రాబైట్స్కు సమానం. 2జీ, 3జీ సర్వీసుల కారణంగా ఉత్పన్నమైన డేటా ట్రాఫిక్ గతేడాది 87 శాతం వృద్ధి చెందింది. 2013లో భారత వినియోగదారుల నెలసరి సగటు 3జీ డేటా వినియోగం 532 మెగా బైట్లుగా ఉంది. 2012లో ఈ వినియోగం 434 మెగాబైట్లు. 3జీ వినియోగదారుల సగటు డేటా వినియోగం 2జీ వినియోగదారుల సగటు డేటా వినియోగం(146 ఎంబీ)తో పోల్చితే మూడు రెట్లకు పైగానే ఉంది. 2012లో మొబైల్ డేటాలో 33 శాతంగా ఉన్న 3జీ డేటా వినియోగం 2013లో 43 శాతానికి పెరిగింది. 3జీ వినియోగదారుల సంఖ్య కూడా బాగానే పెరుగుతోంది. 2012 చివరినాటికి 2 కోట్లుగా ఉన్న 3జీ వినియోగదారుల సంఖ్య గతేడాది చివరి నాటికి 3 కోట్లకు పెరిగింది. దేశవ్యాప్తంగా 80 వేల మొబైల్ టవర్లు 3జీ సిగ్నల్స్‌ను ట్రాన్స్మిట్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 30-40 శాతం కవరేజ్ లభిస్తోంది. ఈ కవరేజ్ 70-80 శాతానికి పెరిగితే 3జీ వినియోగంలో భారీ వృద్ధి ఉంటుంది. కాగా దేశవ్యాప్తంగా 4,50,000 టవర్లు 2జీ సిగ్నళ్లందజేస్తున్నాయి. 4జీ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, 3జీ సర్వీసుల హవా 2-3 ఏళ్లపాటు కొనసాగుతుంది. -
ఆదాయంలో స్పెక్ట్రమ్ ఫీజు 3 శాతం!
న్యూఢిల్లీ: మొబైల్ కంపెనీల స్పెక్ట్రమ్ ఫీజుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు చేసింది. వేలంలో స్పెక్ట్రమ్ గెలుపొందిన కంపెనీలు తమ ఆదాయంపై 3 శాతాన్ని వార్షిక ఫీజుగా చెల్లించాలని పేర్కొంది. దీంతో పాటు స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీ విషయమై మరికొన్ని సూచనలు కూడా చేసింది. స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీ(ఎస్‌యూసీ) విషయమై టెలికాం ఆపరేటర్ల (రిలయన్స్ ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు, ఇతర జీఎస్ఎం కంపెనీలకు ) మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. గతంలో ఈ ఫీజు 3 నుంచి 8 శాతంగా ఉండేది. కాగా ఈ ఫీజును 3-5 శాతం మధ్య ఉండాలని టెలికామ్ రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సూచించింది. దీనిని అనుసరించాలని జీఎస్ఎం కంపెనీల సమాఖ్య సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తోంది. -
స్వల్పంగా పెరిగిన జీఎస్ఎం మొబైల్ యూజర్లు
న్యూఢిల్లీ: జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య గత నెలలో స్వల్పంగా పెరిగింది. ఆగస్టులో కొత్తగా 17.8 లక్షల మంది జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారు. దీంతో జూలై చివరి నాటికి 67.26 కోట్లుగా ఉన్న జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య అగస్టులో 67.44 కోట్లకు చేరిందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) మంగళవారం తెలిపింది. వొడాఫోన్ వినియోగదారులు తగ్గడం విశేషం. దీంతోపాటు యూనినార్, ఎంటీఎన్ఎల్ వినియోగదారులు కూడా తగ్గారు. ఆగస్టులో ఎయిర్‌సెల్ సంస్థకు అత్యధికంగా కొత్త మొబైల్ వినియోగదారులు లభించారు. ఈ నెలలో లభించిన 8.76 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఈ సంస్థ మొత్తం వినియోగదారుల సంఖ్య 6.26 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్‌టెల్‌కు 8.33 లక్షల మంది కొత్త వినియోగదారుల లభించారు. ఐడియాకు 7.52 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. వొడాఫోన్‌కు 85 వేల మంది వినియోగదారులు తగ్గారు. యూనినార్‌కు 5 లక్షల మంది వినియోగదారులు తగ్గడంతో వీరి సంఖ్య 3.22 కోట్లకు చేరింది.