న్యూఢిల్లీ: మొబైల్ కంపెనీల స్పెక్ట్రమ్ ఫీజుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు చేసింది. వేలంలో స్పెక్ట్రమ్ గెలుపొందిన కంపెనీలు తమ ఆదాయంపై 3 శాతాన్ని వార్షిక ఫీజుగా చెల్లించాలని పేర్కొంది. దీంతో పాటు స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీ విషయమై మరికొన్ని సూచనలు కూడా చేసింది. స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీ(ఎస్‌యూసీ) విషయమై టెలికాం ఆపరేటర్ల (రిలయన్స్ ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు, ఇతర జీఎస్‌ఎం కంపెనీలకు ) మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. గతంలో ఈ ఫీజు 3 నుంచి 8 శాతంగా ఉండేది. కాగా ఈ ఫీజును 3-5 శాతం మధ్య ఉండాలని టెలికామ్ రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సూచించింది. దీనిని అనుసరించాలని జీఎస్‌ఎం కంపెనీల సమాఖ్య సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తోంది.