స్వల్పంగా పెరిగిన జీఎస్‌ఎం మొబైల్ యూజర్లు
Published Wed, Sep 18 2013 2:51 AM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM
న్యూఢిల్లీ: జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య గత నెలలో స్వల్పంగా పెరిగింది. ఆగస్టులో కొత్తగా 17.8 లక్షల మంది జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారులయ్యారు. దీంతో జూలై చివరి నాటికి 67.26 కోట్లుగా ఉన్న జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య అగస్టులో 67.44 కోట్లకు చేరిందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) మంగళవారం తెలిపింది. వొడాఫోన్ వినియోగదారులు తగ్గడం విశేషం. దీంతోపాటు యూనినార్, ఎంటీఎన్‌ఎల్ వినియోగదారులు కూడా తగ్గారు. ఆగస్టులో ఎయిర్‌సెల్ సంస్థకు అత్యధికంగా కొత్త మొబైల్ వినియోగదారులు లభించారు. ఈ నెలలో లభించిన 8.76 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఈ సంస్థ మొత్తం వినియోగదారుల సంఖ్య 6.26 కోట్లకు చేరింది.
భారతీ ఎయిర్‌టెల్‌కు 8.33 లక్షల మంది కొత్త వినియోగదారుల లభించారు. ఐడియాకు 7.52 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. వొడాఫోన్‌కు 85 వేల మంది వినియోగదారులు తగ్గారు. యూనినార్‌కు 5 లక్షల మంది వినియోగదారులు తగ్గడంతో వీరి సంఖ్య 3.22 కోట్లకు చేరింది.
Advertisement
Advertisement