వాట్సాప్ యూజర్లు వంద కోట్లు
న్యూయార్క్: మొబైల్ మెసేజింగ్ సేవలందించే వాట్సాప్ యూజర్ల సంఖ్య 100 కోట్ల మైలురాయిని దాటింది. గత అయిదు నెలల్లో అదనంగా 10 కోట్ల మంది యూజర్లు తోడవడంతో ఇది సాధ్యపడిందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ తెలిపారు. దీంతో ప్రపంచ జనాభాలో ప్రతి ఏడుగురిలో ఒకరు తమ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లవుతుందని సంస్థ బ్లాగులో పేర్కొన్నారు. 2014 ఫిబ్రవరిలో సోషల్ నెట్‌వర్కింగ్ సైటు ఫేస్‌బుక్.. వాట్సాప్‌ను 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా రోజూ 42 బిలియన్ల మెసేజ్‌లు, 1.6 బిలియన్ల ఫొటోలు, 250 మిలియన్ల వీడియోలను యూజర్లు షేర్ చేసుకుంటున్నారని కౌమ్ తెలిపారు.