2017 నాటికి నెటిజన్లు @ 50 కోట్లు | Indian mobile internet users to rise to 314 million by 2017 | Sakshi
Sakshi News home page

2017 నాటికి నెటిజన్లు @ 50 కోట్లు

Published Tue, Jul 21 2015 2:09 AM | Last Updated on Wed, Aug 29 2018 7:26 PM

2017 నాటికి నెటిజన్లు @ 50 కోట్లు - Sakshi

2017 నాటికి నెటిజన్లు @ 50 కోట్లు

- ఐఏఎంఏఐ, కేపీఎంజీల నివేదిక
న్యూఢిల్లీ:
భారత్‌లో ఇంటర్నెట్‌ను వినియోగించేవారి సంఖ్య జోరుగా పెరుగుతోంది. 2017 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50.3 కోట్లకు పెరుగుతుందని ఒక నివేదిక వెల్లడించింది. రానున్న కాలంలో మొబైల్ ఇంటర్నెట్ కీలకం కానున్నదంటున్న ఈ నివేదికను ఐఏఎంఏఐ, కేపీఎంజీలు సంయుక్తంగా రూపొందించాయి. మొబైల్ వినియోగదారుల సంఖ్య ఏటా 28 శాతం చొప్పున వృద్ధి చెందుతుండడమే దీనికి ప్రధాన కారణమంటున్న ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు..,
 
- ఈ ఏడాది జూన్ చివరి నాటికి భారత్‌లో మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య (వెర్లైన్, వెర్లైస్ రెండూ కలిపి) 35 కోట్లుగా ఉంది.
- 2017 నాటికి మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50.3 కోట్లకు పెరుగుతుంది. దీంట్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య 31.4 కోట్లుగా ఉంటుంది. 2014 నాటికి ఈ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 15.9 కోట్లు మాత్రమే.
- 2013-17 కాలానికి మొబైల్ నెట్ యూజర్ల  సంఖ్య 28% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తోంది.
- భవిష్యత్తులో 2జీ వినియోగదారుల సంఖ్య గణనీయంగా తగ్గి 3జీ యూజర్ల సంఖ్య బాగా పెరుగుతుంది. 2013-17 కాలానికి 3జీ వినియోగదారుల సంఖ్య 61% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుంది.
- 2014 చివరికి 8.2 కోట్లుగా ఉన్న 3జీ  కస్టమర్ల సంఖ్య 2017 నాటికి 28.4 కోట్లకు పెరుగుతుంది.
- మొబైల్ ఇంటర్నెట్ కారణంగా ఇంటర్నెట్ విస్తరణ అనూహ్యంగా ఉండనున్నది.
- 90 కోట్లకు పైగా ఉన్న గ్రామీణ భారతీయుల్లో 7 శాతం మంది(దాదాపు 6 కోట్లు) ఇంటర్నెట్‌ను చురుకుగా వినియోగిస్తున్నారు.
- 2012లో మొబైల్ ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగించే గ్రామీణుల సంఖ్య 0.4 శాతమే. రెండేళ్లలో ఈ సంఖ్య 4.4 శాతానికి పెరిగింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement