IAMAI
-
గూగుల్‌కు మరో ఎదురుదెబ్బ.. ఏకమైన 40 భారతీయ కంపెనీలు!
Google Play Billing System: టెక్ దిగ్గజం గూగుల్ (Google)కు వ్యతిరేతికంగా 40 భారతీయ స్టార్టప్‌లు, కంపెనీలు ఏకమయ్యాయి. గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్ (GPBS)ను సవాలు చేయడానికి సిద్ధమయ్యాయి. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) ఆధ్వర్యంలో సామూహికంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. గూగుల్‌కు చెందిన GPBS ప్రకారం.. గూగుల్ ప్లేలోని యాప్ కొనుగోళ్లన్నీ తమ చెల్లింపు గేట్‌వే ద్వారానే జరగాలి. ఈ లావాదేవీలపై గూగుల్ భారీగా 30 శాతం కమీషన్ విధిస్తోంది. అయితే భారత్‌లో GPBSకి బదులుగా యూజర్ చాయిస్ బిల్లింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేవాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఇటీవలి తీర్పులో గూగుల్‌ను ఆదేశించింది. చట్టపరమైన చర్యలు! మీడియా నివేదికల ప్రకారం.. గూగుల్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన టాస్క్‌ఫోర్స్ వారి ఆందోళనల తీవ్రతను సూచిస్తూ గూగుల్‌పై చట్టపరమైన చర్యలను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో గూగుల్ టాస్క్‌ఫోర్స్ ముందు హాజరై వివరణ ఇస్తుందని భావిస్తున్నారు. ఆసక్తికరంగా ఈ టాస్క్‌ఫోర్స్‌లో గూగుల్ కూడా ప్రతినిధి స్థానాన్ని కలిగి ఉందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. (సీఎఫ్‌వో జతిన్ దలాల్: విప్రోలో రాజీనామా.. కాగ్నిజెంట్‌లో ప్రత్యక్షం!) ఇక మరో అంశంలో సీసీఐ విధించిన రూ. 936.44 కోట్ల పెనాల్టీపై గూగుల్ అప్పీల్‌ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) నవంబర్ 28న విచారించనున్నట్లు ప్రకటించింది. ప్లే స్టోర్ విధానాలకు సంబంధించి దాని ఆధిపత్య మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు గూగుల్‌కు సీసీఐ ఈ పెనాల్టీ విధించింది. -
ఆన్లైన్ గేమింగ్‌కు ఎస్ఆర్వో ఏర్పాటు చేస్తాం
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్‌పై పర్యవేక్షణకు సంబంధించి స్వీయ నియంత్రణ సంస్థను (ఎస్ఆర్వో) ఏర్పాటు చేసేందుకు పరిశ్రమ సమాఖ్య ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఐఏఎంఏఐ ముందుకొచ్చింది. ఇందుకు అవసరమైన సామరŠాధ్యలు, అనుభవం తమకు ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. నైపుణ్యాల ఆధారిత పలు ఆన్లైన్ గేమింగ్ సంస్థలకు ఐఏఎంఏఐలో సభ్యత్వం ఉండటం కూడా ఇందుకు తోడ్పడగలదని పేర్కొంది. ఇప్పటికే కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్దేశించినట్లుగా ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్ కంపెనీస్ మొదలైన వాటికి సంబంధించిన ఎస్ఆర్వోలను నిర్వహిస్తున్నామని తెలిపింది. సమాజంపై ప్రభావం చూపే ఆన్లైన్ గేమింగ్‌పై కేంద్రం తగు విధానాలు లేదా కొత్త చట్టం తీసుకువస్తుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో ఐఏఎంఏఐ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
వినియోగదారులకు ప్రతికూలంగా ఈ-కామర్స్ ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: వినియోగదారుల హక్కుల పరిరక్షణ (ఈ–కామర్స్) నిబంధనలకు ప్రతిపాదించిన సవరణలు.. పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. వీటిలో చాలా ప్రతిపాదనలు అస్పష్టంగా ఉన్నందున అనుకోని విధంగా వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫ్లాష్ సేల్ కాన్సెప్టు మొదలైన వాటికి తగిన నిర్వచనం ఇవ్వాలని, వినియోగదారుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు సంబంధించి ప్రస్తుత చట్టాలకు లోబడి ఈ–కామర్స్ సంస్థలు పనిచేసేలా చూడాలని కోరింది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తాము పూర్తి మద్దతునిస్తామని, అయితే ఈ–కామర్స్ వ్యాపారంపరంగా ప్రతిపాదిత సవరణల్లో పలు అంశాలు అస్పష్టంగా ఉండటం ఆందోళనకరమని ఐఏఎంఏఐ తెలిపింది. కొన్ని సవరణల వల్ల ఆన్లైన్, ఆఫ్‌లైన్ వ్యాపారాలకు సమాన అవకాశాలు దక్కకుండా పోతాయని పేర్కొంది. అలాగే ఈ–కామర్స్ కంపెనీలపై ఆంక్షలు మరింతగా పెరుగుతాయని, మరిన్ని నిబంధనలను పాటించాల్సిన భారం గణనీయంగా పెరుగుతుందని ఐఏఎంఏఐ అభిప్రాయపడింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు తన అభిప్రాయాలను తెలియజేసింది. ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలపై మోసపూరిత ఫ్లాష్ సేల్స్‌ను, తప్పుగా ఉత్పత్తులు, సేవలను అంటగట్టే విధానాలకు అడ్డుకట్ట వేసే దిశగా జూన్ 21న కేంద్రం ఈ–కామర్స్ నిబంధనల ముసాయిదాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగస్టు 5 దాకా పరిశ్రమవర్గాలు, ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఇప్పటికే ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్, ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర పరిశ్రమ వర్గాలు తమ ఆందోళనలను ప్రభుత్వానికి తెలియజేశాయి. చదవండి : వ్యాక్సిన్ వేయించుకోండి, లేదంటే ఇకపై బస్సు ప్రయాణం కష్టమే -
‘అన్‌లాక్’తో ఇ–కామర్స్ టేకాఫ్
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ప్రభుత్వం క్రమంగా సడలిస్తూ అన్‌లాక్ చేస్తున్న నేపథ్యంలో ఇ–కామర్స్ వ్యాపారం పుంజుకుంటోంది. షాపింగ్ కోసం బైటికెళ్లడాన్ని తగ్గించుకుంటూ ఆన్లైన్ మాధ్యమానికి వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తుండటం ఇందుకు తోడ్పడుతోంది. ఇక, పెరుగుతున్న వ్యాపారంతో పాటు ఇ–కామర్స్ విభాగంలో కొత్తగా మరింత మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ఇ–కామర్స్ వ్యాపారం దాదాపు 80 శాతం పెరిగింది. దాదాపు 10 కోట్లమంది క్రియాశీలంగా ఉండే వినియోగదారులతో ఇ–కామర్స్ రంగం అంతకంతకూ వృద్ధి చెందుతోందని నివేదిక పేర్కొంది. లాక్డౌన్ ముందటి పరిస్థితి కంటే కూడా ప్రస్తుతం ఇ–కామర్స్ వ్యాపారం ఎక్కువగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్ని రకాల వస్తువులను విక్రయించే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఇ–కామర్స్ సంస్థలే కాదు... కిరాణా సరుకులు, వ్యాయామ పరికరాలు వంటి ప్రత్యేక కేటగిరీ వస్తువులను విక్రయించే సంస్థల వ్యాపారం కూడా జోరందుకుంది. ఐఏఎంఏఐ నివేదిక ప్రకారం దేశంలో ఇ–కామర్స్ వ్యాపారం ఇలా ఉంది... లాక్డౌన్ రోజుల్లో 80 శాతం వ్యాపారం డౌన్ దేశంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలులో ఉన్న ఏప్రిల్, మేలో ప్రభుత్వం కేవలం నిత్యావసర వస్తువుల విక్రయానికే అనుమతించింది. దాంతో ఇ–కామర్స్ వ్యాపారం దాదాపు 80 శాతం తగ్గిపోయింది. మార్చి చివరి వారం నుంచి జూన్ మొదటివారం వరకూ దేశీయంగా ఇ–కామర్స్ సంస్థలు దాదాపు రూ.7,520 కోట్ల వ్యాపారాన్ని కోల్పోయారని అంచనా. ఉపాధికీ ఊతం.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇతర రంగాల్లో ఉద్యోగాల్లో కోత విధిస్తుంటే ఇ–కామర్స్ రంగం కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా వినియోగదారులకు సకాలంలో సరఫరా చేసేందుకు ఇ–కామర్స్ సంస్థలు కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. అమెజాన్ ఇండియా తమ పంపిణీ వ్యవస్థలో కొత్తగా 50వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అటు బిగ్ బాస్కెట్ ఇటీవల కొత్తగా 12వేలమంది సిబ్బందిని నియమించుకుంది. గ్రోఫర్స్ సంస్థ ఇప్పటికే కొత్తగా 2,500 మందిని రిక్రూట్ చేసుకోగా ...మరో 5వేలమంది ఉద్యోగులను త్వరలో తీసుకుంటామని చెప్పింది. అటు ఇ–కామ్ ఎక్స్‌ప్రెస్ సంస్థ ఇటీవల కొత్తగా 7,500 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. అన్‌లాక్‌తో జోరందుకున్న వ్యాపారం మే మూడో వారం నుంచి లాక్డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తున్న ప్రభుత్వం జూన్ నుంచి మరింత వెసులుబాటు కల్పించడం ఇ–కామర్స్ సంస్థలకు అనుకూలంగా మారింది. ఇ–కామర్స్ సంస్థలు దేశంలోని దాదాపు 19వేల పిన్‌కోడ్ ప్రాంతాల్లో ప్రస్తుతం సరుకులు అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో రోజుకు 30లక్షల వరకు షిప్మెంట్లను డెలివరీ చేస్తున్నాయి. మరికొంతకాలం పాటు వినియోగదారులు షాపింగ్ కోసం ఎక్కువగా బయటకు వెళ్లే పరిస్థితి లేనందున రాబోయే రెండు నెలల్లో ఈ వ్యాపారం మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సంస్థలవారీగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తుల విషయం చూస్తే.. అమెజాన్ ఇండియా పోర్టల్‌లో ప్రధానంగా ఉద్యోగుల ‘వర్క్ ఫ్రం హోం’, విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు సంబంధించిన వస్తువుల విక్రయం విపరీతంగా పెరిగింది. మొత్తం మీద అమెజాన్ వ్యాపారం 50 శాతం పెరిగింది. ఇక, మరో దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వ్యాపారం 90 శాతం ఎగిసింది. ఈ పోర్టల్ ద్వారా వ్యాయామ పరికరాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, గృహ అలంకరణ వస్తువుల విక్రయాలు గణనీయంగా ఉంటున్నాయి. -
ఈ జూన్ నాటికి వీరి సంఖ్య 50కోట్లకు పైనే
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2018 జూన్ నాటికి 50కోట్ల (500 మిలియన్లు) మార్క్నుఅధిగమిస్తుందని ఓ సర్వే తెలిపింది. 170 నగరాల్లో, 750 గ్రామాలలో నిర్వహించిన ఉమ్మడి సర్వే తర్వాత ఈ నివేదిక విడుదల చేసింది. ముఖ్యంగా ఈ 170 నగరాల్లో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాలు అగ్రస్థానంలో ఉండగా, ఫతేపూర్, జగదల్పూర్, ఇంఫాల్ ఆఖరిస్థానంలో ఉన్నాయి. మొత్తం తొమ్మిది నగరాల్లో 35 శాతం మంది పట్టణ ఇంటర్నెట్ వినియోగదారులు నమోదయ్యారు. అయితే చిన్న మెట్రోలు, నాన్ మెట్రో నగరాల్లో జాతీయ సగటు కన్నా ఇంటర్నెట్ వ్యాప్తి స్థాయి తక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 'ఇంటర్నెట్ ఇన్ ఇండియా 2017' అంనే అంశంపై ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ), కంతర్ ఐఎంఆర్బీ ఈ రిపోర్టును విడుదల చేసింది. 2017 డిసెంబరు నాటికి మొత్తం జనాభాలో 35శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులుగా ఉన్నారని నివేదించింది. నివేదిక ప్రకారం, 2016 డిసెంబర్ -2017 డిసెంబర్ నాటికి అర్బన్ ఇండియాలో 9.66 శాతం వృద్ధిని సాధించి 295 మిలియన్లమంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారని అంచనా వేసింది. మరోవైపు, 2016 డిసెంబర్ నుంచి 2017 డిసెంబర్ నాటికి గ్రామీణ ప్రాంతాల్లో డబుల్ డిజిట్ వృద్ధిని సాధించింది. 14.11శాతం వృద్ధితో 186 మిలియన్ల మంది ఇంటర్నెట్ రోజువారీ వినియోగించుకున్నా రని నివేదిక పేర్కొంది. 2017 జూన్ , ఆగస్టు నెలల మధ్య 170 నగరాల్లో 60వేల మందిని, గ్రామీణ ప్రాంతంలో 750 గ్రామాల్లో 15వేల మందిపై ఈ సర్వే నిర్వహించింది. -
గతవారం బిజినెస్
నియామకాలు టాటా సన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)గా సౌరభ్ అగర్వాల్ నియమితులయ్యారు. గ్రూప్‌కు సంబంధించిన మూలధన కేటాయింపుల నిర్ణయాలు, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కార్యకలాపాలను ఇకపై సౌరభ్ చూసుకోనున్నారు. ఇక టాటా సన్స్ గ్రూప్ జనరల్ కౌన్సెల్‌గా శువ మండల్ ఎంపికయ్యారు. గూగుల్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్న రాజన్ ఆనందన్ తాజాగా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) కొత్త చైర్మన్‌గా నియమితులయ్యారు. అలాగే ఐఏఎంఏఐ వైస్ చైర్మన్‌గా మేక్మైట్రిప్ చైర్మన్, సీఈవో దీప్ కల్రా ఎంపికయ్యారు. ఇక ఐఏఎంఏఐ ట్రెజరర్‌గా ఫేస్బుక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా, దక్షిణాసియా) ఉమాంగ్ బేడి నియమితులయ్యారు. పేటీఎం బ్యాంక్ కార్యకలాపాలు షురూ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం.. పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉంటాయని ప్రకటించింది. అలాగే కనీస బ్యాలెన్స్ నిబంధనలు ఉండబోవని, ఆన్లైన్ లావాదేవీలకు (నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ మొదలైనవి) ఫీజులు ఉండవని పేర్కొంది. ఎయిర్టెల్, ఇండియా పోస్ట్ తర్వాత పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించిన సంస్థల్లో పేటీఎం మూడోది. ఇక బీమా ఐపీవోలు! దిగ్గజ బీమా కంపెనీలు ఈ ఏడాది వరుసగా పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నాయి. జాబితాలో ముందు వరుసలో ఎస్బీఐ లైఫ్, న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూటీఐ ఫండ్ నిలుస్తున్నాయి. ఆకర్షణీయ ధరలో హెచ్‌సీఎల్ టెక్ బైబ్యాక్ దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన హెచ్‌సీఎల్ టెక్ షేర్ల బైబ్యాక్ ధరను ప్రకటించింది. మార్కెట్ ధర కంటే 17 శాతం ప్రీమియంతో ఒక్కో షేరును రూ.1,000 ధరకు బైబ్యాక్ చేయనున్నట్టు తెలియజేసింది. ప్రపోర్షనేట్ విధానంలో టెండర్ ఆఫర్ ద్వారా దీన్ని నిర్వహించనున్నట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు తెలిపింది. రూ.3,500 కోట్ల విలువైన షేర్లను కంపెనీ బైబ్యాక్ చేయనుంది. ఎఫ్‌డీఐల చిరునామా భారత్ ప్రపంచంలో అత్యధికంగా విదేశీ పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షిస్తున్న దేశంగా భారత్ వరుసగా రెండో ఏడాదీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 2016వ సంవత్సరంలో 62.3 బిలియన్ డాలర్ల (రూ.3.99 లక్షల కోట్లు సుమారు) ఎఫ్‌డీఐలను ఆకర్షించింది. ఫైనాన్షియల్ టైమ్స్‌కు చెందిన ఎఫ్‌డీఐ ఇంటెలిజెన్స్ విభాగం ’ఎఫ్‌డీఐ 2017’ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం ఎఫ్డీలను రాబట్టడంలో చైనా, అమెరికాలు భారత్ వెనుకనే నిలిచాయి. ఈసారి ఆల్టో కాదు స్విఫ్ట్.. దిగ్గజ వాహన తయారీ కంపెనీ ’మారుతీ సుజుకీ’ ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ’స్విఫ్ట్’ తాజాగా అదే కంపెనీకి చెందిన ’ఆల్టో’ మోడల్‌ను వెనక్కు నెట్టింది. దేశీ మార్కెట్లో ఏప్రిల్ నెల వాహన విక్రయాల్లో ’స్విఫ్ట్’.. బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా అవతరించింది. కాగా మారుతీ ఎప్పటిలాగే ఇండియన్ ప్యాసెంజర్ వాహన మార్కెట్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కంపెనీకి చెందిన ఏడు కార్లు ’టాప్10 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్’ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. ఇక మిగిలిన మూడు స్థానాలను హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆక్రమించింది. -
మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు @ 37 కోట్లు
♦ ఈ ఏడాది జూన్‌కల్లా ఈస్థాయికి ♦ 50శాతం వృద్ధి: ఐఏఎంఏఐ వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ వాడకం కూడా జోరుగా పెరుగుతోందని ఐఏఎంఏఐ(ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) తెలిపింది. ఈ ఏడాది జూన్ కల్లా మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 55 శాతం వృద్ధితో 37 కోట్లకు పెరుగుతుందని పేర్కొంది. భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ వినియోగం సంబంధిత అంశాల గురించి ఈ సంస్థ వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు.... గత ఏడాది జూన్‌లో 23.8 కోట్లుగా ఉన్న మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి 30.6 కోట్లకు వృద్ధి చెందింది. వీటిల్లో 22 కోట్లు పట్టణ ప్రాంతం వారే. వార్షికంగా చూస్తే మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో 71 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి గ్రామీణ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 93 శాతం వృద్ధితో 8.7 కోట్లకు పెరిగింది. -
‘మొబైల్10ఎక్స్’ను ఆవిష్కరించిన ఐఏఎంఏఐ
న్యూఢిల్లీ: మొబైల్ యాప్ డెవలపర్ల వృద్ధికి దోహదపడే విధంగా మొబైల్ ఇంటర్నెట్ సమాఖ్య ఐఏఎంఏఐ ‘మొబైల్10ఎక్స్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం 50 వేలుగా ఉన్న మొబైల్ యాప్ డెవలపర్ల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షలకు చేర్చడం... అలాగే మొబైల్ యాప్ విభాగం ఆదాయాన్ని రూ.1000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు పెంచటమే ఈ కార్యక్రమ లక్ష్యం. దీనికి గూగుల్ ఇండియా, పేటీఎం సంస్థలు ప్రారంభ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఐఏఎంఏఐ ఈ కార్యక్రమం కింద వచ్చే ఐదేళ్లలో ఐదు మొబైల్ స్టార్టప్ హబ్‌లను ఏర్పాటు చేయనుంది. వీటిని బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, పుణే/ముంబై పట్టణాల్లో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఐఏఎంఏఐ ప్రెసిడెంట్ సుభో రాయ్ తెలిపారు. వీటిల్లో డెవలపర్లు స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి అవసరమైన టెస్టింగ్ ల్యాబ్, డిజైన్ ల్యాబ్, కెపాసిటీ బిల్డింగ్ వంటి తదితర సౌలభ్యాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమం కింద 5 లక్షల ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆండ్రాయిడ్, ఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై శిక్షణను ఇస్తామని తెలిపారు. భారత్‌లో యాప్ డెవలప్మెంట్కు మంచి అవకాశాలు ఉన్నాయని గూగుల్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ ఆనందన్ పేర్కొన్నారు. -
2017 నాటికి నెటిజన్లు @ 50 కోట్లు
- ఐఏఎంఏఐ, కేపీఎంజీల నివేదిక న్యూఢిల్లీ: భారత్‌లో ఇంటర్నెట్ను వినియోగించేవారి సంఖ్య జోరుగా పెరుగుతోంది. 2017 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50.3 కోట్లకు పెరుగుతుందని ఒక నివేదిక వెల్లడించింది. రానున్న కాలంలో మొబైల్ ఇంటర్నెట్ కీలకం కానున్నదంటున్న ఈ నివేదికను ఐఏఎంఏఐ, కేపీఎంజీలు సంయుక్తంగా రూపొందించాయి. మొబైల్ వినియోగదారుల సంఖ్య ఏటా 28 శాతం చొప్పున వృద్ధి చెందుతుండడమే దీనికి ప్రధాన కారణమంటున్న ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు.., - ఈ ఏడాది జూన్ చివరి నాటికి భారత్‌లో మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య (వెర్లైన్, వెర్లైస్ రెండూ కలిపి) 35 కోట్లుగా ఉంది. - 2017 నాటికి మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50.3 కోట్లకు పెరుగుతుంది. దీంట్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య 31.4 కోట్లుగా ఉంటుంది. 2014 నాటికి ఈ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 15.9 కోట్లు మాత్రమే. - 2013-17 కాలానికి మొబైల్ నెట్ యూజర్ల సంఖ్య 28% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తోంది. - భవిష్యత్తులో 2జీ వినియోగదారుల సంఖ్య గణనీయంగా తగ్గి 3జీ యూజర్ల సంఖ్య బాగా పెరుగుతుంది. 2013-17 కాలానికి 3జీ వినియోగదారుల సంఖ్య 61% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుంది. - 2014 చివరికి 8.2 కోట్లుగా ఉన్న 3జీ కస్టమర్ల సంఖ్య 2017 నాటికి 28.4 కోట్లకు పెరుగుతుంది. - మొబైల్ ఇంటర్నెట్ కారణంగా ఇంటర్నెట్ విస్తరణ అనూహ్యంగా ఉండనున్నది. - 90 కోట్లకు పైగా ఉన్న గ్రామీణ భారతీయుల్లో 7 శాతం మంది(దాదాపు 6 కోట్లు) ఇంటర్నెట్ను చురుకుగా వినియోగిస్తున్నారు. - 2012లో మొబైల్ ద్వారా ఇంటర్నెట్ను వినియోగించే గ్రామీణుల సంఖ్య 0.4 శాతమే. రెండేళ్లలో ఈ సంఖ్య 4.4 శాతానికి పెరిగింది. -
భారత్‌లో పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగదారులు
న్యూఢిల్లీ: భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. వచ్చే 8 నెలల్లో ఈ సంఖ్య 19% వృద్ధితో 24.3 కోట్లకు చేరుతుందని ఐ-క్యూబ్ 2013 నివేదిక తెలిపింది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ), ఐఎంఆర్బీలు ఈ నివేదికను విడుదల చేశాయి. మొబైల్ ద్వారా ఇంటర్నెట్ వాడకం పెరిగిపోతుండడమే దీనికి కారణమని నివేదిక తెలిపింది 2014, జూన్ నాటికి ఇంటర్నెట్ వినియోగదారులున్న రెండో పెద్ద దేశంగా అమెరికాను తోసిరాజని భారత్ అవతరించవచ్చని ప్రస్తుతానికికి 30 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులతో చైనా మొదటి స్థానంలోనూ, 20.7 కోట్లమంది ఇంటర్నెట్ వినియోగదారులతో అమెరికా రెండో స్థానంలోనూ ఉన్నాయి.