![Internet users in India to cross 500million mark by June 2018 - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/21/internt.jpg.webp?itok=JP4o12Sy)
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2018 జూన్ నాటికి 50కోట్ల (500 మిలియన్లు) మార్క్‌నుఅధిగమిస్తుందని ఓ సర్వే తెలిపింది. 170 నగరాల్లో, 750 గ్రామాలలో నిర్వహించిన ఉమ్మడి సర్వే తర్వాత ఈ నివేదిక విడుదల చేసింది. ముఖ్యంగా ఈ 170 నగరాల్లో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాలు అగ్రస్థానంలో ఉండగా, ఫతేపూర్, జగదల్పూర్, ఇంఫాల్ ఆఖరిస్థానంలో ఉన్నాయి. మొత్తం తొమ్మిది నగరాల్లో 35 శాతం మంది పట్టణ ఇంటర్నెట్ వినియోగదారులు నమోదయ్యారు. అయితే చిన్న మెట్రోలు, నాన్ మెట్రో నగరాల్లో జాతీయ సగటు కన్నా ఇంటర్నెట్ వ్యాప్తి స్థాయి తక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
'ఇంటర్నెట్ ఇన్ ఇండియా 2017' అంనే అంశంపై ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ), కంతర్ ఐఎంఆర్‌బీ ఈ రిపోర్టును విడుదల చేసింది. 2017 డిసెంబరు నాటికి మొత‍్తం జనాభాలో 35శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులుగా ఉన్నారని నివేదించింది.
నివేదిక ప్రకారం, 2016 డిసెంబర్ -2017 డిసెంబర్ నాటికి అర్బన్ ఇండియాలో 9.66 శాతం వృద్ధిని సాధించి 295 మిలియన్లమంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారని అంచనా వేసింది. మరోవైపు, 2016 డిసెంబర్ నుంచి 2017 డిసెంబర్ నాటికి గ్రామీణ ప్రాంతాల్లో డబుల్ డిజిట్ వృద్ధిని సాధించింది. 14.11శాతం వృద్ధితో 186 మిలియన్ల మంది ఇంటర్నెట్ రోజువారీ వినియోగించుకున్నా రని నివేదిక పేర్కొంది. 2017 జూన్ , ఆగస్టు నెలల మధ్య 170 నగరాల్లో 60వేల మందిని, గ్రామీణ ప్రాంతంలో 750 గ్రామాల్లో 15వేల మందిపై ఈ సర్వే నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment