న్యూఢిల్లీ: భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. వచ్చే 8 నెలల్లో ఈ సంఖ్య 19% వృద్ధితో 24.3 కోట్లకు చేరుతుందని ఐ-క్యూబ్ 2013 నివేదిక తెలిపింది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ), ఐఎంఆర్‌బీలు ఈ నివేదికను విడుదల చేశాయి. మొబైల్ ద్వారా ఇంటర్నెట్ వాడకం పెరిగిపోతుండడమే దీనికి కారణమని నివేదిక తెలిపింది 2014, జూన్ నాటికి ఇంటర్నెట్ వినియోగదారులున్న రెండో పెద్ద దేశంగా అమెరికాను తోసిరాజని భారత్ అవతరించవచ్చని ప్రస్తుతానికికి 30 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులతో చైనా మొదటి స్థానంలోనూ, 20.7 కోట్లమంది ఇంటర్నెట్ వినియోగదారులతో అమెరికా రెండో స్థానంలోనూ ఉన్నాయి.