షాకింగ్లోనూ శాంసంగ్ సంచలనం | Samsung's operating profit rises despite Note 7 recall | Sakshi
Sakshi News home page

షాకింగ్లోనూ శాంసంగ్ సంచలనం

Published Fri, Oct 7 2016 10:47 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

షాకింగ్లోనూ శాంసంగ్ సంచలనం

షాకింగ్లోనూ శాంసంగ్ సంచలనం

సియోల్ : మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ఫోన్గా లాంచ్ అయిన గెలాక్సీ నోట్7 విఫలం కావడంతో తీవ్ర నిరాశలో ఉన్న శాంసంగ్, లాభాల్లో మాత్రం వెనుకంజ వేయలేదు. ఓ వైపు గెలాక్సీ నోట్7 రీకాల్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మూడో త్రైమాసికంలో నిర్వహణ లాభాల్లో దూసుకెళ్లింది. జూలై-సెప్టెంబర్ కాలంలో 7.8 ట్రిలియన్ వాన్(రూ.46,812కోట్లకు పైగా) నిర్వహణ లాభాలను ఆర్జించినట్టు ఈ దక్షిణ కొరియా దిగ్గజం శుక్రవారం ప్రకటించింది. గతేడాది ఇదే కాలానికి కంటే ఈ లాభాలు 5.55 శాతం ఎక్కువని జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది. కానీ ముందటి త్రైమాసికం కంటే ఈ లాభాలు 4.18 శాతం మేర తగ్గాయని తెలిపింది.
 
అయితే శాంసంగ్ కేవలం 7.4 ట్రిలియన్ వాన్ను మాత్రమే ఆర్జించగలదని మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు. వారి అంచనాలను అధిగమించి శాంసంగ్ ఈ లాభాలను ఆర్జించింది. సెమీ కండక్టర్స్, డిస్ప్లే ప్యానెల్స్ విక్రయాలు కంపెనీ లాభాలకు ఎక్కువగా దోహదంచేశాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్లను రీకాల్ చేసినప్పటికీ కంపెనీ అంచనావేసిన దానికంటే ఎక్కువగా లాభాలనార్జించడం విశేషమని విశ్లేషకులు అంటున్నారు.
 
బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో కంపెనీ గెలాక్సీ నోట్7ను సెప్టెంబర్ మొదటి నుంచి రీకాల్ చేయడం ప్రారంభించింది. ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థలు సైతం విమాన ప్రయాణాల్లో ఈ ఫోన్ వాడకంపై నిషేధం విధించాయి. యూఎస్ వినియోగదారుని ఉత్పత్తి భద్రతా కమీషన్ ప్రకారం మొత్తం బ్యాటరీ పేలుళ్ల ఘటనలు 92 నమోదయ్యాయి. నోట్7 రీకాల్తో కంపెనీకి 1 ట్రిలియన్ వాన్ నష్టం వచ్చినట్టు శాంసంగ్ తెలిపింది. పూర్తి ఆదాయ ఫలితాలను ఈ నెల ఆఖరున కంపెనీ రిపోర్టు చేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement