ayush commissioner
-
ఇప్పటికీ దరఖాస్తు చేసుకోలేదు.. ఆనందయ్యకు నోటీసులు ఇచ్చాం: ఆయుష్ శాఖ
సాక్షి, విజయవాడ: అనుమతులు లేకుండా ఒమిక్రాన్‌కు మందు ఉందంటూ ప్రచారం చేసుకుంటున్న సంస్థలపై ఆయుష్ శాఖ చర్యలు తీసుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లాలో అనుమతులు లేకుండా ఒమిక్రాన్ పేరుతో ఆయుర్వేద మందులు అమ్ముతున్న ఓ సంస్థను ఆయుష్ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయుష్ కమిషనర్ రాములు మాట్లాడుతూ.. ఒమిక్రాన్ పేరుతో అనుమతులు లేని ఆయుర్వేద మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒమిక్రాన్‌కు మందు ఇస్తానంటూ ప్రచారం చేసుకుంటున్న ఆనందయ్యకు కూడా నోటీసులు ఇచ్చామని తెలిపారు. చదవండి: హైదరాబాద్, వైజాగ్‌లలో భారీగా అప్రెంటిస్ ట్రెయినీలు ఆనందయ్య తన మందుపై ఇప్పటికీ ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకోలేదని వెల్లడించారు. ఆనందయ్య మందుపై కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనే ప్రభుత్వం పది రోజుల వ్యవధిలో వేగంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేంద్ర ఆయుష్ శాఖ కోవిడ్ నివారణకు సూచించిన అన్ని ఆయుర్వేదం, హోమియో మందులు అన్ని డిస్పెన్సరీలలో అందుబాటులో ఉంచామని చెప్పారు. వీటి కోసం ఏపీ ప్రభుత్వం 13 కోట్ల రూపాయిలు ఖర్చు చేసిందన్నారు. ఒమిక్రాన్‌కు మందు ఉందంటూ ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న ప్రచారాలని నమ్మి మోసపోవద్దని ఆయుష్ కమిషనర్ సూచించారు. ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీలలో కేంద్ర అయుష్ శాఖ సూచించిన మందులనే వినియోగించాలని తెలిపారు. చదవండి: మహిళా పోలీసులకు ప్రత్యేక నిబంధనలను విడుదల చేసిన ప్రభుత్వం -
ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందును అనుమతించలేదు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందును ఇంత వరకు ప్రభుత్వం అనుమతించలేదని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు గురువారం స్పష్టం చేశారు. ఒమిక్రాన్ సోకకుండా, సోకిన వారికి తగ్గేలా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తామని కొందరు ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒమిక్రాన్‌ను నివారించే ఆయుర్వేద మందు ఉచిత సరఫరా, అమ్మకానికి అనుమతి కోరుతూ ఆయుష్ శాఖను ఇంత వరకూ ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కరోనా నిరోధక ఆయుర్వేద మందు ఆయుష్–64, ఆర్సెనిక్ ఆల్బమ్–30 వంటి హోమియో మందులను వైద్యుల సలహా మేరకు మాత్రమే ప్రజలు తీసుకోవచ్చని వివరించారు. -
శాస్త్రీయ పరీక్షల్లోనూ ఎలాంటి దుష్పలితాలు కనిపించలేదు: రాములు
-
‘నాటు మందుపై అన్నింటిని పరిగణలోకి తీసుకున్నాకే నిర్ణయం’
సాక్షి, తాడేపల్లి: ఆనందయ్య కరోనా మందు పంపిణీ విషయంలో దాఖలైన పిటిషన్ సోమవారానికి వాయిదా పడినట్లు ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఈ లోగా ఆ మందులో చివరి రిపోర్టు రేపు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్ లైసెన్స్ విషయంలో కమిటీ కూడా అధ్యయనం చేసిందని, కేంద్ర బృందాల నివేదిక కూడా రేపు వచ్చే అవకాశం ఉన్నందున, అన్నింటిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ అంశంకు సంబంధించి చట్టం, ప్రజల మనోభావాలు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించినట్లు రాములు తెలిపారు. వారం తర్వాత కృష్ణపట్నంలోని నివాసానికి వారం తర్వాత కృష్ణపట్నంలోని తన నివాసానికి ఆనందయ్య చేరుకున్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో కృష్ణపట్నంలో పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. గత వారంగా కృష్ణపట్నంలోని సీవీఆర్ ఫౌండేషన్‌లో ఉన్న ఆనందయ్య ఉన్నారు. ఆనందయ్యకు మరింత పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆలోచనతో మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: నకిలీ ‘ఆనందయ్య’ మందు స్వాధీనం: నిందితుడి అరెస్ట్ -
ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదు: ఆయుష్
సాక్షి, అమరావతి: కరోనా కట్టడి కోసం ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై ఆయుష్ పరిశోన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయుష్ కమిషనర్ రాములు ఆనందయ్య మందుపై నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. ‘‘ఆనందయ్య మందు ద్వారా ఎలాంటి ప్రమాదం లేదు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రజలకు పంపిణీ చేయవచ్చు. మూడు, నాలుగు రోజుల తర్వాత నివేదక వస్తుంది. సీసీఆర్ఏఎస్ నివేదక వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది’’ అని తెలిపారు. ‘‘ఆనందయ్య ఇప్పటికే 70-80 వేల మందికి మందు పంపిణీ చేశామని చెబుతున్నారు. వేల సంఖ్యలో మందు తీసుకుంటే ఒకరిద్దరికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదు’’ అని రాములు తెలిపారు. చదవండి: ఆనందయ్య కరోనా మందు: ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ -
ఆనందయ్య ఔషధం పై వివరాలు సీఎంకు అందించాం
-
‘ఆనందయ్య మందును నాటు మందుగా పరిగణిస్తాం’
సాక్షి, నెల్లూరు: ఆనందయ్య చేస్తున్న కరోనా మందు తయారీలో ఆయుర్వేద ప్రోటోకాల్స్ లేవని అధ్యయనం చేస్తున్న ఆయుష్ కమిషనర్ రాములు బృందం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందును ఆయుర్వేద మందుగా కాకుండా నాటు మందుగా పరిగణిస్తామని రాములు తెలిపారు. మందు తయారీని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఆనందయ్య కరోనా మందు తయారీ విధానాన్ని నిశితంగా పరిశీలించాం. మందు తయారీలో ఆయుర్వేద మందు ప్రోటోకాల్స్ లేవని పేర్కొన్నారు. అలాగే ఆనందయ్య తయారు చేసిన మందు హానికరం కాదని కూడా తెలిపారు. ఈ మందు కోసం వాడే పదార్ధాలన్నీ వంటింటి ఔషధాలు, ప్రకృతి వనమూలికలేని, కోవిడ్ బాధితులకు ఉపశమనం కలిగిస్తోందని అన్నారు. కాకపోతే ఈ మందును అనేక ఆరోగ్య సమస్యల కోసం తయారు చేశానని ఆనందయ్య చెప్పారు. కరోనా కోసం తయారు చేశానని చెప్పలేదని' వెల్లడించారు. త్వరలోనే ఆనందయ్య మందుపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని రాములు తెలిపారు. చదవండి: వ్యాక్సినేషన్‌పై ప్రధానికి మరోసారి సీఎం జగన్ లేఖ -
ఆనందయ్య మందు శాస్త్రీయతపై కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. రాములు బృందం ఎదుట ఆయుర్వేద మందు తయారీని ఆనందయ్య చేసి చూపించారు. ఈ మందుపై వివిధ కోణాల్లో ఆయుష్ కమిషనర్ రాములు బృందం అధ్యయనం చేస్తునున్నారు. అయితే మీడియాకు దూరంగా అజ్ఞాత ప్రదేశంలో ఇదంతా జరిగింది. మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారం పైనే పడుతుందని రాములు వెల్లడించారు. 24న కృష్ణపట్నంకు వెళ్లనున్న ఐసీఎంఆర్ బృందం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) బృందం ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి వెళ్లనుంది. కరోనాకు ఇక్కడి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందును పరీక్షించనుంది. అధ్యయన సంస్థల నివేదిక తర్వాత మందు పంపీణిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాగా కృష్ణపట్నంలో వెంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ బృందం పర్యటన పూర్తయ్యింది. చదవండి: కరోనా మందు: మళ్లీ క్షీణించిన కోటయ్య ఆరోగ్యం -
ఆనందయ్య కరోనా మందు: ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్
సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. ఆనందయ్య.. రాములు ఎదుట ఆయుర్వేద మందు తయారీని చూపించనున్నారు. ఈ సందర్భంగా రాములు మీడియాతో మాట్లాడుతూ, నిన్న(శుక్రవారం) ముత్తుకూరులో కొంతమందితో, ఆనందయ్య వద్ద పనిచేసేవారితో మాట్లాడామని తెలిపారు. ఆనందయ్య మందును ఎలా తయారు చేస్తారో పరిశీలిస్తామని రాములు పేర్కొన్నారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని.. మందు తయారీ పదార్థాలపై ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్టే వచ్చిందని రాములు వెల్లడించారు. ఆనందయ్య మందును తీసుకున్నవారి అభిప్రాయాలనూ సేకరిస్తామన్నారు. ఐసీఎంఆర్ బృందం పరిశీలిన తర్వాత వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటామని ఆయన తెలిపారు. మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారం పైనే పడుతుందని రాములు వెల్లడించారు. కృష్ణపట్నానికి టీటీడీ బృందం.. తిరుమల: ఈవో ఆదేశంతో టీటీడీ బృందం కృష్ణపట్నానికి వెళ్లింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ ఆయుర్వేద డాక్టర్‌తో కూడిన బృందం కృష్ణపట్నం చేరుకున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న టీటీడీ ఉద్యోగులకు ఆయుర్వేద మందు ఇవ్వాలనే ఆలోచనలో టీటీడీ ఉంది. అప్పటివరకు కృష్ణపట్నం రావొద్దు: జేసీ ఆనందయ్య ఆయుర్వేద మందుపై సీఎంఆర్, ఆయూష్ బృందాలు అధ్యయనం చేస్తున్నాయని జేసీ హరేంద్రప్రసాద్ తెలిపారు. నివేదిక వచ్చేందుకు వారం, 10 రోజులు పట్టొచ్చని.. ఫైనల్‌గా ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాతే మందు పంపిణీ చేపడతామని ఆయన వివరించారు. అప్పటి వరకు ప్రజలెవరూ కృష్ణపట్నం రావొద్దని జేసీ స్పష్టం చేశారు. చదవండి: ఆనందయ్య కరోనా మందుకు వారం పాటు బ్రేక్ కరోనాకు ఆనందయ్య మందు! -
అనుమతిచ్చాకే ఆయుర్వేద మందు పంపిణీ: సింఘాల్
సాక్షి, నెల్లూరు (కృష్ణపట్నం): కరోనా మహమ్మారికి విరుగుడుగా భావిస్తున్న ఆనందయ్య ఆయుర్వేద మందు వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆయుష్ చేపట్టిన ప్రాధమిక విచారణలో తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అయితే ఈ మందు తయారీ విధానంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అనుమతిచ్చాకే ఈ మందు పంపిణీ జరుగుతుందని, అంతవరకు ఎవ్వరూ దీన్ని వాడకూడదని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ మందుపై అధ్యయనానికి ఐసీఎంఆర్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందాన్ని పంపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇస్తాం కృష్టపట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆయుష్ కమిషనర్ రాములు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనందయ్య మందుతో సైడ్ఎఫెక్ట్స్ లేవని ప్రాథమిక నిర్థారణలో తేలిందని అన్నారు. ఆయుర్వేద మందు తయారీ విధానంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇస్తామని అన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చాకే ఆయుర్వేద మందు పంపిణీ జరుగుతుందని రాములు స్పష్టం చేశారు. కాగా, కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం జరిపేందుకు కేంద్ర సంస్థలు రంగంలోకి దిగనున్నాయి. ఈ మేరకు సెంట్రల్ ఆయుష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డీజీతో సంప్రదింపులు జరిపినట్టు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్ తెలిపారు. -
ఆయుర్వేద వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సంస్థాన్ నారాయణపురం: ఎలాంటి ఇతర ఇబ్బందులు కలిగించని హోమియో, ఆయుర్వేద వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సర్వేల్ ఆయుర్వేద ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆయుష్ కమిషనర్ రాజేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుర్వేదం వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారని పేర్కొన్నారు. ఆయుష్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయుర్వేదం, హోమియోపతి, ప్రాచీన వైద్యానికి మంచి రోజులు వచ్చాయన్నారు. అల్లోపతి వైద్యం వల్ల ఇతర సమస్యలు ఉంటాయి కానీ, ఆయుర్వేదం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తవన్నారు. పంచకర్మ వైద్యశాలగా సర్వేల్ ఆయుర్వేద ఆస్పత్రిని తీర్చిదిద్దాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆర్డీడీ వసంతరావు, జెడ్పీటీసీ బొల్ల శివశంకర్, ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, ఎంపీడీఓ కాంతమ్మ, భగవతి, సర్పంచ్‌లు మానపాటి సతీష్‌కుమార్, సుగుణమ్మ, ఎంపీటీసీ సభ్యులు షేక్ షబ్బీర్, కత్తుల లక్ష్మయ్య, మండల ఆయుర్వేద వైద్యాధికారి ఉర్మిల, వైద్యులు రమేష్, సురేష్, నీరజన్, జయశ్రీ, కవిత తదితరులున్నారు.