ఆయుర్వేద వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
Published Sun, Jul 24 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
సంస్థాన్ నారాయణపురం:
ఎలాంటి ఇతర ఇబ్బందులు కలిగించని హోమియో, ఆయుర్వేద వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సర్వేల్ ఆయుర్వేద ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆయుష్ కమిషనర్ రాజేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుర్వేదం వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారని పేర్కొన్నారు. ఆయుష్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయుర్వేదం, హోమియోపతి, ప్రాచీన వైద్యానికి మంచి రోజులు వచ్చాయన్నారు. అల్లోపతి వైద్యం వల్ల ఇతర సమస్యలు ఉంటాయి కానీ, ఆయుర్వేదం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తవన్నారు. పంచకర్మ వైద్యశాలగా సర్వేల్ ఆయుర్వేద ఆస్పత్రిని తీర్చిదిద్దాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీడీ వసంతరావు, జెడ్పీటీసీ బొల్ల శివశంకర్, ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, ఎంపీడీఓ కాంతమ్మ, భగవతి, సర్పంచ్‌లు మానపాటి సతీష్‌కుమార్, సుగుణమ్మ, ఎంపీటీసీ సభ్యులు షేక్ షబ్బీర్, కత్తుల లక్ష్మయ్య, మండల ఆయుర్వేద వైద్యాధికారి ఉర్మిల, వైద్యులు రమేష్, సురేష్, నీరజన్, జయశ్రీ, కవిత తదితరులున్నారు.
Advertisement