Ayurvedic
-
బరువు తగ్గడంలో 'పంచకర్మ' ది బెస్ట్..!
బుల్లితెర నటుడు రోహిత్ రాయ్ అన్‌స్టాపబుల్ పోడ్కాస్ట్లో రోహిత్ బోస్ రాయ్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తనకు మంచి పిట్నెస్ మెయింటెయిన్ చేయడంలో పంచకర్మ ఎలా ఉపయోగపడిందో వెల్లడించారు. పంచకర్మ బరువు తగ్గడంలోనే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎలా సహాయపడుతుందో వివరించాడు. ఆయుర్వేదం పద్ధతులన్నీ ఆర్యోప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి. ఆయుర్వేద పంచకర్మ అనేది ప్రాచీన భారతదేశం నుంచి వచ్చిన సాంప్రదాయ నిర్విషీకరణ, పునరుజ్జీవన చికిత్స. ఇది బరువుని తగ్గించడంలో ఎలా సహాయపడుతుందంటే..రోహిత్ బోస్ రాయ్ 2021లోనే తనకు ఆయుర్వేదం గురించి తెలిసిందన్నారు. తాను కేరళకి వెళ్లినప్పుడే ఆయుర్వేదానికి సంబంధించిన పంచకర్మ గురించి తెలుసుకున్నట్లు వివరించారు. ఆయన జీర్ణ సమస్యలతో కేరళకి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ శరీరాన్ని శుభ్రపరచడంతో ఈ పంచకర్మ చికిత్స ప్రారంభమవుతుందని అన్నారు. కేవలం 14 రోజుల్లోనే ఆరు కిలోల బరువుని తేలిగ్గా తగ్గానని అన్నారు. పూర్తిగా నీటి బరువు లేకుండా పునరుజ్జీవనం పొందానన్నారు. అక్కడ తనకు అలారం లేకుండా ఉదయం ఆరుగంటల కల్లా మేల్కోవడం అలవాటయ్యిందని చెప్పారు. ప్రస్తుతం ఈ పంచకర్మ తనకు వార్షిక కర్మగా మారిందని పేర్కొన్నారు. ఏడాదికి రెండుసార్లు లేదా షెడ్యూల్‌ని అనుసరించి పదిరోజుల పాటు చేస్తానని అన్నారు. ఇక్కడ పంచకర్మ అనేది ఐదు చికిత్సలని అర్థం. ముందుగా వామన(వాంతులు), విరేచన(ప్రక్షాళన), బస్తీ(ఎనిమా), నాస్య(నాసికా క్తీనింగ్), రక్తమోక్షణ(రక్తాన్ని శుద్ధిచేయడం). ఇక్కడ ప్రతి ప్రక్రియ నిర్విషీకరణ అంశాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది శరీర వాత, పిత్త,కఫా దోషాలను నివారించి సమతుల్యతను ప్రోత్సహిస్తుంది.బరువు ఎలా తగ్గుతారంటే..శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను తొలగించి జీవక్రియ ప్రక్రియలను మెరుగ్గా ఉంచుతుంది. ఇది బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంఇందులో వాంతులు, విరేచనాలతో శరీరాన్ని శుభ్రపరచడం మొదలుపెడతామో అప్పుడు జీర్ణక్రియ మెరుగ్గా ఉండి పోషకాల శోషణ సామర్థ్యం పెరుగుతుంది. అంతేగాదు అతిగా తినడాన్ని నివారిస్తుంది. జీవక్రియను సమతుల్యం చేస్తుందిపంచకర్మ శరీర దోషాలను సమన్వయం చేసి జీవక్రియ చర్యలను మెరుగ్గా ఉంచుతుంది.. ఉదాహరణకు, కఫా దోషంలో అసమతుల్యత తరచుగా నిదానమైన జీవక్రియ, బరువు పెరిగేందుకు కారణమవుతుంది. దీనిలోని బస్తీ, నాసికా చికిత్సలు కఫ దోషాలను నివారిస్తాయి. పోషకాల శోషణను మెరుగవుతుంది..జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేసి, శరీరం ఆహారం నుంచి పోషకాలను సులభంగా గ్రహించేలా చేస్తుంది. ఇది బరువు తగ్గడానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మెరుగైన పోషక శోషణ శక్తి స్థాయిలను నిర్వహించడంలో ఉపయోగపడుతుంది. ఇది అలసటను తగ్గించడంలోనూ, ఆరోగ్యకరమైన ఆకలిని ప్రోత్సహించడంలోనూ సహాయపడుతుంది.జీవనశైలి మార్పులుచికిత్సతో పాటు జీవనశైలి, ఆహారంలో మార్పులు తప్పనిసరి. పంచకర్మ సమయంలో, ప్రజలు తరచుగా నిర్విషీకరణకు మద్దతిచ్చే ఆహారాన్ని అనుసరించమని సలహా ఇస్తారు. అంటే.. జీర్ణమయ్యే ఆహారాలు, సూప్‌లు, ఉడకబెట్టిన పులుసులు, ఆవిరితో ఉడికించిన కూరగాయలు వంటివి తీసుకోవాలి. ఈ ఆహార మార్పులు తక్కువ కేలరీలు తీసుకునేలా చేసి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది. ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది. సున్నితమైన వ్యాయామాలు, యోగా అభ్యాసాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి, జీవక్రియ రేటును పెంచుతాయి. రెగ్యులర్ శారీరక శ్రమ కూడా పంచకర్మలానే బరువు తగ్గడంలో సహాయపడుతుంది అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఫ్యాటీ లివర్ ఉంటే గుండెపోటు వస్తుందా?) -
బరువు పెరగాలనుకునే వారికి ఈ పూరీలు మేలు!
కొంతమంది ఆహార్యం చాలా బక్కపలచగా ఉంటుంది. ఎంత తిన్న వంటబట్టదు. చూడటానికి బలహీనంగా, అందవిహీనంగా ఉంటారు. కాస్త ఫిజిక్ ఉంటే చూడటానికి అందంగా అనిపిస్తారు. అదికూడ లేకపోతే.. పేషెంట్ మాదిరిగా ఉన్నాడ్రా బాబు అనేస్తారు. గాలి వీస్తే ఎగిరిపోయేలా ఉన్నా ఇబ్బందే!. అలాంటి వారు బరువు పెరగాలనకుంటే ఏం చేయాలంటే.. బరువు పెరగాలన్న ఆత్రుతలో ఎలా పడితే అలా తినేయ్యకూడదు. ముందు మన శరీరానికి ఏం పడతాయి, ఏవైతే బెటర్ అనేది నిర్థారించుకోవాలి. ఆ తర్వాత వాటిని క్రమబద్ధంగా ఓ నియమానుసారంగా తీసుకుంటేనే చక్కటి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా మంచి న్యూట్రిషియన్లు లేదా వైద్యులను సంప్రదించి మంచి డైట్ పాలో అవ్వాలి. ఇలా లావు అవ్వలేకపోతున్నాం అని బాధపడే వాళ్లు ఈ పూరీలు గనుకు తింటే కచ్చితంగా లావువుతారని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఏంటా పూరీలు..? ఎలా తయారు చేస్తారంటే..? నెయ్యితో చేసే పూరీలు.. నెయ్యితో చేసిన పూరీలు తింటే బరువు పెరగడమే గాక కండరాలు, ఎముకలు బలంగా మారతాయి. ఎలా చెయ్యాలంటే.. నెయ్యి పూరీలు తయారీకి కావాల్సిన పదార్థాలు.. గోధుమపిండి: ఒక కప్పు పాలు: 1/2 కప్పు పటికబెల్లం పొడి: సరిపడ నెయ్యి తయారీ విధానం: ముందుగా పాలలో సరైన మొత్తంలో పటికబెల్లం పొడి వేయండి. ఈ పాలతో కప్పు గోధుమ పిండిని కలిపి పూరీ పిండిలా చేయండి. దీనిని చిన్న చిన్న ఉండల్లా చేసి పూరీలు చేయండి.ఈ పూరీలను నెయ్యిలో వేసి వేయించండి. వాటిలో గనుకు ఎక్స్ట్రా నెయ్యి ఉంటే టిష్యూలు వాడండి. ఈ పూరీలను కొబ్బరిచట్నీతో తింటే ఆ టేస్టే వేరబ్బా. రుచికి రుచిగా ఉండటమే గాక ఈజీగా బరువు పెరుగుతారు. ఎలాంటి వారు తినకూడదంటే.. ఈ ఫుడ్ హెవీగా ఉంటుంది. కఫం పెరుగుతుంది. కాబట్టి, షుగర్, పీసీఓఎస్, హైపోథైరాయిడిజం, అధిక బరువు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ ఫుడ్‌ని తినొద్దు. గమనిక: ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం అవగాహన కోసమే. దీన్ని ఫాలో అయ్యే ముందు వ్యక్తిగత వైద్యుల సలహాలు, సూచనల మేరకు ప్రయత్నించడం మంచిది. View this post on Instagram A post shared by Dr. Rekha Radhamony, 4th Gen Ayurveda Doctor (BAMS) (@doctorrekha) (చదవండి: కొండెక్కిన వెల్లుల్లి ధరలు చూసి భయపడొద్దు..ఈ చిట్కాలు ఫాలోకండి!) -
ఆయుర్వేదిక్ సిరప్ తాగి ఐదుగురు మృతి
నడియాడ్: ఆయుర్వేదిక్ సిరప్ తాగి అయిదుగురు మరణించగా మరో ఇద్దరు ఆస్పత్రి పాలైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిథైల్ ఆల్కహాల్‌తో ఆ సిరప్ కలుషితమైనట్లు చెప్పారు. ఈ ఘటన గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాడ్ పట్టణంలో జరిగింది. ఖేడా జిల్లాలోని నడియాడ్ పట్టణంలోని ఓ షాప్ నుంచి ఆయుర్వేదిక్ సిరప్ బాటిళ్లను 50 మంది దాకా కొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆయుర్వేదిక్ సిరప్‌ను కల్‌మేఘాసవాసవ అరిష్ట అనే బ్రాండ్ పేరుతో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ‘సిరప్‌లో విషపూరిత మిథైల్ ఆల్కహాల్ కలిపినట్లు అది తాగిన వారి రక్త పరీక్షలో బయటపడింది. షాపులో అమ్మే ముందు సిరప్‌లో మిథైల్ ఆల్కహాల్ కలిపినట్లు తేలింది. గడిచిన రెండు రోజుల్లో సిరప్ తాగినవారిలో అయిదుగురు చనిపోయారు. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. సిరప్ అమ్మిన షాపు యజమానితో పాటు ముగ్గురిని అరెస్టు చేశాం’ ఖేడా ఎస్పీ రాజేష్ గదియా చెప్పారు. ఇదీచదవండి..‘చైనాను చూసి నేర్చుకోండి’.. మరోసారి ఇన్ఫోసిస్ మూర్తి షాకింగ్ కామెంట్స్ -
ధూమపానంతో క్యాన్సర్ గాక ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా!
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలుసు. కానీ ధూమపానంతో క్యాన్సర్ తో పాటూ ఎన్నో ఆరోగ్య సమస్యలు లింక్ అయ్యి ఉన్నాయో తెలుసా. ఒకరకరంగా చెప్పాలంటే సిగరెట్ కాల్చడం లేదు మన ఆరోగ్యానన్ని మనమే చేజేతులారా తగలెట్టుసుకుంటున్నాం అన్నాలి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. దీని వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలేంటో ఆయన మాటల్లో చూద్దామా! ఊపిరితిత్తుల వ్యాధులు ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (COPD), బ్రోన్కైటిస్ తోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు ప్రధాన కారణం. 1. ఊపిరితిత్తుల క్యాన్సర్: ఇది ఊపిరితిత్తుల కణజాలంలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 2. క్షయ: ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది, కానీ ఇది శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేయవచ్చు. ధూమపానం చేసేవారిలో క్షయ వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 3.-COPD అనేది ఊపిరితిత్తుల యొక్క పరిమిత గాలి ప్రవాహం వల్ల వచ్చే ఒక సమూహం. ఇందులో బ్రోన్కైటిస్ మరియు ఎంఫిసెమా ఉన్నాయి. ధూమపానం COPDకి ప్రధాన కారణం. ధూమపానం చేసేవారిలో COPD వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 3. బ్రోన్కైటిస్: బ్రోన్కైటిస్ అనేది ఊపిరితిత్తుల శ్వాస గొట్టాల వాపు. ఇది తీవ్రమైన లేదా దీర్ఘకాలికంగా ఉండవచ్చు. తీవ్రమైన బ్రోన్కైటిస్ సాధారణంగా వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ COPD యొక్క ఒక రకం. ధూమపానం తీవ్రమైన మరియు దీర్ఘకాలిక బ్రోన్కైటిస్‌కు ప్రధాన కారణం. గుండె జబ్బులు ధూమపానం గుండెపోటు, స్ట్రోక్ తోపాటు ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. 1.-గుండెపోటు: ఇది గుండెకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే అత్యవసర పరిస్థితి. ధూమపానం గుండెపోటు ప్రమాదాన్ని 3 రెట్లు పెంచుతుంది. 2. స్ట్రోక్ ఇది మెదడుకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే అత్యవసర పరిస్థితి. ధూమపానం స్ట్రోక్ ప్రమాదాన్ని 2 రెట్లు పెంచుతుంది. 3. ధూమపానం కొరోనరీ ఆర్టరీ వ్యాధి గుండె వైఫల్యం, గుండె సంబంధిత క్యాన్సర్ వంటి ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇతర క్యాన్సర్లు ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు మూత్రపిండ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మరియు ప్యాంక్రియాస్ క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. 1. మూత్రపిండాల క్యాన్సర్ ఇది మూత్రపిండాలలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం మూత్రపిండ క్యాన్సర్ ప్రమాదాన్ని 2-3 రెట్లు పెంచుతుంది. 2. నోటి క్యాన్సర్ నోటిలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని 2-3 రెట్లు పెంచుతుంది. 3. గొంతు క్యాన్సర్: గొంతు క్యాన్సర్ అనేది గొంతులో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని 2-3 రెట్లు పెంచుతుంది. 4. గ్యాస్ట్రిక్ క్యాన్సర్: గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది జీర్ణశయాంతరంలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని 1.5-2 రెట్లు పెంచుతుంది. 5. 5. 5. ప్యాంక్రియాస్ క్యాన్సర్: ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది ప్యాంక్రియాస్‌లో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం ప్యాంక్రియాస్ క్యాన్సర్ ప్రమాదాన్ని 1.5-2 రెట్లు పెంచుతుంది. ధూమపానం దంతాల ఆరోగ్యానికి హానికరం ధూమపానం దంతాల క్షయం, పళ్ళ మధ్య రంధ్రాలు, దంతాల పసుపు వంటి దంత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది నోటిలో ఆమ్లాల స్థాయిలను పెంచుతుంది అలాగే దంతాల క్షయానికి దారితీస్తుంది. దంతాల ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది, ఇది పళ్ళ మధ్య రంధ్రాలకు దారితీస్తుంది. దంతాలపై పసుపు మచ్చలను ఏర్పరుస్తుంది. నోటిలో రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది, ఇది నోటి పుండ్లకు దారితీస్తుంది. దంతాలను బలహీనపరుస్తుంది, ఇది దంతాల నష్టానికి దారితీస్తుంది. ఇలా క్యాన్సర్ మాత్రమె కాకుండా ధూమపానం ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీయగలదు.అందుకని వీలైనంత తొందరగా మానేయటం ఉత్తమం. -ఆయుర్వేద వైద్యులు, నవీన్ నడిమింటి (చదవండి: మీ ఆహారంలో ఇవి చేర్చితే మధుమేహం దరిదాపుల్లోకి రాదు!) -
నడుము నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి
శరీరంలో వాత మూలకం అసమతుల్యత కారణంగా స్లిప్డ్ డిస్క్ సమస్యలు రావొచ్చు. ఇది వెన్నునొప్పితో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. L4 L5 డిస్క్ సమస్యకు సర్జరీ అవసరం లేకుండా ఎలాంటి రిలీఫ్ పొందవచ్చు అన్నది ప్రముఖ ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లోనే.. నడుము నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ►అధిక బరువును తగ్గించుకోవాలి ► శారీరక శ్రమ తప్పనిసరి. ఇందుకోసం క్రమశిక్షణతో వర్కవుట్స్ చేయాలి. ► సమయపాలన, ఆహార పాలన, ఒకే సమయానికి నిద్రపోయేలా చూసుకోవాలి. ► 30ఏళ్లు పైబడిన తర్వాత ప్రతి ఏడాది తప్పనిసరిగా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ► ఎముకల దృఢత్వం, బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయా లేదా అన్నది పరీక్షలు చేయించుకోవాలి ► 40 ఏళ్లు దాటాక ప్రతి ఆర్నెళ్లకోసారి అన్ని పరీక్షలు చేయించుకుంటూనే తగిన ఆహార అలవాట్లను అలవర్చుకోవాలి. వెన్నునొప్పి నుంచి ఇలా ఉపశమనం వెన్నునొప్పికి ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా ఆయుర్వేదంలో చికిత్స ఉంది. అదెలాగంటే.. కైర్టిస్ఆయిల్: కైర్టిస్ ఆయిల్ అనేది పంచకర్మ చికిత్సపై ఆధారపడిన ఒక వినూత్న పరిశోధన సూత్రం. ఇది ఆర్థరైటిస్, సయాటికా, స్పాండిలోసిస్, ఘనీభవించిన భుజం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి, స్లిప్ డిస్క్ మరియు న్యూరోమస్కులర్ నొప్పుల నుంచి దీర్ఘకాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. మురివెన్ననూనె: నొప్పి, వాపు, దృఢత్వం, ఆర్థరైటిక్ రుగ్మతలు, కీళ్లలో ఉన్న ఇతర తీవ్రమైన,దీర్ఘకాలిక వ్యాధుల పరిస్థితిలో మురివెన్న అద్భుతమైన ఫలితాలను కలిగి ఉంది. యోగరాజ్ గుగ్గుల్: యోగరాజ్ గుగ్గుల్ అనేది కీళ్ల రుగ్మతల చికిత్సలో ఉపయోగించే ఒక ఆయుర్వేద టాబ్లెట్. ఇది దీర్ఘకాలిక మరియు తీవ్రమైన నొప్పులు, కీళ్లలో వాపు, దృఢత్వం మరియు తిమ్మిరి నుంచిఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. -
వ్యాయామం, డైటింగ్లు చేసినా.. బరువు తగ్గకపోవడానికి కారణం..!
కొంతమంది మంచిగా వ్యాయామం, డైటింగ్ చేసిన ఒళ్లు తగ్గదు. పైగా వారికి కూడా ఎందుకిది దండగా అనే నిరాశ వచ్చేస్తుంది. కొందరూ భలే తగ్గుతారు. మరికొందరికి మాత్రం శరీరంలో కొంచెం కూడా మార్పు రానట్లు అనిపిస్తుంది. దీనికి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి కొన్ని సలహలు సూచనలు ఇచ్చారు. అవేంటంటే.. ఒళ్లు తగ్గకపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని హర్మోన్ల తేడా లేదా పీసీడీఓ సమస్య జన్యు పరమైన కారణాలు, అధికంగా ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయకపోవడం సరైన శారీరక శ్రమ లేక పోవడం నూనెలో బాగా వేగిన పదార్ధాలను తినడం, మెత్తని పదార్ధాలను తినడం, కార్బో హైడ్రేట్లు ( పిండి పదార్ధాలు) ఎక్కువగా తీసుకోవడం. ఆహార విహారాలతో బాటు మధ్యాహ్నం నిద్ర పోవడం శరీరంలోని వ్యాధులు, హైపో థైరాయిడ్, కొవ్వు బాగా పెరిగిపోవడం, రక్త నాళాల్లో కొవ్వు పేరుకు పోవడం, గుండె సమస్యలు తదితరాలు ఉన్నా. సరిగా నడవలేక పోవడం సంతాన లేమి మొదలైనవి. ఒళ్లడు తగ్గడం లేదని బాధపడేవాళ్లు.. ⇒ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కపాలభాతి ప్రాణాయామం చేయండి.ఇది బరువును తగ్గించడమే కాకుండా ముఖం మీద కాంతిని కూడా పెంచుతుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ⇒ మీరు తినే ఆహారంలో ఎక్కువ శాతం పచ్చి కాయగూరలు మరియు పండ్లు ఉండేలా చూసుకోండి. కనీసం 30% శాతం ఇవి ఉండాలి. ⇒ ఒక తమలపాకులో 5 నుంచి ఆరు మిరియాలు కలిపి చుట్టి రోజూ ఉదయం టిఫిన్‌కి ముందు తిని, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. ఇది ఒంట్లో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ⇒ కొద్దిగా కొత్తిమీర, 3 నుండి 4 చిన్న అల్లం ముక్కలు కలిపి నీళ్ళు వేసి మిక్సీకి వేసుకొని జ్యూస్ చేసుకోండి. అందులో 1 స్పూన్ తేనె మరియు సగం నిమ్మకాయ బద్దను పిండండి. ఇది రోజూ పరగడపున సేవించండి. సులువుగా బరువును తగ్గిస్తుంది. ⇒ రోజుకి కనీసం 25 నుండి 30 నిమిషాల వరకు చమట కక్కేలా గుంజీలు తీయడం, స్కిప్పింగ్ చేయడం, నడవడం లాంటివి చేయండి. ఇది అన్నిటికన్నా ఎంతో ముఖ్యం. ⇒ లావు తగ్గడానికి ఆయుర్వేదంలో చింత గింజలను ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి. పొద్దున బాగా పిసికి పొట్టు పోయిన తరువాత కొంచం నెయ్యి వేసి వేయించి, పొడి చేసి పెట్టుకోవాలి. అర స్పూను పొడిని పాలలో వేసి, చక్కర కలిపి తాగాలి. 40 రోజుల నుంచి100 రోజులు వాడాలి . ⇒ నేరుగా పట్టిన వాన నీటిని నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను పసుపు కలిపి తాగితే లావు తగ్గుతారు. స్థూలకాయులైతే.. ►తేనె 25 గ్రాములు గోరువెచ్చని నీళ్ళులో వేసుకుని ఒక గ్లాసు ఉదయం, సాయంత్రం పరగడుపున తాగాలి. ►వాయువిడంగాల పొడిని 2,3 గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం వేడి నీటితో తీసుకోవాలి. ►త్రిఫల చూర్ణము త్రికటు చూర్ణము రెండింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. పూటకు ఒకటిన్నర స్పూను చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ►ప్రతి రోజు అరస్పూను నుంచి ఒక స్పూను వరకు కరక్కాయ పొడిని రెండు పూటలా క్రమం తప్పకుండా తీసుకుంటే తగ్గిపోతుంది. పీసీఓడీ సమస్య ఉన్నవాళ్లు.. ప్రతి రోజు ఒక తిప్ప తీగ ఆకును తింటూ వుంటే లావు తగ్గడమే గాక శరీరంలోని భాగాలు, చర్మం లాంటివి వేలాడుతూ వుంటే ఒక సంవత్సరానికి గట్టి పడతాయి భోజనానికి అరగంట ముందు వేరుశనగ పప్పులకు చక్కెర కలిపి తింటే భోజనం తక్కువగా తింటారు. ఆహారానికి బదులుగా కేవలం ఆపిల్ పండ్లు మాత్రమే తింటే రోజులలో లావు తగ్గుతారు. (చదవండి: డయాబెటిస్ మందుల వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా! ఏకంగా చర్మం ఊడి..) -
ఆత్మహత్య ధోరణి జన్యుపరంగా సంక్రమిస్తుందా?
ఆత్మహత్య ధోరణి కొంతవరకు జన్యు పరంగా వస్తుందంటున్నారు ఆయుర్వే నిపుణులు నీవీన్ నడిమింటి. నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది పిల్లలు ఇదే మానసిక స్థితిలో ఉంటున్నారు. తమిళనటుడు సినీ హిరో విజయ్ ఆంటోనీ కుటుంబంలో అతడి చిన్నతనంలోనే తండ్రి ఆత్మహత్య చేసుకొన్నారు. ఇప్పుడు అతని 16 ఏళ్ళ కూతురు కూడా అలానే... దీన్ని బట్టి చూస్తే ఆత్మహత్య ధోరణి అనేది కొంతవరకు జన్యుపరంగా వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వచ్చాక పిల్లల్లో ఆ ధోరణి మరింత ఎక్కువైంది. చాలా మంది తల్లిందండ్రులు పిల్లల చేత ఫోన్లు ఎలా మానిపించాలని మొత్తుకుంటున్నారు. ముఖ్యంగా వారిని ఈ ఆత్మహత్యధోరణి దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉండేలా ఫోన్ అడిక్షన్ మానిపించాలంటే ఏం చేయాలో ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం!. చీకటి గదుల్లో పిల్లలను ఉంచొద్దు.. సెల్‌ఫోన్‌కు ( టీన్ ఏజ్ పిల్లల్లో ) అడిక్ట్ అయిపోతే డిప్రెషన్ ( మానసిక కుంగుబాటు ) అగ్రేషన్ ( కోపం చిరాకు హింసాత్మక ధోరణి ) వచ్చేస్తాయి. రెండేళ్ల పిల్లలు కూడా సెల్ ఫోన్ చేతికి ఇవ్వకపోతే అన్నం తినరు. అరిచి గోల చేస్తారు “ - నేడు తల్లితండ్రుల నోట తరచూ వినిపించే మాట కూడా ఇదే! పిల్లలు ఆరుబయట ఎంత ఆడుకుంటారో అంత పాజిటివ్ వ్యక్తిత్వం అలవడుతుంది... పిల్లలతో పేరెంట్స్ క్వాలిటి టైం మెయింటేన్ చేయాలి. ఇంకోటి చీకటి గదుల్లో ఎక్కువగా పిల్లలను ఉంచొద్దు పిల్లల ముందు ఎప్పుడు గాసిప్స్ మాట్లాడొద్దు. సెల్‌ఫోన్ లేకుండా పిల్లలు ఫుడ్ తినాలంటే.. పిల్లల పెరుగుదలలో అతి కీలకమైన వయసు ఏడాది నుంచి 5 ఏళ్లు. అంటే ప్రీ స్కూలు పిల్లల్లో పెరుగుదల అన్నది వారు తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. మా బాబు ఏదీ తినడు ఆకలవడానికి ఏదైనా మంచి టానిక్ రాసివ్వండి. లేదా మా పిల్లవానికి పెరుగు వాసన గిట్టదండి, పెరుగన్నం తినకపోతే వేడి చేస్తుంది కదా అని చాలామంది తల్లిదండ్రులు అడుగుతుంటారు. ఏడాది నిండేటప్పటికి పిల్లలకు దాదాపు నడక వచ్చేస్తుంది. అక్కడి నుండి తనంతట తానుగా తిరుగుతూ, ఎక్కడేమేమి ఉన్నా చక్కబెడుతూ, ఆటలలో మునిగిపోయే పిల్లలు తిండి విషయంలో పేచీ పెట్టడం సహజమే. ఓ పట్టాన దేనికీ లొంగరు. మూడేళ్ల వయసులో పిల్లల్లో ప్రీస్కూల్లో చేర్చడంతో అక్కడ తోటి పిల్లల అలవాట్లను అనుకరించడం, వాళ్లు తినేవి బాగున్నట్లు, తనకి పెట్టినవి బాగోలేదని అనిపించడం ప్రారంభమవుతుంది. ఇవన్నీ ఏయే ఏడాదికి ఆ ఏడాది మారే అలవాట్లే. కాబట్టి దీని గురించి అంతగా చెందనక్కరలేదు. ఇక కొన్ని రుచులు, వాసనలు పడకపోవడమన్నది పిల్లలకైనా, పెద్దవారికైనా అది సహజం అని గుర్తించాలి. అవి, ఇవి తినేలా ఒత్తిడి చేసే బదులు వారు ఇష్టపడే రీతిలో అదే సమయంలో పోషకాలు కూడా అందేలా ఆహారాన్ని తయారు చేసి పెట్టాలి. తినిపిస్తే ఎక్కువ తింటాడని, బిడ్డ తింటానని మొరాయిస్తున్నా బలవంతంగా నోటిలో కుక్కే ప్రయత్నం అస్సలు చేయరాదు. కొంత ఆహారం వేస్ట్ అయినా వాళ్లంతట వాళ్లు తింటామంటే ప్రోత్సహించాలి. అలాంటప్పుడే కొత్త కొత్తవి రకరకాల ఆహార పదార్థాలను పెట్టి తినమంటే వాళ్లు ఓ ఆటలాగా తింటారు. తినే ఆహారంలో శక్తినిచ్చే పదార్థాలు తగినంతగా లేకపోతే పెరుగుదల సరిగా వుండదు. పిల్లలు అంత చలాకీగా ఉండరు. పిల్లలకు పాలు, పండ్ల రసాలు చాలా ఎక్కువగా ఇస్తూ, ఘనాహారాన్ని చాలా పరిమితంగా పెట్టాలి. వివిధ రకాల ఆహార పదార్థాలు లేకుండా ఒకే మూసలో ఉండే ఆహారం పెట్టడం వల్ల పిల్లలకు ఎ విటమిన్, ఐరన్, డి విటమిన్, బి- కాంప్లెక్స్ విటమిన్ లోపాలు ఏర్పడతాయి. వాళ్లు బయటికి వెళ్లి ఆటలాడుకుంటారు. పైగా ఇది మంచిది, మంచిది కాదు అని తెలియదు దీంతో వారు తరుచుగా తరచుగా జబ్బు పడుతుంటారు. తేలికగా అంటువ్యాధులు సోకుతుంటాయి. అందువల్ల పరిశుభ్రమైన రకరకాల ఆహార పదార్థాలను పిల్లలకు పెట్టాలి. ఇవీ మార్గదర్శకాలు.. ప్రీ స్కూల్ పిల్లలకు తిండి కూడా ఓ ఆట వస్తువులానే వుంటుంది. అలాగే ఊహ తెలియకపోయినా ఇష్టం, అయిష్టం ఉంటాయని గుర్తించాలి. వయస్సుకు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో) వారిగా వివరాలు.. పుట్టినప్పుడు 50 - 3 ఏడాదికి 74 - 8.5 రెండేళ్లకు 81.5 - 10 మూడేళ్లకు 89 - 12 నాలుగేళ్లకు 96 - 13.5 అయిదేళ్లకు 102 - 15 అమ్మాయిలు వయస్సు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో) పుట్టినప్పుడు 50 - 3 ఏడాదికి 72.5 - 8 రెండేళ్లకు 80 - 9.5 మూడేళ్లకు 87 - 11 నాలుగేళ్లకు 94.5 - 13 అయిదేళ్లకు 101 - 14.5 కేలరీలు: ఏడాది వయసులో బిడ్డ బరువు కిలోకు వంద కిలో క్యాలరీలు అవసరం కాగా ఐదేళ్ల వయసులో 80 కిలో క్యాలరీలు కావాలి. ఏడాది వయసు వచ్చేటప్పటికి బిడ్డ రోజుకు మూడు పూట్ల భోజనంతో పాటు ఉదయం పూట అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ తినేలా చూడాలి. ఆ వయసులో తల్లి పాలు కానీ పోత పాలు కానీ వారికి అవసరమైన శక్తిలో పావు వంతు మాత్రమే అందించగలవు. అంటే అంత వరకు అనుబంధ ఆహారంగా ఉన్నది ఇక ముఖ్య ఆహారం కావాలి. పాలు, పండ్లు కూరగాయలు, చిక్కుడు జాతి గింజలు, గుడ్లు, మాంసం, చేపలు తదితరాలు తగు మొత్తాలతో ఉన్న సమతులాహారం బిడ్డకు అందేలా చూడాలి. పిల్లలకు ఏమాత్రం ఖాళీ దొరికినా సెల్ ఫోన్ కే పరిమితమైపోతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో గేములు, వీడియోలుకే బయట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. స్నేహితులు కంటే ఫోనునే అంతలా ఇష్టపడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఫోనుకు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫోను నిత్యవసరమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఫోనేను వాడడం మానుకోలేక, పిల్లలు అంతలా ఇష్టపడే ఫోను కేవలం పిల్లల మనో వికాసానికి అవసరమైన సలహాలు, ఆటలు ఆడేలా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిదిగా ఉంటే ఎంతబావుంటుందో కదా..! ముఖ్యంగా పిల్లలు టీనేజ్ వయసు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల వారితో ఏదో రకంగా సమయాన్ని కేటాయించాలి. అది వారికి అమూల్యమైన సమయంగా ఫీలయ్యేలా మీరు గనుక మీకున్న బిజీ షెడ్యూల్లో కనీసం ఓ అరగంట అయినా కేటాయించే యత్నం చేస్తే.. పిల్లలు సెల్ఫోన్లు లాంటి విష సంస్కృతికి అడిక్ట్ కారు. డిప్రెషన్‌కి గురయ్యి ఆత్మహత్య ధోరణి దరిదాపుల్లోకి వెళ్లరు. తల్లిదండ్రల గురించి ఆలోచించాలనే బాధ్యతయుతమైన వ్యక్తితత్వం తల్లిదండ్రుల సాన్నిహిత్యం ద్వారానే సాధ్యం. పిల్లలు బాగుపడాలన్నా, భవిష్యత్తు బాగుండాలన్ని అది తల్లిదండ్రల చేతుల్లోనే ఉందనేది గ్రహించండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి. పిల్లలకు తల్లిదండ్రలు మించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉండరు. తల్లిదండ్రలంటే భయం కాదు.. ప్రేమ, గౌరవం పిల్లల్లో కలిగేలా చేయాల్సింది తల్లిదండ్రులే కాబట్టి ముందు మీరే మారండి. --ఆయుర్వేద నిపుణులు, నవీన్ నడిమింటి (చదవండి: నాకిప్పుడు మూడోనెల, ఆ రిస్క్ ఉండకూడదంటే ఏం చేయాలి?) -
వర్షాకాలంలో వేధించే చర్మవ్యాధులకు చెక్ పెట్టండి ఇలా..
వర్షాకాలంలో దురదలు ఇన్ఫెక్షన్లుకు ఎందుకొస్తాయని అందరి మదిలో ఎదురై ప్రశ్నే..మరీ ముఖ్యంగా కాలి వేళ్లు, చర్మం మడతలలో దురద, తామర, గజ్జి వంటి వాటితో ఒకరకమైన ఇబ్బంది ఉంటుంది. అందుకు కారణంలో వేడి తేమతో కూడిన పరిస్థితులు. ఈ కాలంలో గాల్లో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. మనం ఈ కాలంలో కురిసే వాన కారణంగా కాళ్లకు వేసుకునే సాక్స్ దగ్గర్నుంచి, వివిధ చెప్పులు తడచిపోవటం లేదా చాల సేపటి వరకు నీటిలో నానిపోయి ఉండటం జరుగుతుంది. పైగా ఈ కాలంలో తడిగా అయిన వస్తువు డ్రైగా ఉండే అవకాశమే తక్కువ. పూర్తి స్తాయిలో ్రడైగా ఉండదు ఆ దుస్తులు లేదా సాక్స్‌లు వేసుకున్నా బ్యాక్టీరియా చేసి ఈ దురద, తామర వంటి ఇన్షెక్షన్లు వస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫ్టెక్టులు లేని ఆయుర్వేదంలోని ఈ చిట్కాలు ఫాలోయితో ఈజీగా బయటపడొచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేమిటో చూద్దామా!జ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టండి ఇలా.. హైడ్రోకార్టిసోన్ క్రీమ్: ఈ క్రీమ్ తామర, దురద, గజ్జితో సంబంధం ఉన్నవాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. కాలమైన్ ఔషదం: కాలమైన్ లోషన్ చర్మం దురదను ఉపశమనం చేస్తుంది. అలాగే తామర, దురద, గజ్జి వల్ల కలిగే దద్దుర్లు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. యాంటిహిస్టామైన్లు: బెనాడ్రిల్ వంటి కొన్ని యాంటిహిస్టామైన్లు, తామర, దురద మరియు గజ్జితో సంబంధం ఉన్న దురద నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. టీట్రీఆయిల్: టీ ట్రీ ఆయిల్లో యాంటీమైక్రోబయల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి గజ్జి, తామర దురదతో, సంబంధం ఉన్న లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. కలబంద: ఇది ఒక అద్భుత మూలిక, ఇది దాదాపు ఏ చర్మ పరిస్థితికైనా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కలబంద ఆకును చూర్ణం చేసి, దానిలోని జెల్‌ను ప్రభావిత ప్రాంతంలో పూయండి. ముందుగా ఆ ప్రాంతాన్ని క్రిమిసంహారక మందుతో కడగాలని నిర్ధారించుకోండి. కొబ్బరి నూనె: దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇది బాక్టీరియా, శిలీంధ్రాల వల్ల కలిగే చర్మ వ్యాధులకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. దాల్చినచెక్క సారాంశాన్ని జోడించడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదలను అరికట్టడంలో మీ చర్మాన్ని వ్యాధి రహితంగా ఉంచడంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. వెల్లుల్లి: తాజా వెల్లుల్లి యొక్క కొన్ని లవంగాలను చూర్ణం చేసి, ఆ పేస్ట్‌ను దురద ఉన్న ప్రదేశంలో రోజుకు రెండు లేదా మూడు సార్లు రాయండి. వెల్లుల్లిని నమలడం కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. గమనిక: కొందరికి పడకపోవచ్చు అది ఎలా తెలుస్తుందంటే..మీరు వెల్లులి పేస్ట్ చర్మంపై రానివెంటనే ఎర్రగా మారి దురద ఇంకాస్తా ఎక్కువై రక్తం కారేంత బాధగా ఉంటుంది. అలా అనిపిస్తే..ఉపయోగించకండి. వేప, పసుపుల పేస్ట్: కొన్ని తాజా వేప ఆకులను తీసుకుని, తాజా పసుపు ముక్కను వేసి మెత్తగా పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ని దురద ఉన్న చోట అప్లై చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. పుదీనా రసాం: ఇది కూడా బ్యాక్టీరియా, ఈస్ట్ మరియు శిలీంధ్రాల పెరుగుదలను నిరోధిస్తుంది. దురదలు దద్దుర్లు నిరోధించడంలో మంచి సహాయకారిగా ఉంటుంది. అలాగే వీటన్నింటి తోపాటు మనం నిత్యం తీసుకునే డైట్ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీపి ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి. ఎందకంటే ఇవి మీ శరీరంలోని ఈస్ట్ పెరుగుదలను పెంచి ఇన్ఫెక్షన్లను తీవ్రతరం చేస్తాయి. (చదవండి: ఈ వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే..ఇమ్యూనిటీ ఫుల్!) -
ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయుర్వేదంతో చెక్
అనేక అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదం చక్కటి పరిష్కారం. చిన్న చిట్కాలతోనే కొన్ని వ్యాధులను నయం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఇంగువను నిమ్మరసంతో కలిపి నూరి కొద్దిగా వెచ్చచేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది. బిళ్లగనేరు ఆకుల్ని, జామ ఆకుల్ని సమతూకంలో తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం 3 రోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. వంద గ్రాముల వాము శుభ్రంచేసి ఎర్రగా వేయించి, మెత్తగా పొడిచేసి డబ్బాలో నిల్వ ఉంచుకొని గ్యాస్ట్రబుల్ ఉన్నప్పుడు ఒక చెంచా పొడిని నీళ్ళల్లోగాని, విడిగా గాని తీసుకుంటే ఎక్కువ త్రేన్పులు రాకుండా ఉంటుంది. అల్లంముక్కలు తేనెతో గానీ, పంచదారతో గానీ కలుపుకుని తింటే యూనినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. పచ్చి మెంతులు ఒక అరచెంచా ఉదయం, సాయంత్రం మింగాలి. పచ్చివి తినలేకపోతే పెరుగులో నానబెట్టుకుని తింటే మూత్ర పిండాల నొప్పి తగ్గుతుంది. నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూజ, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికాయ చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి చల్లార్చి తలకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది. గుంటగలగరాకు దంచి, రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెలో కలిపి నీరు మరిగే వరకు ఉడకబెట్టాలి. చిటపట శబ్దం పోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచాలి. సువాసనకి గంధకచ్చూరాలు కలుపుకుని వాడడంవల్ల జుట్టు రాలదు. నల్లబడుతుంది, పెరుగుతుంది. అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది. అశ్వగంధ ఆకుల్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక పచ్చి ఆకుని నమిలి మింగాలి. ఇది బరువును తగ్గిస్తుంది ఎర్రమందారంపూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది. ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి. జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది. శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి సింహనాద గుగ్గిళ్ళు అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున మూడునెలలు వాడితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. -నవీన్ నడిమింటి -
ఎక్కువగా నిలబడి పనిచేస్తున్నారా?వెరికోస్ వెయిన్స్ నొప్పి నుంచి ఇలా ఉపశమనం
పాదాల్లోని సిరల్లో అవరోధాలు ఏర్పడి చెడురక్తం నిలిచిపోయి అవి మెలికలు తిరిగి ఉబ్బుతాయి. దీన్నే వేరికోస్ వెయిన్స్ అంటారు. ఎక్కువగా నిలబడి పని చేసేవారిలో వెరికోస్ వెయిన్ సమస్య ఎక్కువగా వస్తుంది. దీనికి పరిష్కార మార్గాలు, ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. యోగా యోగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.సిరల నుంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. యోగాసనాల ద్వారా వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే వాపు, పుండ్లు పడటం నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాయామం శారీరక శ్రమ లేదా వ్యాయామం అనారోగ్య సిరల అభివృద్ధి అవకాశాలను తగ్గిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం మీ కాళ్ళలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంద. అంతేకాకుండా ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడానికి కూడా సహాయపడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వాకింగ్ సైకిల్ తొక్కడం ఊపిరితిత్తులు లెగ్ లిఫ్ట్‌లు ఇలా చేయడం వల్ల కాళ్ల సిరల్లో ఒత్తిడి తగ్గడంతో పాటు సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ యాపిల్ సైడర్ వెనిగర్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.పేరుకుపోయిన టాక్సిన్స్ నుంచి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. వెరికోస్ వెయిన్స్కి చికిత్స చేయడానికి, పలచని యాపిల్ సైడర్ వెనిగర్‌ను వెరికోస్ వెయిన్లపై చర్మానికి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. ఇలా రోజుకు రెండుసార్లు చేయండి. లేదా గ్లాసు నీటిలో రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలుపుకొని తాగాలి.యాపిల్ సైడర్ వెనిగర్ చర్మంపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. లెగ్ మసాజ్ నొప్పి ఉన్న ప్రాంతాల్లో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల వేరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అయితే మసాజ్ చేసేటప్పుడు, నేరుగా సిరలపై నొక్కకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది పెళుసుగా ఉండే కణజాలాలను దెబ్బతీస్తుంది. వెరికోస్ వెయిన్ నొప్పి నుంచి ఉపశమనం తగ్గించడానికి కొన్ని ఆయుర్వేద పద్దతులు: అశ్వగంధ అశ్వగంధను సాధారణంగా "ఇండియన్ జిన్సెంగ్" లేదా "ఇండియన్ వింటర్ చెర్రీ" అని పిలుస్తారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఉపయోగించే సాంప్రదాయ ఔషధం. ఇది కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గోటుకోలా గోటు కోలా అనేది ట్రైటెర్పెనిక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెంటెల్లా ఆసియాటికా (TTFCA) అనే రసాయనాన్ని కలిగి ఉన్న ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధం. ఈ రసాయనం ముఖ్యంగా అనారోగ్య సిరలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎలాస్టిన్, కొల్లాజిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. గుగ్గుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన గుగ్గుల్‌ను ఆయుర్వేదంలో ఆర్థరైటిస్,ఊబకాయంతో సహా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.గుగ్గుల్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, మొటిమలు వంటి చర్మ వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. త్రిఫల చూర్ణం త్రిఫల అనేది ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద ఫార్ములా. ఇది రక్తాన్ని నిర్వీషికరణ చేయడంలో సహాయపడుతుంది. త్రిఫల చూర్ణం కండరాలకు బలాన్ని అందిస్తుంది. మంజిష్ఠ మంజిష్ట రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.రక్తప్రవాహంలో అడ్డంకులను కరిగిస్తుంది. అనారోగ్య సిరలు చికిత్సకు ఇది ఉత్తమమైన ఆయుర్వేద నివారణలలో ఒకటి. మంజిష్ఠ యొక్క ఇతర ప్రయోజనాలు మొటిమలు, హైపర్పిగ్మెంటేషన్ను నయం చేయడం. పసుపు పసుపులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా, వెరికోస్ వెయిన్స్ చికిత్సలో బాగా పనిచేస్తుంది. ఇది వాపు,నొప్పిని తగ్గిస్తుంది. రక్తం నుంచి హానీకరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. గమనిక: పైన పేర్కొన్ని ఆయుర్వేద మందులను వైద్యునితో చర్చించిన తర్వాతే తీసుకోవాలి. -నవీన్ నడిమింటి -
వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే..వ్యాధులు పరార్!
మొన్నటివరకు వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు జూన్ వచ్చిందంటే చాలు హమ్మయ్యా! అని ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే?.. ఋతుపవనాలు మారి ఒక్కసారిగా తొలకరి జల్లులు ప్రారంభమవుతాయి. వర్షాకాలం అంటే చల్లగా హాయిగా ఉంటుందని భావిస్తాం కానీ ఇది వ్యాధులు ముసురుకునే కాలం. అంతేగాదు మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో వైరస్లు, బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీంతో జలబు, దగ్గు, గొంతులో కఫం, వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన పడతారు. దీనికి తోడు దోమల బెడద కూడా ఎక్కువ అవ్వడంతో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు అవకాశాలు అక్కువ. ఈ కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలు వరకు అందరూ ఆయా వ్యాధుల బారిని పడుతుంటారు. అలాంటి సమయంలో మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కటి ఔషధాలు తయారు చేసుకుని సులభంగా ఆయా వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు 👉ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్ల ఉండకూదు 👉దోమలు లేకుండా ఉండేలా చేసుకోండి 👉నిండుగా దుస్తులు ధరించండి. బయట వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి శరీరం వెచ్చగా ఉండేలా మంచి దుస్తులు ధరించండి 👉తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోండి 👉పచ్చికాయగూరలు తినొద్దు 👉మరిగించి చల్లార్చిన నీటిని తాగండి ఈ జాగ్రత్తలు అన్ని తీసుకుంటూ మన ఇంట్లో ఉండే మసాల దినుసులతో ఈ కషాయాన్ని తయారు చేసుకుని సేవిస్తే ఆయా వ్యాధుల బారిన పడుకుండా ఉండోచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కషాయం తయారు చేసే విధానం: ధనియాలు: రెండు స్పూన్లు లవంగ-4 యాలుకలు-2 దాల్చిన చెక్క-అంగుళం ముక్క మిరియాలు-8 జీలకర్ర-అరస్పూన్ అల్లం లేదా శోంఠి: అర అంగుళం ముక్క తయారీ విధానం: పైన చెప్పిన వాటిని అన్నింటిని దంచుకుని పొడి చేసుకుని ఓ డబ్బాలో స్టోర్ చేసుకుండి. కాచిన నీటిలో ఈ పొడిని చిటికెడు వేసుకుని, ఉప్పు వేసుకుని తాగొచ్చు లేదా నిమ్మరసం కలుపుకుని పరగడపున తీసుకుంటుంటే వర్షాకాలంలో వచ్చే ఎలాంటి వ్యాధులు మీ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. మీరు కూడా ఓసారి దీన్ని ట్రై చేసి చూడండి. (చదవండి: ఫుల్లుగా తిన్నారా...ఆందోళన వద్దు) -
చెప్పేది నాటువైద్యం, చేసేది దోపిడీలు
సాక్షి, బనశంకరి: ఆయుర్వేద మూలికలతో చికిత్స చేస్తామని చెప్పుకుంటూ ప్రజలవద్ద నుంచి డబ్బు దండుకుని వంచనకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను మంగళవారం బెంగళూరు విల్సన్ గార్డెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహమ్మద్ సమీన్ అలియాస్ డాక్టర్ మల్లిక్, సైఫ్ అలీ, మహ్మద్ రహీస్. ఇంటికెళ్లి రూ.8.8 లక్షలతో పరారు వివరాలు... నెలమంగల వద్ద టెంట్లు వేసుకుని నాటు మూలికలు ప్రదర్శిస్తూ మొండి రోగాలను నయం చేస్తామని ప్రజలను నమ్మించేవారు. శాంతినగర బసప్పరోడ్డు నివాసి పంకజ్‌ఠాకూర్ తన తల్లికి కాలి నొప్పికి చికిత్స చేయాలని వీరిని గత నెల 16 తేదీన ఇంటికి తీసుకెళ్లాడు. చికిత్స చేయడానికి ఖర్చవుతుందని వారిని మాటల్లో పెట్టి రూ.8.8 లక్షలు తీసుకుని ఉడాయించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో డీసీపీ శ్రీనివాసగౌడ, ఏసీపీ నారాయణస్వామి ఆధ్వర్యంలో ముఠాను గాలించి పట్టుకున్నారు. వారి నుంచి నాలుగుకార్లు, మూడు ద్విచక్రవాహనాలు రూ.3.50 లక్షలు నగదు, నాటు మూలికలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా వైద్యం పేరుతో ఎంతోమందిని మోసగించినట్లు అనుమానాలున్నాయి. (చదవండి: స్నేహితురాలి ఇంటికే కన్నం..మహిళకు ఆరేళ్లు జైలు శిక్ష) -
ఉల్లి... ఎందుకీ లొల్లి!
గత మార్చి నుంచి ఇప్పటివరకు ఉల్లి ధరలు 400 శాతం పెరిగాయి. దేశంలో చాలా చోట్ల కేజీ ఉల్లి ధర రూ.150 నుంచి రూ.200 వరకు చేరుకుంది. ధరాఘాతం కేవలం ఉల్లికే పరిమితం కాలేదు. గత నాలుగు నెలల కాలంలో దాదాపు 20 నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. బియ్యం, గోధుమలు, పప్పు దినుసులు, కూరగాయలు, నూనె, బెల్లం వంటి సరుకుల రేట్లు ఆకాశాన్నంటాయి. అయినా ఉల్లి గురించే దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. మిగిలిన వాటి ధరలు పెరిగినా పట్టించుకోని జనం.. ఉల్లి ధరపై ఎందుకింత తల్లడిల్లిపోతున్నారు? ఇదే సండే స్పెషల్.. ఇది మొఘల్స్ ఘాటు ఇప్పుడంటే ఉల్లి కోసం అందరూ ఎగబడుతున్నారు కానీ ఒకప్పుడు ఉల్లికి మన సమాజంలో చోటే లేదు. మొఘలాయిలు మన దేశంలోకి అడుగుపెట్టక ముందు ఉల్లి, వెల్లుల్లికి బదులుగా భారతీయులు వంటల్లో అల్లం ఎక్కువగా వాడేవారని చరిత్రకారులు చెబుతున్నారు. 2 వేల ఏళ్ల కింద ఆయుర్వేద వైద్యుడు చరకుడి చరక సంహితలో ఉల్లి గురించి చాలా గొప్పగా రాశారు. కూరల్లో ఉల్లిని వాడితే మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయని, జీర్ణక్రియకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అప్పట్లో ఉల్లి వాడకం బాగా ఉండేది. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత ఆయుర్వేదంలో ఉల్లిని నిషేధించారు. ఉల్లిని తమోగుణాన్ని పెంచే వస్తువుగా చూసేవారు. ఉల్లి తింటే శారీరక వాంఛలు పెరుగుతాయని తేల్చారు. దీంతో ఉల్లి అనేది కొన్ని కులాలకు మాత్రమే పరిమితమైంది. వితంతువులు ఉల్లి తినకూడదని ఆంక్షలు విధించారు. క్రీస్తుశకం 7వ శతాబ్దంలో భారత్‌ను సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్ పుస్తకాల్లో.. భారత్‌లో ఉల్లిపై నిషేధం ఉందని, దాన్ని వాడేవారిని ఊరి నుంచి వెలివేశారని రాశారు. క్రీ.శ.1526లో మొఘలాయిలు భారత్‌లో అడుగు పెట్టిన తర్వాత ఉల్లి వాడకం ఇంటింటికీ పాకింది. వాళ్లు చేసే బిర్యానీ, ఇతర వంటకాల్లో మసాలాలు, ఉల్లి లేనిదే రంగు, రుచి వచ్చేది కాదు. అలా కాలక్రమంలో ఉల్లి లేనిదే వంటలు చేయలేని పరిస్థితి వచ్చింది. అయితే జైనులు ఉల్లిపాయ, వెల్లుల్లికి ఎప్పుడూ దూరమే. ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా ఉల్లి వాడేవారు కాదు. కానీ రానురానూ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న సత్యాన్ని గ్రహించి ఉల్లి వాడకాన్ని మొదలు పెట్టారు. ఉల్లి ఉల్లికో కథ సామాన్యుల నుంచి కోట్లకు పడగలెత్తిన వారి వరకు ఉల్లి లేనిదే అసలు ముద్దే దిగదు. ఏ వంట చేయాలన్నా ఉల్లి తప్పనిసరి. సలాడ్స్ నుంచి మాంచి మసాలాలు దట్టించిన కుర్మాలు, చికెన్, మటన్ వరకు ఉల్లి లేకుండా వంటలకి రుచే రాదు. శాకాహారులు ఎక్కువగా తినే సాంబార్లో చిన్న ఉల్లిపాయలు వాడకుండా టేస్ట్ తేలేరు. నిరుపేదలకు గంజన్నం, ఉల్లిపాయ ఉంటే చాలు అదే పంచభక్ష పరమాన్నం. -
వెరీ గూడ్
సంస్కృతంలో బెల్లాన్ని ‘గుడము’ అంటారు.హిందీలో ‘గూడ్’ అంటారు.ఆరోగ్యకరమైన తీపి అంటే బెల్లమే...ఆయుర్వేద గుణాలు ఉన్నది బెల్లానికే...దీపావళి పండుగను స్వచ్ఛమైన బెల్లంతో జరుపుకోండి... ముఖంలో కాంతులు నింపుకోండి... తియ్యటి వేడుకలతో వెలిగిపొండి... అనరస కావలసినవి: బెల్లం పొడి – ఒక కప్పు – (100 గ్రా.); బియ్యప్పిండి – 150 గ్రా.; గసగసాలు – ఒక టీ స్పూను; నువ్వులు – ఒక టీ స్పూను; నెయ్యి లేదా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి మూడు రోజుల పాటు నానబెట్టాలి (ప్రతిరోజూ రెండు సార్లు నీళ్లు మార్చాలి) ∙నాలుగో రోజు నీళ్లన్నీ శుభ్రంగా ఒంపేసి, ఒక పొడి వస్త్రం మీద బియ్యాన్ని నాలుగు గంటలసేపు ఆరబోయాలి ∙ఆరబోసిన బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి ∙మిక్సీ పట్టిన పిండిని ఒక పాత్రలోకి తీసుకుని, బెల్లం పొడి జత చేసి చలిమిడిలా అయ్యేలా బాగా కలిపి, మూత పెట్టి 12 గంటల పాటు పక్కన ఉంచాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో అరిసె మాదిరిగా ఒత్తాలి ∙పైన గసగసాలు కాని నువ్వులు కాని ఒత్తాలి ∙ఇలా అన్నిటినీ ఒత్తుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగిన తరవాత ఒత్తి ఉంచుకున్న అనరసలను వేసి వేయించి తీసేయాలి ∙వేడివేడిగా కాని, చల్లగా కాని తినొచ్చు. కంచ గోలా కావలసినవి: పనీర్ – ఒక కప్పు; బెల్లం పొడి – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; రోజ్ వాటర్ – ఒక టీస్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా; పిస్తా తరుగు – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ముందుగా పాలను విరగ్గొట్టి, గట్టి పనీర్ తయారుచేసుకోవాలి (ఒక్క చుక్క నీరు కూడా లేకుండా గట్టిగా పిండి తీసేయాలి) ∙పనీర్‌ను ఒక పాత్రలోకి తీసుకుని చేతితో సుమారు పావు గంట సేపు బాగా కలపాలి ∙(కొద్దిగా తడి ఉందనిపిస్తే, స్టౌ మీద బాణలిలో వేసి కొద్దిసేపు ఉంచితే తడి పోతుంది) ∙పనీర్ బాగా చల్లారాక రోజ్ వాటర్, ఏలకుల పొడి, కుంకుమపువ్వు, బెల్లం పొడి వేసి సుమారు ఐదు నిమిషాల పాటు కలుపుతుండాలి ∙ఈ మిశ్రమాన్ని సుమారు పన్నెండు సమాన భాగాలుగా చేసి, చేతితో ఒత్తాలి ∙పగుళ్లు లేకుండా చూసుకోవాలి ∙ప్రతి గోలాను పిస్తా తరుగుతో అలంకరించి, ఫ్రిజ్‌లో సుమారు నాలుగు గంటలపాటు ఉంచి బయటకు తీసి చల్లగా అందించాలి. పటిషప్త కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; బొంబాయి రవ్వ – అర కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; పాలు – 2 కప్పులు ఫిల్లింగ్ కోసం: పచ్చి కోవా తురుము / కొబ్బరి తురుము – 3 కప్పులు; బెల్లం పొడి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను ఫిల్లింగ్ తయారీ: ∙ఒక పాత్రలో కొబ్బరి తురుము/పచ్చి కోవా తురుము, బెల్లం పొడి వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉంచాలి ∙(పచ్చి కోవాతో చేస్తుంటే కొద్దిగా పాలు జత చేయాలి) ∙కొద్దిగా ఉడికిన తరవాత ఏలకుల పొడి జత చేయాలి ∙ తీగలా సాగే వరకు సుమారు 20 నిమిషాల పాటు బాగా కలిపి దింపి, చల్లారనివ్వాలి. పటిషప్త తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బొంబాయి రవ్వ, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి ∙పాలు జత చేసి ఉండలు లేకుండా కలిపి, ఈ మిశ్రమాన్ని సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ ఉంచి, వేడయ్యాక కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక స్పూనుడు వేసి పల్చగా పరవాలి ∙వెంటనే దాని మీద ఫిల్లింగ్ మిశ్రమాన్ని ఒక స్పూనుడు వేసి, రోల్ చేయాలి ∙లేత గోధుమరంగులోకి వచ్చేవరకు ఉంచి, ప్లేట్లోకి తీసుకోవాలి ∙వీటిని వేడిగా కాని, చల్లగా కాని అందించవచ్చు ∙కండెన్స్డ్ మిల్క్ పోసి అందిస్తే, అందంగాను, రుచిగాను ఉంటుంది. స్వీట్ సమోసా కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు (పావు కేజీ); పచ్చి సెనగ పప్పు – అర కప్పు (నానబెట్టాలి); బెల్లం పొడి – అర కప్పు; జీడిపప్పులు – 2 టేబుల్ స్పూన్లు; కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పులు – 10; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – వేయించడానికి తగినంత తయారీ: ∙సెనగ పప్పును శుభ్రంగా కడిగి, అర కప్పు నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి స్టౌ మీద ఉంచాలి ∙ఒక విజిల్ రాగానే మంట తగ్గించి మరో రెండు విజిల్స్ వచ్చాక స్టౌ మీద నుంచి దింపేయాలి ∙బాదం పప్పులు, జీడి పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ∙ఒక పాత్రలో మైదా పిండి, నెయ్యి వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి పూరీల పిండి మాదిరిగా కలిపి, పైన వస్త్రంతో కప్పి, సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి ∙ఈలోగా స్టఫింగ్ తయారుచేసుకోవాలి ∙ఉడికించిన సెనగ పప్పులో నీళ్లు ఉంటే వాటిని వడకట్టి తీసేయాలి ∙సెనగ పప్పును మిక్సీలో వేసి కొంచెం పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టి బయటకు తీసేయాలి ∙చిన్న బాణలి స్టౌ మీద పెట్టి వేడయ్యాక ఒక టీ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙సెనగ పప్పు పొడి వేసి దోరగా వేయించాక, ఒక పాత్రలోకి తీసుకుని, బాగా చల్లారాక, బెల్లం జత చేసి కలియబెట్టాలి ∙ఆ తరవాత జీడిపప్పు పలుకులు, కిస్మిస్, ఏలకుల పొడి జత చేసి బాగా కలపాలి ∙మైదా పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని పూరీలా ఒత్తి, మధ్యలోకి కట్‌చేయాలి ∙ఒక్కో భాగాన్ని తీసుకుని కోన్ ఆకారంలో చేతితో చేసి, అందులో పచ్చి సెనగ పప్పు మిశ్రమం ఉంచి, సమోసాలాగ మూసేసి పక్కన ఉంచుకోవాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, తయారుచేసి ఉంచుకున్న స్వీట్ సమోసాలను వేసి వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. ఉన్ని యాప్పమ్ కావలసినవి: బియ్యం – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని; కొబ్బరి వేయించడానికి; నూనె – అర టేబుల్ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు ఉన్నియాçప్పమ్ కోసం: అరటి పండ్లు – 2 ; నల్ల నువ్వులు – ఒక టీ స్పూను; బెల్లం పొడి – అర కప్పు; నీళ్లు – పావు కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; సోంపు పొడి – అర టీ స్పూను; బేకింగ్ సోడా – పావు టీ స్పూను; కొబ్బరి నూనె లేదా నెయ్యి – ఒక టీ స్పూను (ఒక్కో గుంటలో) తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు నాలుగు గంటలపాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి మెత్తగా చేయాలి ∙ముప్పావు కప్పు అరటి పండు గుజ్జు, అర కప్పు బెల్లం పొడి, ఏలకుల పొడి జత చేసి మరోమారు తిప్పాలి. (అవసరమనుకుంటే ముప్పావు కప్పు నీళ్లు జత చేయాలి) ∙రవ్వలా వచ్చేవరకు గ్రైండ్ చేయాలి (మరీ మెత్తటి పిండిలా రాకూడదు) ∙పిండిని మరో పాత్రలోకి తీసుకోవాలి. కొబ్బరి వేయించడానికి: బాణలిని స్టౌ మీద ఉంచి, కొబ్బరి నూనె లేదా నెయ్యి వేసి కరిగాక, పచ్చి కొబ్బరి ముక్కలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.ఉన్నియాప్పమ్ పిండి తయారీపిండిలో మిగిలిన నూనె, వేయించిన కొబ్బరి ముక్కలు జత చేసి కలపాలి. నల్ల నువ్వులు, జీలకర్ర పొడి, శొంఠి పొడి, బేకింగ్ సోడా జత చేసి మరోమారు బాగా కలపాలి.ఉన్నియాప్పమ్ తయారీఅప్పమ్ వేసే చట్టీ పాన్ (పొంగడం మౌల్డ్లా ఉంటుంది) స్టౌ మీద ఉంచి వేడి చేయాలి. ఒక్కో గుంటలోను ఒక టీ స్పూను కొబ్బరి నూనె వేసి, మంట బాగా తగ్గించాలి. నూనె వేడయ్యాక ఒక స్పూన్‌తో పిండి మిశ్రమం ఒక్కో గుంటలో మూడు వంతుల వరకు వేసి, సన్నటి మంట మీద ఉన్నియప్పమ్ బంగారు రంగులోకి వచ్చేవరకు ఉడికించాలి. రెండో వైపు తిప్పి మరి కాస్త నెయ్యి వేసి ఉడికించి దింపేయాలి. వీటిని వేడివేడిగా కాని, చల్లగా కాని తినొచ్చు. ఇవి రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజుల దాకా ఉంటాయి. గూడ్ కీ రోటీ కావలసినవి: గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు; నెయ్యి – అర కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; పాలు – అర కప్పు; బేకింగ్ సోడా – చిటికెడు; ఉప్పు – చిటికెడు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; దాల్చిన చెక్క పొడి – చిటికెడు తయారీ: ∙ఒకపాత్రలో అర కప్పు పాలు, బెల్లం పొడి వేసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగించి దింపి చల్లారనివ్వాలి ∙ఒక పాత్రలో గోధుమ పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, ఏలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి ∙పాలు + బెల్లం మిశ్రమం జత చేస్తూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి (అవసరమనుకుంటే మరి కొన్ని పాలు జత చేయాలి) ∙కొద్దిగా నెయ్యి జత చేసి మరో మారు కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి ∙ఒక్కో ఉండను పావు అంగుళం మందంగా చపాతీలా ఒత్తుకుని పక్కన ఉంచుకోవాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి, తయారుచేసి ఉంచుకున్న గుర్ కీ రోటీ వేసి, సన్నని మంట మీద బాగా కాల్చాలి ∙ రోటీ చుట్టూ నెయ్యి వేయాలి ∙రోటీ మీద కొద్దిగా నెయ్యి పూసి, రోటీని తిరగేసి మళ్లీ నెయ్యి వేసి బాగా కాలాక తీసేయాలి ∙ఈ రోటీలను వేడివేడిగా కాని చల్లగా కాని అందించాలి. గూడ్ కీ కుల్ఫీ కావలసినవి: జీడి పప్పులు – 50 గ్రా. (చిన్న చిన్న ముక్కలు చేయాలి); చిక్కటి పాలు – ఒక లీటరు; మిల్క్ మెయిడ్ – ఒక క్యాన్ (410 గ్రా.); ఏలకుల పొడి – అర టీ స్పూను; బెల్లం పొడి – 100 గ్రా.; పంచదార పొడి – 50 గ్రా; ఉప్పు – చిటికెడు తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, జీడిపప్పులు వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించి, తీసి చల్లారనివ్వాలి ∙ఒక పెద్ద పాత్రలో పాలు, కండెన్స్డ్ మిల్క్, ఏలకుల పొడి వేసి, మీడియం మంట మీద ఉంచి మరిగించాలి ∙కొద్దిపేయ్యాక మంట సిమ్ చేసి, సుమారు గంటన్నర సేపు అలానే ఉంచాలి ∙మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙బెల్లం పొడి వేసి కరిగేవరకు కలుపుతుండాలి ∙పంచదార పొడి, ఉప్పు వేసి మరోమారు కలిపి, సుమారు పది నిమిషాలు ఉంచాలి ∙అడుగు అంటకుండా జాగ్రత్తపడాలి ∙జీడిపప్పు పలుకులు వేసి మరోమారు కలిపి దింపేయాలి ∙బాగా చల్లారాక కుల్ఫీ మౌల్డ్స్‌లో మూడు వంతుల వరకు పోసి, ఫ్రిజ్‌లో ఒక రోజు రాత్రంతా ఉంచాలి ∙ సర్వ్ చేయడానికి ఐదు నిమిషాల ముందర ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి పైన మరికొన్ని జీడిపప్పు పలుకులు వేసి అందించాలి. -
క్యాన్సర్‌కు ఆయుర్శక్తి
మొదట్లో ఆయన కంప్యూటర్ ఇంజనీర్. యువ ఎంటర్ప్రెన్యూర్ కూడా. కానీ అకస్మాత్తుగా ఆరోగ్యరంగం వైపునకు పయనం ప్రారంభించారు. ముఖ్యంగా క్యాన్సర్ రోగుల బాధలనూ, వెతలనూ తగ్గించాలని సంకల్పించారు. అందుకోసం ‘కాలిఫోర్నియా కాలేజ్ ఆఫ్ ఆయుర్వేదా’ నుంచి పట్టా పొందారు. అమెరికాలో, భారత్‌లో ‘రాధాస్ ఆయుర్వే’ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆయుర్వేదం, వెస్ట్రన్ హెర్బాలజీ, యోగా, ధ్యానం, అరోమా థెరపీ, మర్మచికిత్స, మర్దన చికిత్స, సౌండ్ థెరపీ, కలర్ థెరపీలతో అనేకమంది కేన్సర్ బాధితులకు సాంత్వన కలిగిస్తున్నారు. ఇటీవల ఆమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఈ నెల 13న పెద్దఎత్తున అవగాహన సదస్సు నిర్వహించారాయన. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ∙మీరు వైద్యరంగం వైపు, అందునా క్యాన్సర్ వైపునకు దృష్టి సారించడానికి కారణం? శరత్ అద్దంకి: మా అమ్మ రొమ్ముక్యాన్సర్‌తో బాధపడుతూ 13 మే 2015న మరణించారు. చికిత్సలన్నీ సరిగానే అందాయి. కీమో తీసుకున్నారు. అంతా బాగానే ఉన్నా ఆమె కన్నుమూశారు. ఎందుకు జరిగింది? ఈ ప్రశ్న నన్ను వేధించింది. ఆమె విషయంలో ఏం లోపం జరిగిందన్న ఆలోచనే నేను చాలా అంశాలను అధ్యయనం చేసేలా పురిగొల్పింది. దాంతో చాలా విషయాలు తెలిశాయి. ∙మీ అధ్యయనంలో మీకు తెలిసివచ్చిన అంశాలు... శరత్: కీమోథెరపీ అంటే రసాయనాలతో క్యాన్సర్ కణాలని తుదముట్టించే ప్రక్రియ. ఈ విషయం మనకు తెలిసిందే. మన ఒంట్లోకి రసాయనాలు ప్రవేశించినప్పుడు వాటితో పాటు వాటి విషప్రభావాలూ చేరుతాయి. మన శరీరంలోని విషాలను విరిచేసి, బయటకు పంపాల్సిన తొలి బాధ్యత కాలేయానిది. మలి బాధ్యత మూత్రపిండాలది. దాంతో ఈ రెండూ అమితంగా కష్టపడతాయి. కానీ వాటికీ ఒక పరిమితి ఉంటుంది కదా. అంతగా పనిచేశాక కూడా ఒంట్లోని విషాలను పూర్తిగా బయటకు పంపలేనప్పుడు అవి ఒంట్లోనే పేరుకుపోతాయి. సరిగ్గా ఇందువల్లనే మనకు కీమో దుష్ప్రభావాలు అనేక రూపాల్లో కనిపిస్తుంటాయి. అంటే వికారం, వాంతులు, ఒళ్లంతా నల్లబడిపోవడం, జుట్టురాలిపోవడం ఇలా. వీటినే మనం సైడ్ఎఫెక్ట్స్ అంటుంటాం. క్యాన్సర్ రోగులు చికిత్సకు బాగానే స్పందిస్తారు. కానీ చికిత్స తాలూకు దుష్ప్రభావాలతోనే కన్నుమూస్తారు. ఇది ఇకపై ఇలా జరగకూడదని నేను సంకల్పించాను. అందుకోసం పరిష్కారాలను ఆయుర్వేదంలో వెతికాను. ∙మరి ఆయుర్వేదంలో ఆ పరిష్కారాలు కనిపిం చాయా? శరత్: కచ్చితంగా! కీమో తీసుకుంటున్న ప్రతివారూ చాలా బలహీనంగా మారిపోతారు. బలంగా మారడానికి వాళ్లు బాగా తినాలి. తిన్నా క్యాన్సర్ మందుల సైడ్‌ఎఫెక్ట్స్‌తో వాంతులవుతాయి. తిన్నదేమీ కడుపులో ఉండదు. అలాంటి ఎన్నో సమస్యలకు ఆయుర్వేదంతో పాటు కొంత మూలికా చికిత్స (హెర్బల్ మెడిసిన్) మార్గం చూపుతుంది. తొలుత వికారాన్ని తగ్గించి రోగులు బాగా తినేలా చేస్తుంది. దాంతో తిన్నది వంటబడుతుంది. ఫలితంగా రోగులు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోగలుగుతారు. మా దగ్గర లభించే కొన్ని రకాల ఔషధాలు... కాలేయాన్నీ, మూత్రపిండాలనూ ఇంకా చాలా కీలక అవయవాలను దృఢతరం చేస్తాయి. కీమోను బలంగా తట్టుకోగలిగేలా చేస్తాయి. మేము ‘పేషెంట్’ అనే పదం వాడము. ఆ మాటలో సిక్నెస్ ధ్వనిస్తుంది. మేము వాళ్లను ‘వెల్నెస్ సీకర్స్’ అని పిలుస్తాము. ఆ మాటే పెద్ద ఊరట. మీ దగ్గర ఉన్న చికిత్స ప్రక్రియల ప్రత్యేకతలు ఏమిటి? అవెలా ఉంటాయి? శరత్: భారతదేశంలోనే దాదాపు ఎవరి దగ్గరా లేని కొన్ని ప్రత్యేకమైన ఉపకరణాలు మా దగ్గరే ఉన్నాయి. ఉదాహరణకు మా దగ్గర ‘వేదా పల్స్’ అనే ఒక ఉపకరణం ఉంది. దీని సాయంతో ఆయా అవయవాల ఎనర్జీ లెవెల్స్‌ను తెలుసుకోవచ్చు. ‘వేదా జెనెటిక్’ అనే మరో డివైజ్ కూడా ఉంది. వీటి సహాయంతో కేవలం 7 నిమిషాల్లో ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని చూడవచ్చు. మా దగ్గర జబ్బునూ నయం చేస్తాం. జబ్బు రాకముందే నివారణనూ సాధ్యం చేస్తాం. క్యాన్సర్ రోగులు డిప్రెషన్, కుంగుబాటులో బాధపడుతుంటారు కాబట్టి వారి కోసం మా దగ్గర సైకియాట్రిస్ట్‌లు ఉంటారు. వారికి అవసరమైన ఆహారాన్ని సూచించేందుకు న్యూట్రిషనిస్టులూ ఉంటారు. వారిని నార్మల్‌గా ఉంచేందుకు దోహదపడే అనేక విభాగాలకు సంబంధించిన ఆలోపతిక్ డాక్టర్లూ ఉంటారు. వెల్నెస్ సీకర్స్ ఆఘ్రాణించేదీ బాగుండాలి. ఇందుకు మా అరోమా థెరపీ తోడ్పడుతుంది. వినేదీ చెవికి ఇంపుగా ఉండాలి. సౌండ్ హీలింగ్ దీనికి ఉపయోగపడుతుంది. కళ్లకు చూసేది ఆహ్లాదకరంగా ఉండాలి. కలర్స్ థెరపీతో పాటు, అమెరికాలో మా చికిత్స ప్రక్రియలు అందించే ప్రదేశాల చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లోని పచ్చదనం ఇందుకు ఉపకరిస్తుంది. స్పర్శతోనూ ఎంతో చికిత్స అందించవచ్చు. మా మర్దన చికిత్స (మసాజ్ థెరపీ) ఇందుకు దోహదం చేస్తుంది. ఇలా పంచేంద్రియాలనూ సరిదిద్దే ఆయా విభాగాలకు చెందిన నిపుణులైన డాక్టర్లుంటారిక్కడ. అయితే వాళ్లను మేం డాక్టర్లు అని పిలవం. వాళ్లను మేము చాలా గౌరవంగా ‘వైటలిస్ట్స్’ అంటాం. వైటల్ పవర్ అంటే జీవశక్తి. ఈ వైటలిస్టులు ఒంట్లోని జీవశక్తిని పునరుజ్జీవింపచేస్తారు. కాబట్టే వాళ్లకా పేరు. ∙క్యాన్సర్ ఎందుకొస్తుందో కారణం తెలియదంటారు కదా? మరి మీరెలా తగ్గిస్తారు? శరత్: నిర్దిష్టంగా క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలియకపోవచ్చు. కానీ స్థూలంగా చెప్పాలంటే క్యాన్సర్ రావడానికి చాలా కారణాలుంటాయి. ఇలాంటి వాటిల్లో 16 ప్రధానమైనవి. అవి: 1. జీవనశైలి 2. జన్యుపరంగా మార్పులు చెందిన ఆహారం, 3. వాతావరణ కాలుష్యం 4. పొగ, మద్యం 5. మానసిక, ఉద్వేగపరమైన ఒత్తిడి 6. ఇన్ఫ్లమేషన్ 7. మలబద్దకం 8. కీలక విటమిన్ల లోపం 9. అధికంగా రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్లను తీసుకోవడం 10. హార్మోన్ల అసమతౌల్యత 11. ఆమ్లయుతమైన ఆహారాలు (అసిడిక్ ఫుడ్) ఎక్కువగా తీసుకోవడం 12. ఎరువులు, క్రిమిసంహార మందుల ప్రభావానికి గురికావడం 13. దగ్గరి వారిని కోల్పోవడం 14. కొవ్వులతో కూడిన (ట్రాన్స్‌ఫ్యాట్స్) ఎక్కువగా తీసుకోవడం 15. ఒంట్లో, మనసులో పేరుకున్న విషాలను విసర్జించలేకపోవడం 16. రేడియేషన్‌కు గురికావడం... ఇలాంటి పదహారు ప్రధాన కారణాలను దూరంగా ఉంచితే క్యాన్సర్‌ను నివారించవచ్చు. ఇలాంటి అవగాహన కల్పించడం కోసమే మా అమ్మగారు మరణించిన మే 13 తేదీన ప్రతి ఏడాదీ నేను అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటాను. యూఎస్ఏలోనే కాకుండా భారత్‌లో కూడా మీ ఆయుర్వేద సెంటర్స్ ఉన్నాయా? ఉంటే ఎక్కడ? శరత్: అవును.. ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో రాధాస్ ఆయుర్ వే పేరిట మా కేంద్రం పనిచేస్తోంది. భారత్‌లో మరింత మంది రోగులకు అందుబాటులోకి వచ్చేలా మరిన్ని సెంటర్స్ ప్రారంభించాలనే ఆలోచన ఉంది. అలాగే అమెరికాలో కూడా. ∙మీ ప్రత్యామ్నాయ చికిత్సలు ఎలా ఉంటాయి? శరత్: ఒంటిని రోగాలకు తట్టుకునేలా చేసేందుకు వ్యాధినిరోధక శక్తిని కల్పించే ఆయుర్వేద ఔషధాలు, మూలికలు ఇస్తుంటాం. దాంతో పాటు ఆహారంలో ఎన్నో మార్పులు సూచిస్తాం. పెసర్లలో ఉన్నంత ప్రోటిన్ మరెక్కడా ఉండదు. అలాగే రోగనిరోధకను సమకూర్చే శక్తికి మూలమైన విటమిన్–సి ‘ఉసిరి’లో ఉన్నంత ఇంకెక్కడా లభ్యంకాదు. ఇక చక్కెరకు బదులు ఆరోగ్యం కోసం ‘బెల్లం’ వాడుతాం. పాలిష్ పట్టిన బియ్యం వద్దు... దంపుడు బియ్యం వాడమని సూచిస్తాం. చిరుధాన్యాలైన రాగులు, కొర్రల వంటి వాటిని తినమని చెబుతాం. ప్రతిపూటా ఎలాంటి ఆహారాలు ఉండాలో వివరిస్తాం. ఎలాంటి నూనెలైనా వేడిచేస్తున్నప్పుడు 450 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరగానే అవి క్యాన్సర్ కారకాలుగా మారిపోతాయి. వాటికి బదులు ‘కోల్డ్ ప్రెస్డ్’ ఆయిల్స్ వాడమని చెబుతాం. అలాగే జీవనశైలి (లైఫ్‌స్టైల్)లో ఆరోగ్యకరమైన మార్పులు సూచిస్తాం. ఇక పంచకర్మ చికిత్స, యోగా, ధ్యానం వంటివి వారికి ఎంతగానో ఉపయోగిస్తాయి. ∙క్యాన్సర్ రోగులకు బలం చేకూరడానికి మీరు చెబుతున్న మందులు ఖరీదైనవే కదా. మరి వాటిని భరించలేని వారు కూడా ఉంటారు కదా... శరత్: అవును... అందుకే అలాంటి వారికోసం మేమొక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఆ మందుల్ని కొనే స్తోమత లేనివారికి ఇస్తాం. ముందే చెప్పాను కదా... క్యాన్సర్ చాలా ఖరీదైన రుగ్మత అని. అందుకే క్యాన్సర్ హాస్పిటల్స్ దగ్గర ఉండే వాళ్ల సహాయకులను చూస్తే నాకు సానుభూతి. ఆ సహానుభూతితోనే వీలైనన్నిసార్లు మాకు చేతనైనంతగా పలుమార్లు వాళ్లకు ఆహారం అంది స్తున్నాం... అందిస్తూ ఉంటాం. మా హెర్బల్ ఔషధాలు పంచుతుంటాం. మా హెల్ప్‌లైన్‌కు కాల్ చేసిన వారికి తగిన సలహాలు ఇస్తాం. ఇలా చేయాల్సింది ఎంతో! నిత్యం ఎంతో కొంత నెరవేర్చగలిగినా అది చాలు. అదే మాకు వేనవేలు. రాధాస్ ఆయుర్వే క్యాన్సర్ హెల్ప్‌లైన్ నంబర్లు : 91000 58333/ 91 5404 5404 -
ఏది కావాలన్నా శెట్టి కొండయ్య అంగడే..
ఆయుర్వేదం.. ఆధ్యాత్మికం కేరాఫ్ శెట్టి కొండయ్య ఆయుర్వేదానికి చిరునామాగా నిలిచిన దుకాణం తొమ్మిది దశాబ్దాలుగా ప్రయాణం హిమాలయాల్లో లభించే మూలికలు...హోమాల్లో ఉపయోగించే నెయ్యి...గర్భిణులు ఉపయోగించే కుంకుమ పువ్వు... పూజ సామగ్రి...రుద్రాక్షలు...ఇందులో ఏదీ కావాలన్నా...టక్కున గుర్తొచ్చేసి శెట్టి కొండయ్య దుకాణం. అనంతపురంలోని పాతూరులో ఉన్న దుకాణం జిల్లా వాసులందరికీ అంతలా సుపరిచితం అయ్యేందుకు తొమ్మిది దశాబ్ధాల చరిత్ర ఉంది. వెలకట్టలేని శ్రమ ఉంది. అంతకుమించిన సేవాభావముంది. అనంతపురం కల్చరల్: ఆయుర్వేదం..ప్రపంచానికి దారి చూపిన సనాతన భారతీయ వైద్య విధానం. అలోపతి..యునానీ.. హోమియో మరెన్నో వైద్య విధానాలున్నా ప్రాచీన రుషి సంప్రదాయానికి ప్రతీకగా నిలచిన ఆయుర్వేదంపై అనంత వాసులకు విశ్వాసం ఎక్కువే. అందుకు జిల్లా కేంద్రంలోని ‘శెట్టి కొండయ్య దుకాణం’ కూడా ఓ కారణమంటే అతిశయోక్తి కాదు. పండితుల వద్ద అవగాహన పాతూరు సందుల్లో దాదాపు తొంబై ఏళ్ల కిందట వెంకట నారప్ప అనే వ్యక్తి చిన్నదుకాణంలో ఆయుర్వేద మూలికల అంగడి ప్రారంభించాడు. స్థానికంగా దొరికే మూలికలతో వ్యాపారం కొనసాగించేవాడు. కానీ ఆయన కుమారుడు శెట్టి కొండయ్య వ్యాపారంలో అడుగిడాక అది మూడు పువ్వులు..ఆరు కాయలుగా విరాజిల్లింది. వినియోగదారులకు ఏం కావాలో...అవి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని మరీ శెట్టి కొండయ్య తెప్పించేవాడు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, కలకత్తా ప్రాంతాలకెళ్లి ఆయుర్వేద మూలికలను తెచ్చేవారు. అయితే మనుషుల ఆరోగ్యంతో ఆషామాషీ వ్యవహారం కాదు కాబట్టి ఆయనే స్వయంగా ఏ రోగానికి ఏ మూలిక పనిచేస్తుందే నేర్చుకుని మరీ అమ్మేవారు. ఆ రోజుల్లో వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండడంతో...జనమంతా ఇంటి వైద్యమైన ఆయుర్వేదంపై ఆధారపడేవారు. అందుకే ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా జిల్లా వాసులంతా శెట్టి కొండయ్య దగ్గరకు వచ్చేవారు. అలా అందరి వద్ద నమ్మకం సంపాదించిన శెట్టి కొండయ్య తన పేరునే బ్రాండ్ నేమ్‌గా మార్చుకుని వ్యాపారాన్ని విస్తరించాడు. అలా ఆయూర్వేద మూలికలకు చిరునామాగా మారిన శెట్టి కొండయ్య దుకాణంలో మంతెన సత్యనారాయణ, ఏల్చూరి వంటి ఆయుర్వేద పండితులు చెపుతున్న చూర్ణాల, వివిధ గింజలు, లవణాలు, పొడులు, వన మూలికలేవైనా సిద్ధంగా ఉంటాయి. పూజ సామగ్రికీ పెట్టింది పేరు సంప్రదాయ పూజా సామగ్రి విషయంలోనూ శెట్టి కొండయ్య దుకాణం పేరుగాంచిందనే చెప్పవచ్చు. వేద పురోహితులు, అర్చకులు యజ్ఞ, యాగాదుల కోసం ఉపయోగించే వస్తు సామగ్రి దొరకడం కూడా అతి కష్టమైన రోజుల్లోనూ శెట్టి కొండయ్య వాటి కోసం రాష్ట్రంలోని సుప్రసిద్ధ ప్రాంతాలన్నింటి తిరిగి సేకరించేవాడు. ఒక్కోసారి హిమాలయాల్లో మాత్రమే దొరికే పూసలు, రుద్రాక్షలు, సముద్రపు గవ్వలు, కుంకుమ, పసుపు, గంధం, కర్పూరాలను తీసుకువచ్చి వినియోగదారులకోసం సిద్ధంగా ఉంచేవాడు. అలాగే యజ్ఞోపవితాలు, రాగి, వెండి రేకులపై లిఖించే బీజాక్షరాల వంటి వాటిని సేకరించడానికి ఎన్నో వ్యయప్రయాసలకోర్చేవారు. పండుగలొచ్చినా, నిత్య దీపధూప నైవేద్యాలకైనా అవసరమయ్యే వస్తు సామగ్రిని అనంతకు పరిచయం చేయడానికి పెద్ద తతంగమే జరిగింది. మరోచోట కొని తెచ్చి అమ్మడం కన్నా అరుదైన వాటిని సేకరించి అమ్మడం వల్ల ఎక్కువ విశ్వాసం ఉండేది. కాబట్టే ఒకనాడు పాతూరుకు పరిమితమైన వ్యాపారం జిల్లా అంతటా పాకిపోయింది. ఆ క్రమంలోనే శెట్టి కొండయ్య దుకాణం ఇపుడు రాష్ట్ర మంతటా పేరుగాంచింది. వారసుల కాలంలో మరింత వృద్ధిలోకి... శెట్టి కొండయ్యకు మగ సంతానం లేకపోవడం... ఆయన 1986లో మృత్యువాత పడడంతో దుకాణంలో గుమాస్తాగా పనిచేసే శెట్టికొండయ్య భార్య అన్నకొడుకైన సుబ్రమణ్యం వ్యాపారాన్ని కొనసాగించారు. ఆ తర్వాత సుబ్రమణ్యం కుటుంబీకులే దానిని నిర్వహిస్తున్నారు. శెట్టి కొండయ్య కూతుళ్లయిన తులసమ్మ, విశాలాక్షి ఇద్దరూ ప్రస్తుతం తాడిపత్రి ప్రాంతంలో నివసిస్తున్నారు. శెట్టి కొండయ్య నేర్పిన పాఠాలతో ఇప్పటి వారసులు కూడా ప్రజా సంబంధాలకు, విలువలకు ప్రాధాన్యతనిస్తుండడంతో వ్యాపారం మరింత వృద్ధి చెందింది. ఇటీవల కాలంలో ఆయుర్వేదానికి మంచి రోజులు వస్తుండడం, ఆధ్యాత్మిక పరంపర పెరిగి పూజలు, హోమాలు, యజ్ఞ యాగాలకు పూర్వ వైభవం రావడంతో శెట్టి కొండయ్య దుకాణం నిత్యం వినియోగదారులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. నాణ్యత, నిబద్ధతే మా విజయ రహస్యం నేను 1986లో చిన్న గుమాస్తాగా చేరాను. శెట్టి కొండయ్య కాలం చేసినప్పటి నుంచీ నేనే అంగడి నడుపుతున్నాను. ‘కస్టమర్లే మనకు దేవుళ్లు..వారిని బాగా చూసుకుంటే జీవితంలో ఏ లోటూ రాదు’ అని మాకు చిన్నప్పటి నుండి కొండయ్య చెప్పేవాడు. చిన్న పొరపాటు జరిగినా సహించేవాడు కాదు. ఆ మేరకు మేము కూడా నాణ్యమైన వాటినే విక్రయిస్తూ వస్తున్నాం. కాబట్టే ఆయన పేరు పాతూరులో చిరస్థాయిగా నిలచిపోయింది. – సుబ్రమణ్యం, నిర్వాహకులు, శెట్టికొండయ్య దుకాణం యాభై ఏళ్లుగా అదే నమ్మకం మేము యాభై ఏళ్ల నుంచి శెట్టి కొండయ్య అంగడిని చూస్తున్నాం. ఏ మూలిక కావాల్సి వచ్చినా శెట్టికొండయ్య వాళ్ల దగ్గరకు వెళ్లేవాళ్లం. ఆయన ప్రేరణతో చాలా దుకాణాలు వచ్చినా నాణ్యతతో పాటు కచ్చితత్వం ఉంటుందని మాలాంటి వారమంతా శెట్టి కొండయ్య దుకాణికే వెెళ్తాం. ఒక్కోసారి ఏదైనా వస్తువు వారి వద్ద లేకున్నా..దాని రవాణాకు ఎంత ఖర్చయినా సొంతంగా భరించి వినియోగదారునికి అందిస్తారు. ఇక కొండయ్య ఉన్నరోజుల్లో చదువుకునే పిల్లలను పిలిచి మరీ శొంఠి ఉచితంగా ఇచ్చేవాడు. దాన ధర్మాలంటే ఎంతో ప్రీతి కనపరిచేవాడు. – సయ్యద్ షేక్షావలి, టైలర్, పాతూరు ఆధ్యాత్మిక సామగ్రి అందుబాటులో ఉంటుంది మా చిన్నప్పుడు పూజా సామగ్రిని స్వయంగా సమకూర్చునే వాళ్లం. ఆ ఓపికి ఈ తరం వారికి తగ్గిపోయింది. ఏది కావాలన్నా రెడీమెడ్పైన ఆధారపడుతున్నారు. అందుకే ఎంత పెద్ద హోమమైనా, యజ్ఞమైనా పూజా సామగ్రి కోసం శెట్టి కొండయ్యదుకాణానికే వెళ్తున్నారు. మేము నిత్యం ఉపయోగించే వనమూలికలైనా, వివిధ ఆధ్యాత్మిక సామగ్రి అయినా ఇబ్బంది లేకుండా అక్కడ అందుబాటులో ఉంటుంది. – ఏఎల్ఎన్ శాస్త్రి, వేదపండితులు, అనంతపురం -
ఆయుర్వేద మందులు సీజ్
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి పట్టణంలోని కోదండరామస్వామి ఆలయంలో అక్రమంగా అమ్ముతున్న ‘వైద్యరుషి’ ఆయుర్వేద మందులను ఆదివారం ఔషధ తనిఖీ ఆధికారి కీర్తిపవిత్ర సీజ్ చేశారు. పట్టణంలో వివిధ దేవాలయాలలో ప్రతి నెలా రెండో తేదీన కర్నూల్‌కు చెందిన వేణు, జనార్ధన్ అనే వ్యక్తులు ఆయుర్వేద మందులు అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించామన్నారు. మందుల తయారీలో కల్తీ జరుగుతోందని, స్టెరాయిడ్స్ కలుపుతున్నారని ఔషధ తనిఖీ ఆధికారి పేర్కొన్నారు. ఈ మందుల వాడకం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు అధికమవుతాయని అన్నారు. -
పుష్కర ఔషధాలు సిద్ధం
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం పలు పుష్కరాల ఘాట్లకు మందులు సరఫరా చేశారు. జిల్లాలో ఉన్న 52పుష్కర ఘాట్లకు దాదాపు రూ.80లక్షల మందులను కొనుగోలుచేసినట్లు తెలిపారు. పుష్కర ఘాట్లలో వైద్య ఆరోగ్యశాఖ నుంచి 640మంది వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంచారు. ముఖ్యమైన ఘాట్లలో తాత్కాలిక 10పడకల ఆస్పత్రులను ఏర్పాటుచేశారు. పుష్కర విధుల కోసం ప్రభుత్వ వైద్యులతో పాటు ఆరోగ్య శ్రీ అమలవుతున్న ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు పనిచేస్తున్నారు. పుష్కరాల కోసం 18రకాల మందులను భక్తుల కోసం ఉపయోగించనున్నారు. -
ఆయుర్వేద వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సంస్థాన్ నారాయణపురం: ఎలాంటి ఇతర ఇబ్బందులు కలిగించని హోమియో, ఆయుర్వేద వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సర్వేల్ ఆయుర్వేద ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆయుష్ కమిషనర్ రాజేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుర్వేదం వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారని పేర్కొన్నారు. ఆయుష్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయుర్వేదం, హోమియోపతి, ప్రాచీన వైద్యానికి మంచి రోజులు వచ్చాయన్నారు. అల్లోపతి వైద్యం వల్ల ఇతర సమస్యలు ఉంటాయి కానీ, ఆయుర్వేదం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తవన్నారు. పంచకర్మ వైద్యశాలగా సర్వేల్ ఆయుర్వేద ఆస్పత్రిని తీర్చిదిద్దాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆర్డీడీ వసంతరావు, జెడ్పీటీసీ బొల్ల శివశంకర్, ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, ఎంపీడీఓ కాంతమ్మ, భగవతి, సర్పంచ్‌లు మానపాటి సతీష్‌కుమార్, సుగుణమ్మ, ఎంపీటీసీ సభ్యులు షేక్ షబ్బీర్, కత్తుల లక్ష్మయ్య, మండల ఆయుర్వేద వైద్యాధికారి ఉర్మిల, వైద్యులు రమేష్, సురేష్, నీరజన్, జయశ్రీ, కవిత తదితరులున్నారు. -
డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త
డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త మీరు ఓ పదిమందిని పలకరిస్తే.. అందులో ఐదుగురికి డయాబెటిస్ ఉంటున్న రోజులివి. తప్పనిసరిగా దాదాపు ప్రతిరోజూ దీనికి మందులు వాడాలి. కానీ, మందులు ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్టులు ఉంటాయన్న భయం, దానికితోడు మందుల ఖర్చు కూడా ఎక్కువే. వీటన్నింటికీ పరిష్కారంగా.. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా, ఎఫెక్టివ్‌గా పనిచేసే ఆయుర్వేద ఔషధం ఒకటి అందుబాటులోకి వచ్చింది. దాని ధర కూడా తక్కువే. ఒక్కో టాబ్లెట్ ఖరీదు ఐదు రూపాయలు మాత్రమే. నాలుగు రకాల ఔషధ మొక్కలను ఉపయోగించి లక్నోలోని సీఎస్ఐఆర్, ఎన్బీఆర్ఐ, సిఎమ్ఏపీ సంస్థలు సంయుక్తంగా 'బీజీఆర్-34' ఔషదాన్ని తయారుచేశాయి. ఇది పూర్తిగా ఆయుర్వేద ఔషధం. దీనిని వాడిన వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని శాస్త్రవేత్తలు తెలిపారు. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్( ఎన్బీఆర్ఐ) 62 వ వార్షికోత్సవం సందర్భంగా దీని ప్రొడక్షన్‌ను ప్రారంభించారు. 'బీజీఆర్-34' ఔషధం క్లినికల్ ట్రయల్ పరీక్షలలో 67 శాతం విజయం సాధించినట్లు తెలిపారు. ఈ మందు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ రావత్ తెలిపారు. త్వరలోనే మార్కెట్లో ఈ ఔషదం లభించనుంది. నేడు 'ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం' సందర్భంగా డయాబెటిస్ వ్యాధిపై మరింత సమాచారం తెలుసుకుందాం. మారుతున్న ఆధునిక జీవనశైలి డయాబెటీస్ వ్యాధికి లోనవడానికి గల అవకాశాలను పెంచుతుంది. అప్పుడే పుట్టిన చిన్నారుల నుండి మొదలుకొని అన్ని వయసుల వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. డయాబెటీస్ వ్యాధి.. టైప్-1, టైప్-2 అని రెండు రకాలుగా ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ అసమతుల్యత వల్ల కలిగితే. టైప్-2 డయాబెటీస్ వెయిట్ మేనేజ్మెంట్కు సంబంధించినది. ఇది ప్రాణాపాయాన్ని కలిగించేంత ప్రమాదకరమైనది. దీనిని తినకముందు రక్తంలో ఉన్నటువంటి చెక్కెర స్థాయిని పరీక్షించడం ద్వారా తెలుసుకోవచ్చు. టైప్-2 డయాబెటీస్ ముదిరితే గుండే, కిడ్నీలు, కళ్లపై తీవ్ర దుష్పరిణామాలను చూపుతుంది. శరీరంలో షుగర్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి కలిగించే విపరీత పరిణామాల నుండి బయటపడొచ్చు.డయాబెటీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు: అహారం ఒకే సారిగా కాకుండా కొంచెం కొంచెంగా క్రమం తప్పకుండా తీసుకుంటుండాలి. త్వరగా జీర్ణమయ్యే బియ్యం, వైట్ బ్రెడ్ల లాంటి సరళమైన కార్బోహైడ్రేట్ల స్థానంలో రాగి, ఓట్స్ లాంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను అహారంలో ఉండేలా చూసుకోవాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు గల రోటీ, కూరగాయలు, సలాడ్లు రోజు వారి అహార మెనూలో ఉండేలా చూసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు రోజుకి తగినంత వ్యాయామం శరీరానికి అందేలా చూసుకోవడం ఎంతో అవసరం. శరీర బరువుని నియంత్రణలో ఉంచుకోవడం డయాబెటీస్ చికిత్సలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మెడిటేషన్ లాంటి మానసిక ప్రశాంతతను చేకూర్చే చర్యల వలన దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి. క్రమం తప్పకుండా షుగర్ లెవల్స్‌ను చెక్ చేసుకుంటూ డాక్టర్లు నిర్థేశించిన మోతాదులో ఇన్సులిన్‌ను వాడాలి. -
ఆరోగ్యం-ఆయుర్వేదం 16th October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 15th October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 12th October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 11th October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 10th October 2013