నడియాడ్: ఆయుర్వేదిక్ సిరప్ తాగి అయిదుగురు మరణించగా మరో ఇద్దరు ఆస్పత్రి పాలైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిథైల్ ఆల్కహాల్‌తో ఆ సిరప్ కలుషితమైనట్లు చెప్పారు. ఈ ఘటన గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాడ్ పట్టణంలో జరిగింది.
ఖేడా జిల్లాలోని నడియాడ్ పట్టణంలోని ఓ షాప్ నుంచి ఆయుర్వేదిక్ సిరప్ బాటిళ్లను 50 మంది దాకా కొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆయుర్వేదిక్ సిరప్‌ను కల్‌మేఘాసవాసవ అరిష్ట అనే బ్రాండ్ పేరుతో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.
‘సిరప్‌లో విషపూరిత మిథైల్ ఆల్కహాల్ కలిపినట్లు అది తాగిన వారి రక్త పరీక్షలో బయటపడింది. షాపులో అమ్మే ముందు సిరప్‌లో మిథైల్ ఆల్కహాల్ కలిపినట్లు తేలింది. గడిచిన రెండు రోజుల్లో సిరప్ తాగినవారిలో అయిదుగురు చనిపోయారు. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. సిరప్ అమ్మిన షాపు యజమానితో పాటు ముగ్గురిని అరెస్టు చేశాం’ ఖేడా ఎస్పీ రాజేష్ గదియా చెప్పారు.
ఇదీచదవండి..‘చైనాను చూసి నేర్చుకోండి’.. మరోసారి ఇన్ఫోసిస్ మూర్తి షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment