syrup
-
జెప్టోలో డెలివరీ.. హెర్షే చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక
ఈ మధ్యకాలంలో ఆన్లైన్ డెలివరీ పార్శిల్లో వస్తున్న వాటిని చూసి చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం నోయిడాలలో ఓ వ్యక్తి ఐస్క్రీంను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అందులో తెగిన మనిషి వేలు కనిపించడం సంచలనం సృష్టించింది. దీంతో సదరు ఐస్‌క్రీం సంస్థ లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు. అనంతరం బెంగళూరులోని ఓ వ్యక్తి అమెజాన్ నుంచి ఎక్స్ బాక్స్ కంట్రోలర్‌ను ఆర్డర్ చేయగా.. పార్శిల్ బాక్స్‌లో చిన్న తాచు పాము వుండడం చూసి ఒక్కసారిగా కస్టమర్ భయాందోనకు గురయ్యాడు.తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. ఆన్ లైన్ డెలివరీ సంస్థ జెప్టో ద్వారా ఆర్డర్ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్లో చనిపోయిన ఎలుకను చూసి ప్రమీ శ్రీధర్ అనే మహిల ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు.జెప్టో నుంచి హెర్షే చాక్లెట్ సిరప్‌ని బ్రౌనీ కేక్‌లతో తినడానికి ఆర్డర్ చేయగా... సిరప్‌ను కప్‌లో పోస్తుండగా అందులో చనిపోయిన ఎలుక కనిపించిందని అని పేర్కొన్నారు. అయితే ఈ విషయం తెలియక ముందు కుటుంబ సభ్యులు సిరప్ రుచి చూశారని, దీంతో వారు అస్వస్థతకు గురయ్యారని తెలిపింది. ఏదైనా వస్తువు ఆర్డర్ చేసి తినే ముందు తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేయాలని, కేసు వేయాలని సూచిస్తున్నారు.దీంతో హెర్షే సంస్థ స్పందించింది. ఇలాంటి ఘటన ఎదురైనందుకు తాము చింతిస్తున్నామని తెలిపింది. దయచేసి తమకు UPC అలాగే తయారీ కోడ్‌ను consumercare@hersheys.comకు రిఫరెన్స్ నంబర్ 11082163తో పంపాలని తెలిపింది. తద్వారా తమ బృంద సభ్యులు మీకు సహాయం చేయగలరని పేర్కొంది. View this post on Instagram A post shared by Prami Sridhar (@pramisridhar) -
ఇథనాల్ తయారీలో చెరకు రసం వినియోగంపై నిషేధం
న్యూఢిల్లీ: ఇథనాల్ ఉత్పత్తిలో చెరకు రసం, షుగర్ సిరప్‌ల వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ప్రారంభమైన 2023–24 సరఫరా సంవత్సరానికి (డిసెంబర్–నవంబర్ మధ్య కాలం) ఇది వర్తిస్తుంది. దేశీయంగా వినియోగానికి తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూసేందుకు, అలాగే ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇథనాల్ ఉత్పత్తి కోసం ’బి–మొలాసిస్’ను వినియోగించడానికి అనుమతించింది. చక్కెర పరిశ్రమ దీన్ని స్వాగతించింది. అయితే ప్రత్యేకంగా చెరకు రసం, షుగర్ సిరప్‌ల ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లు పని చేయకపోతే అవి ఖాయిలా పడే అవకాశం ఉందని పేర్కొంది. 2023–24 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్–సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) అంచనాల ప్రకారం 2023–24 మార్కెటింగ్ సంవత్సరంలో స్థూలంగా చక్కెర ఉత్పత్తి 9 శాతం తగ్గి 337 లక్షల టన్నులకు పరిమితం కానుంది. 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో భారత్ 61 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. అంతక్రితం ఏడాది రికార్డు స్థాయిలో 112 లక్షల టన్నుల చక్కెర ఎగుమతైంది. ధరలను అదుపులో ఉంచే ఉద్దేశంతో ఈ మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతులకు కేంద్రం అనుమతించలేదు. -
ఆయుర్వేదిక్ సిరప్ తాగి ఐదుగురు మృతి
నడియాడ్: ఆయుర్వేదిక్ సిరప్ తాగి అయిదుగురు మరణించగా మరో ఇద్దరు ఆస్పత్రి పాలైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిథైల్ ఆల్కహాల్‌తో ఆ సిరప్ కలుషితమైనట్లు చెప్పారు. ఈ ఘటన గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాడ్ పట్టణంలో జరిగింది. ఖేడా జిల్లాలోని నడియాడ్ పట్టణంలోని ఓ షాప్ నుంచి ఆయుర్వేదిక్ సిరప్ బాటిళ్లను 50 మంది దాకా కొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆయుర్వేదిక్ సిరప్‌ను కల్‌మేఘాసవాసవ అరిష్ట అనే బ్రాండ్ పేరుతో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ‘సిరప్‌లో విషపూరిత మిథైల్ ఆల్కహాల్ కలిపినట్లు అది తాగిన వారి రక్త పరీక్షలో బయటపడింది. షాపులో అమ్మే ముందు సిరప్‌లో మిథైల్ ఆల్కహాల్ కలిపినట్లు తేలింది. గడిచిన రెండు రోజుల్లో సిరప్ తాగినవారిలో అయిదుగురు చనిపోయారు. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. సిరప్ అమ్మిన షాపు యజమానితో పాటు ముగ్గురిని అరెస్టు చేశాం’ ఖేడా ఎస్పీ రాజేష్ గదియా చెప్పారు. ఇదీచదవండి..‘చైనాను చూసి నేర్చుకోండి’.. మరోసారి ఇన్ఫోసిస్ మూర్తి షాకింగ్ కామెంట్స్ -
భారత్ దగ్గు మందు సురక్షితం కాదు: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
జెనీవా: ఇరాక్‌లో విక్రయిస్తున్న భారత్ తయారీ దగ్గు మందు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జలుబు, దగ్గు నివారణ కోసం ‘కోల్డ్ అవుట్’ పేరుతో దగ్గు రూపొందించిన సిరప్ తయారీలో వాడే పదార్థాలు పరిమితికి మించి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. చెన్నైకు చెందిన ఫోర్ట్స్ ల్యాబోరేటరీస్ కంపెనీ తయారు చేసిన కోల్డ్ అవుట్ అనే దగ్గు మందును ఇరాక్‌కు చెందిన దాబిలైఫ్ ఫార్మాకు విక్రయించింది. ఈ మందులో డైథిలీన్ ఇథలీన్ మోతాదుకు మించి ఉన్నట్టుగా డబ్ల్యూహెచ్ఒ గుర్తించింది. కోల్డ్ అవుట్లో 0.25% డైఇథలీన్, 2.1% ఇథలీన్ గ్లైకాల్‌లు ఉన్నట్లు తెలిపింది. ఈ దీని వినియోగం సురక్షితం కాదని డబ్ల్యూహెచ్‌వో సూచించింది చిన్నారులు ఈ మందు తాగితే అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. తీవ్ర అస్వస్థతకు గురై మరణం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా ఇటీవల భారత్‌లో తయారైన సిరప్ గురించి డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేయడం ఇదే ప్రథమం. కాగా గతంలో భారత్‌లో తయారైన దగ్గు మందులను ఉపయోగించడం వల్ల ఉజ్బెకిస్థాన్‌లోని గాంబియాలో 89 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో సిరప్‌ను ఉజ్బెకిస్థాన్‌కు సరఫరా చేసిన మరియోన్ బయోటెక్ అనుమతులను భారత్ ప్రభుత్వం రద్దు చేసింది. అంతకముందు కామెరూన్లో చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు తయారు చేసిన రీమాన్ ల్యాబ్స్ కూడా సిరప్ తయారీలో నాణ్యత పాటించలేదని విచారణలో తేలింది. -
డాక్టర్ వేధిస్తున్నాడని ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నం
యర్రగొండపాలెం: డాక్టర్ తనను మానసికంగా వేధిస్తున్నాడని ఏఎన్ఎం వైద్యశాలలో ఉన్న యాంటీబయోటిక్ సిరప్ మోతాదుకు మించి తాగి ఆత్మహత్యా యత్నం చేసిన సంఘటన పుల్లలచెరువు మండలంలోని నాయుడుపాలెం పీహెచ్సీలో సోమవారం జరిగింది. నాయుడుపాలెం ఆరోగ్య కేంద్రం సబ్సెంటర్లో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న దేవికాబాయిని ఆ వైద్యశాల డాక్టర్ కంచర్ల నాగార్జునగౌడ్ వేధింపులకు గురిచేస్తున్నాడని, వైద్యశాల వద్దకు, పుల్లలచెరువులో జరిగే కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు తన భర్త మోటారుబైక్పై తీసుకొని రావటాన్ని డాక్టర్ అభ్యంతరం తెలిపేవాడని, అనుచితంగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించింది. కొన్ని రోజులుగా ఆయన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని వైద్యశాలలో ఉన్న సిరప్ తాగానని ఆమె తెలిపింది. సంఘటన జరిగిన వెంటనే తన తోటి సిబ్బంది వెంటనే యర్రగొండపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. డాక్టర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని లంబాడీ సంక్షేమ సంఘం నాయకులు, ఏఎన్ఎం బంధువులు డిమాండ్ చేశారు. గత ఏప్రిల్ నెలలో స్థానిక మాచర్ల రోడ్డులోని ఆంజనేయస్వామి గుడివద్ద నడుచుకుంటూ పోతున్న ఒకరిని డాక్టర్ తన కారుతో ఢీకొట్టిన కేసు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ఉందని వారు తెలిపారు. డాక్టర్ వేధింపులకు తాను ఆత్మహత్యా యత్నం చేసినట్లు స్థానిక పోలీసులకు ఏఎన్ఎం దేవికాబాయి వాంగ్మూలం ఇచ్చింది. కేసు నమోదు చేసి పుల్లలచెరువు పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు ఎస్సై జి.కోటయ్య తెలిపారు. -
కేంద్రం కొత్త రూల్స్..ట్యాబ్లెట్, సిరప్ కొనుగోలుదారులకు ముఖ్యగమనిక
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న డ్రగ్ రూల్స్ (ఫార్మాస్యూటికల్)ను సవరించింది. ఈ రూల్స్ వచ్చే ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 18న విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం..డ్రగ్ రూల్స్ (ఎనిమిదవ సవరణ)- 2022లో భాగంగా కాల్పోల్,అల్లేగ్రా,బెటాడిన్, గెలుసిల్, డోలో 650తో సహా టాప్ 300 డ్రగ్ ఫార్ములేషన్ ప్యాకేజింగ్ లేబుల్‌పై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్‌ను తప్పని సరి చేస్తున్నట్లు అధికారింగా ప్రకటించింది. ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా నకిలీ మెడిసిన్‌ను గుర్తించవచ్చని తెలిపింది. ఆగస్ట్ 1, 2023 నుంచి కొత్త డ్రగ్ రూల్స్ ఆగస్ట్ 1, 2023 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. షెడ్యూల్ హెచ్2లో పేర్కొన్న డ్రగ్ ఫార్ములేషన్ ఉత్పత్తుల తయారీదారులు దాని ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్ (ప్రైమరీ ప్యాకేజీ లేబుల్) పై బార్ కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ కోడ్‌ను ప్రింట్ చేయాలి లేదా అతికించాలి. ప్రాథమిక ప్యాకేజీ లేబుల్‌లో తగినంత స్థలం లేకపోతే, నిల్వ చేసే సెకండరీ ప్యాకేజీ లేబుల్‌పై ప్రామాణీకరణను సులభతరం చేయడానికి సాఫ్ట్వేర్ అప్లికేషన్‌తో చదవగలిగే డేటా ఉంచాలని’ స్పష్టం చేసింది క్యూఆర్ కోడ్‌తో క్యూఆర్ కోడ్ సాయంతో మెడిసిన్ తయారీ చేసిన ప్రొడక్షన్ కోడ్, డగ్స్ సరైన..సాధారణ పేరు, బ్రాండ్ పేరు, తయారీదారు పేరు,చిరునామా, బ్యాచ్ నంబర్, మ్యానిఫ్యాక్చరింగ్ తేదీ, ఎక్స్‌పైయిరీ డేట్ (గడువు తేదీ). లైసెన్స్ నంబర్ డేటా వివరాలు తెలుసుకునే సౌకర్యం కలగనుంది. కాగా, నకిలీ మెడిసిన్ లేదా సిరప్‌ల అమ్మకాల్ని అరికట్టేందుకు రష్యా, బ్రిటన్,జర్మనీ,అమెరికా తోపాటు ఇతర దేశాల్లో ఈ క్యూఆర్ కోడ్ ఇప్పటికే అమల్లో ఉండగా తాజాగా భారత ప్రభుత్వం ఈ లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపింది. -
వికటించిన మందులు
విశాఖపట్నం , అగనంపూడి (గాజువాక): ఒక సిరప్ బదులు మరో సిరప్ ఫార్మాసిస్ట్ ఇవ్వడంతో ఆ మందు వికటించి చిన్నారిని ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్లింది. ఈ సంఘటన అగనంపూడిలో చోటు చేసుకుంది. అగనంపూడి నిర్వాసితకాలనీ కొత్తూరుకు చెందిన సీతిన గణేష్, రూపల మూడేళ్ల పాప హేమచంద్రికకు జ్వరం, జలుబు చేయడంతో అగనంపూడి ఆస్పత్రికి బుధవారం మధ్యాహ్నం తీసుకువెళ్లారు. ఆస్పత్రిలోని పిల్లల వైద్యనిపుణుడు జ్వరానికి, జలుబుకు సిరప్లు మందుల చీటిపై రాశాడు. అయితే పొరపాటున ఫార్మాసిస్ట్ వేరే సిరప్లు ఇవ్వడం, వాటిని పాపకు పట్టడంతో ఒళ్లంతా రంగుమారిపోయి, దద్దుర్లు వచ్చాయి. అంతలోనే స్పృహ తప్పిపోవడంతో వెంటనే అగనంపూడి ఆస్పత్రికి తీసుకు వెళ్లగా మందులు మారిపోయినట్టు గుర్తించిన సిబ్బంది కేజీహెచ్‌కు పంపించారు. పాప పరిస్థితి విషమంగా మారుతుండడంతో పాప తల్లిదండ్రులు గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇదే విషయంపై బాధితులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయగా, పోలీస్ ఫిర్యాదు చేసుకోవాలని సమాధానం చెప్పడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పిల్లల సిరప్ నాసిరకమే!
సాక్షి, హైదరాబాద్: పేదల ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు వైద్య, ఆరోగ్య శాఖలోని అధికారులు తూట్లు పొడు స్తున్నారు. ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసే మందుల విషయంలో కళ్లు మూసుకోవ డంతో కంపెనీలు రెచ్చిపోతున్నాయి. పిల్లల మందు ల్లోనూ నాసిరకమే ఉంటున్నాయి. కోట్లు పోస్తున్నా.. లాభమేంటి? రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మందుల సరఫరాకు ఏటా సగటున రూ.200 కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) మందు లను కొనుగోలు చేసి ఆస్పత్రులకు సరఫరా చేస్తోంది. వీటిలో ఎక్కువ శాతం చిన్న పిల్లల మందులే ఉంటున్నాయి. పిల్లల్లో రక్తహీనత సమస్యను తొలగించేందుకు వినియో గించే ఐరన్–ఫోలిక్ యాసిడ్ సిరప్ కొనుగోళ్ల వ్యవహారం అక్రమాల పుట్టలా మారింది. ఈ ఏడాదిలో ఐరన్–ఫోలిక్ యాసిడ్ సిరప్‌ల సరఫరా కోసం టీఎస్ఎంఎస్ఐడీసీ టెండర్లు పిలిచింది. 62.33 లక్షల సీసాల సిరప్‌లను సరఫరా చేసేందుకు మెడిపోల్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఒక్కో సీసా 60 మిల్లీ లీటర్ల పరిమాణంలో ఉంటుంది. టీఎస్ ఎంఎస్ఐడీసీ అనుమతితో మెడిపోల్ కంపెనీ 44 బ్యాచ్‌లకు చెందిన 44 లక్షల సీసాలను టీఎస్ఎంఎస్ఐడీసీకి సరఫరా చేసింది. ఒక్కో సీసాకు రూ.5.67 చొప్పున మొత్తం రూ.2.49 కోట్ల నిధులతో వీటిని కొనుగోలు చేసింది. ఇవి రాష్ట్రవ్యాప్తంగా పది పాత జిల్లా కేంద్రా ల్లోని గోదాములకు చేరాయి. అక్కడ్నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలి వెళ్లాయి. నాసి రకంగా ఉన్నాయంటూ కొందరు వైద్యులు ఫిర్యాదు చేయడంతో మెడికోల్ కంపెనీ మం దులను పరీక్షలకు పంపారు. ఇందులో 44 బ్యాచ్‌ల్లో 35 బ్యాచ్ మందులు నాసిరకం గా తేలాయి. 62.33 లక్షల సీసాల్లో దాదాపు 35 లక్షల సిరప్ సీసాలు నాసిరకమైనవని తేలాయి. ఈ సిరప్‌లను వెనక్కి తరలించేం దుకు అంతర్గతంగా దేశాలు జారీ అయ్యాయి. ఉద్దేశపూర్వకమేనా? నాసిరకం మందులపై ఫిర్యాదులు రావడంతో నేషనల్ డ్రగ్ సర్వే పేరిట దేశవ్యాప్తంగా 8,286 ఔషధాల నమూనాలను కేంద్ర ఆరోగ్య శాఖ సేకరించి పరీక్షించింది. ఇందు లో 62 కంపెనీలకు చెందిన 946 రకాల మం దులు నాసిరకమైనవని తేలాయి. మెడిపోల్ కంపెనీకి చెందిన 20 నమూనాలు నాసిరక మని తేలాయి. అయినా,అదే కంపెనీకి కోట్ల రూపాయల మందుల సరఫరాకు అనుమతి ఇవ్వడం గమనార్హం -
వైద్యం కోసం బారత్‌కు రానున్న ఆఫ్ఘన్ శరణార్ధి
-
మాటిమాటికీ బాబుకు జ్వరం...
పీడియాట్రీ కౌన్సెలింగ్ మా బాబుకు ఐదేళ్లు. వాడికి మాటిమాటికీ జ్వరం వస్తూ మళ్లీ అదే తగ్గిపోతూ ఉంటుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని మందులు, సిరప్ ఇచ్చారు. వాడినా ఏం లాభం లేదు. తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఇలా వాడికి పదేపదే జ్వరం రావడం నాకు ఆందోళన కలిగిస్తోంది. మా బాబు విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి. - సౌజన్య, విజయనగరం రోజూ ఆడుకునే సమయంలోనూ, ఇతర సమయాల్లోనూ పిల్లలు నిత్యం అనేక సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్పోజ్ అవుతుంటారు. దాంతో ఇలా తరచూ జ్వరం వస్తుండటం మామూలే. మరీ ముఖ్యంగా సీజన్స్ మారినప్పుడు ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా రావచ్చు. దాంతో జ్వరాలూ వస్తుంటాయి. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్ ఫీవర్ సిండ్రోమ్ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని... కొన్ని తీవ్రమైన సమస్యల వరకూ జ్వరం అన్నది ఒక లక్షణంగా కనిపించవచ్చు. మీరు రాసిన ఈ కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు పదే పదే జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాకపోయినా... ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన పరీక్షలు, దీర్ఘకాలికమైన జబ్బులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అని నిర్ధారణ చేసే కొన్ని పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు - మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్, ఎన్ఎస్ఏఐడీ వంటివి వాడటం చాలా హానికరం. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ స్టార్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ -
అన్ని జబ్బులకూ ఒకటే మందు
జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులను మందుల కొరత పీడిస్తోంది. అనేకచోట్ల మాత్రలు, సిరప్లు, సిరంజ్ల స్టాక్ నామమాత్రంగా కూడా లేదు. పలు ఆస్పత్రుల్లో ఫ్రిజ్‌లు పనిచేయకపోవడంతో పాము, కుక్కకాటు నివారణ మందులు పాడయ్యాయి. కొన్ని చోట్ల అన్ని జబ్బులకూ పారాసిటమాల్ మాత్రలే ఇస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రోగులే బయట డబ్బులు పెట్టి మందులు కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని వారి పరిస్థితి దయనీయంగా ఉంటోంది. విద్యుత్ సదుపాయం లేకపోవడంతో మదనపల్లె అర్బన్ పీహెచ్‌సీల్లో చీకట్లోనే వైద్యం చేస్తున్నారు. సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో 94 పీహెచ్‌సీలు, 7 సీహెచ్‌సీలు, 15 ఏపీవీపీ ఆస్పత్రులు పని చేస్తున్నాయి. వీటిల్లో ఎక్కువచోట్ల పాము, కుక్కకాటు నివారణ మందులు ఉన్నాయి. అయితే విద్యుత్ సదుపాయం లేకపోవడం, ఫ్రిజ్‌లు పనిచేయకపోవడంతో మందులన్నీ పాడైపోయాయి. కొన్ని పీహెచ్‌సీల్లో అన్ని జబ్బులకూ పారాసిటమాల్ మాత్రలే ఇస్తున్నారు. కొన్నిచోట్ల దగ్గు, అల్సర్‌కు సంబంధించిన సిరప్లు అందుబాటులో లేవు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో చాలా పీహెచ్‌సీల్లో సిరంజ్ తదితరాలు లే కపోవడంతో బయట తెచ్చుకోమని చీటీలు రాయిస్తున్నారు. ఈ క్రమంలో పేదలు ఇబ్బంది పడుతున్నారు. పీహెచ్‌సీల దుస్థితిపై ఈ నెల 18న సాక్షిలో కథనం ప్రచురితమైన తర్వాత చాలాచోట్ల మార్పు వచ్చింది. పలమనేరు నియోజకవర్గంలో వైద్యాధికారులు స్పందించి కొరత ఉన్న మందులను తిరుపతి నుంచి తెప్పించారు. అనేక చోట్ల వైద్యులు విధులకు సకాలంలో హాజరవుతున్నారు. సత్యవేడులాంటి పెద్ద ఆస్పత్రుల్లో స్త్రీ వైద్య నిపుణుల కొరత నెలకొంది. ఆపరేషన్ సంబంధిత పరికరాలు, అనస్తీషియా ఇంజక్షన్ల కొరత ఉంది. మదనపల్లె అర్బన్ పీహెచ్‌సీల్లో ఇంజక్షన్లు లేవు. అన్నింటికీ పారాసిట్మాల్ మాత్రలే దిక్కవుతున్నాయి. పాము, కుక్కకాటు నివారణ మందులు లేవు. సీటీఎం, బొమ్మనపల్లె పీహెచ్‌సీల్లో సీజన్ల్ వ్యాధులకు మందులు తక్కువగా ఉన్నాయి. వైద్యులు పది మాత్రలు రాస్తే రెండు మాత్రమే ఇస్తున్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలో పీహెచ్‌సీల్లో పాము, కుక్కకాటు నివారణ మందులు ఉన్నాయి. విద్యుత్ సదుపాయం లేకపోవడంతో కార్వేటినగరం, ఎస్.ఆర్.పురంలో ఫ్రిజ్‌లు సరిగా పనిచేయడం లేదు. దీంతో మందులు పాడవుతున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పీహెచ్‌సీల్లో సిరంజ్లూ లేవు. డ్లైకోపినాక్, పారాసిట్మాల్లాంటి మాత్రలు లేవు. కురబలకోట పీహెచ్సీలో కుక్క, పాముకాటు నివారణ మందులు లేవు. సిరంజ్‌లు బయట నుంచి తెచ్చుకోమని చీటీలు రాసిస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలో 8 పీహెచ్‌సీలు ఉన్నాయి. అవసరమైన మందులు ఉన్నాయి. ఈ నెల 18న సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో వైద్యవిధాన పరిషత్ అధికారులు స్పందించారు. తిరుపతి నుంచి చాలా మందులు తెప్పించారు. పెద్దపంజాణి మండలంలో డైక్లోపినాక్ మాత్రల కొరత ఉంది. నగరి నియోజకవర్గంలో ఒక ఏరియా ఆస్పత్రి, నాలుగు పీహెచ్‌సీలు, ఒక సీహెచ్‌సీ ఉన్నాయి. అన్నిచోట్లా మందు లు ఉన్నాయి. సత్యవేడు ప్రభుత్వాస్పత్రిలో పారాసిట్మాల్ మాత్రలు, అనస్తీషియా ఇంజక్షన్లు లేవు. పీలేరు నియోజకవర్గంలోని పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో అవసరమైన మందులు ఉన్నాయి. నియోజకవర్గంలో ఆరు పీహెచ్‌సీలు ఉన్నా యి. పాము, కుక్కకాటు నివారణ మందులు లేవు.