ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారి (ఇన్‌సెట్) సిరప్‌నుకు బదులుగా ఇచ్చిన వేరే మందు
విశాఖపట్నం , అగనంపూడి (గాజువాక): ఒక సిరప్ బదులు మరో సిరప్ ఫార్మాసిస్ట్ ఇవ్వడంతో ఆ మందు వికటించి చిన్నారిని ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్లింది. ఈ సంఘటన అగనంపూడిలో చోటు చేసుకుంది. అగనంపూడి నిర్వాసితకాలనీ కొత్తూరుకు చెందిన సీతిన గణేష్, రూపల మూడేళ్ల పాప హేమచంద్రికకు జ్వరం, జలుబు చేయడంతో అగనంపూడి ఆస్పత్రికి బుధవారం మధ్యాహ్నం తీసుకువెళ్లారు. ఆస్పత్రిలోని పిల్లల వైద్యనిపుణుడు జ్వరానికి, జలుబుకు సిరప్‌లు మందుల చీటిపై రాశాడు.
అయితే పొరపాటున ఫార్మాసిస్ట్ వేరే సిరప్‌లు ఇవ్వడం, వాటిని పాపకు పట్టడంతో ఒళ్లంతా రంగుమారిపోయి, దద్దుర్లు వచ్చాయి. అంతలోనే స్పృహ తప్పిపోవడంతో వెంటనే అగనంపూడి ఆస్పత్రికి తీసుకు వెళ్లగా మందులు మారిపోయినట్టు గుర్తించిన సిబ్బంది కేజీహెచ్‌కు పంపించారు. పాప పరిస్థితి విషమంగా మారుతుండడంతో పాప తల్లిదండ్రులు గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇదే విషయంపై బాధితులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయగా, పోలీస్ ఫిర్యాదు చేసుకోవాలని సమాధానం చెప్పడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment