five death
-
ఆయుర్వేదిక్ సిరప్ తాగి ఐదుగురు మృతి
నడియాడ్: ఆయుర్వేదిక్ సిరప్ తాగి అయిదుగురు మరణించగా మరో ఇద్దరు ఆస్పత్రి పాలైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిథైల్ ఆల్కహాల్‌తో ఆ సిరప్ కలుషితమైనట్లు చెప్పారు. ఈ ఘటన గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాడ్ పట్టణంలో జరిగింది. ఖేడా జిల్లాలోని నడియాడ్ పట్టణంలోని ఓ షాప్ నుంచి ఆయుర్వేదిక్ సిరప్ బాటిళ్లను 50 మంది దాకా కొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆయుర్వేదిక్ సిరప్‌ను కల్‌మేఘాసవాసవ అరిష్ట అనే బ్రాండ్ పేరుతో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ‘సిరప్‌లో విషపూరిత మిథైల్ ఆల్కహాల్ కలిపినట్లు అది తాగిన వారి రక్త పరీక్షలో బయటపడింది. షాపులో అమ్మే ముందు సిరప్‌లో మిథైల్ ఆల్కహాల్ కలిపినట్లు తేలింది. గడిచిన రెండు రోజుల్లో సిరప్ తాగినవారిలో అయిదుగురు చనిపోయారు. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. సిరప్ అమ్మిన షాపు యజమానితో పాటు ముగ్గురిని అరెస్టు చేశాం’ ఖేడా ఎస్పీ రాజేష్ గదియా చెప్పారు. ఇదీచదవండి..‘చైనాను చూసి నేర్చుకోండి’.. మరోసారి ఇన్ఫోసిస్ మూర్తి షాకింగ్ కామెంట్స్ -
విషాదం: వనపర్తిలో ఐదుగురు మృతి
సాక్షి, వనపర్తి: పండగ పూట జిల్లాలోని గోపాల్పేట మండలం బుద్దారంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి పాత మట్టి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వనపర్తి జిల్లా ఇంచార్జ్ , నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సాయి శేఖర్, వనపర్తి ఏసీపీ షాకీర్ హుస్సేన్, సీఐ సూర్య నాయక్, ఎస్సై రామన్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇంటి యజమాని ఆయిన్ కోమటి చెవ్వ నరసింహ సంవత్సరం క్రితం మరణించడంతో తద్దినానికి శనివారం నలుగురు కుమారులు, నలుగురు కోడళ్లు, మనుమల్లు,మనుమరాళ్లు తమ ఇంటికి వచ్చారు. శనివారం రాత్రి కుంటుంబ సభ్యులు మొత్తం పది మంది ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఇంటి మిద్దె కూలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు ఒకే కుంటుంబానికి చెందిన చెవ్వా మనెమ్మ (68), చెవ్వా సుప్రజ(38), వైష్ణవి(21), రింకి(18) ,చెవ్వా ఉమాదేవి(38)గా పోలీసులు గుర్తించారు. -
పెళ్లింట పెను విషాదం
కొణిజర్ల: పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఇన్నోవా వాహనం చెట్టుకు ఢీకొనడంతో వరుడు సహా ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలో పెళ్లి అనంతరం.. వీరంతా వాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన అచ్చి రామకృష్ణ ప్రసాద్ (36) వివాహం.. ఏపీ రాష్ట్రం రాజమండ్రికి చెందిన భావన దుర్గతో గురువారం రాత్రి తణుకులోని పాతూరు కేశవస్వామి ఆలయంలో జరిగింది. పెళ్లి అనంతరం వధూవరులతో సహా 10 మంది ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. పెళ్లి కొడుకు రామకృష్ణ ప్రసాద్ స్వతహాగా డ్రైవర్ కావడంతో తానే డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టాడు. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో కొణిజర్ల సమీపానికి రాగానే అతి వేగంగా ఉన్న వీరి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు రామకృష్ణ ప్రసాద్, అతడి అక్క పద్మ (42), బావ శరత్ (39), చెల్లి శ్రీదేవి, డ్రైవర్ వడ్లకొండ వేణు (37) అక్కడికక్కడే మృతి చెందారు. వధువు దుర్గ సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో వరుడి బావ చలపతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఘటనాస్థలాన్ని కొత్తగూడెం ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, ట్రాఫిక్ ఏసీపీ జె.సదానిరంజన్, వైరా ఏసీపీ డి.ప్రసన్నకుమార్, వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ సందర్శించారు. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
బస్సుపై బాంబు దాడి.. ఐదుగురు మృతి
ఢాకా: బాంబు దాడిలో ఐదుగురు మృతిచెందడంతో పాటు 29 మంది గాయపడ్డ సంఘటన బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్‌లోని గాయ్బంధా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... గాయ్బంధా జిల్లాలో పోలీసుల రక్షణలో ఉన్న నపు పరిబహన్ అనే బస్సుపై గుర్తుతెలియని దుండగులు రాత్రి 11:30 గంటలకు పెట్రోల్ బాంబు దాడి చేశారని చెప్పారు. పెట్రోల్ బాంబు దాడిలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుమంది మృతిచెందడంతో పాటు బస్సులోని ప్రయాణికులు 29 మందికి కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 11 మందిని రంగపూర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ కు, మరికొందరిని గాయ్ బంధా సదర్ ఆసుపత్రికి తరలించామని పోలీసు అధికారి చెప్పారు. ప్రయాణికులతో పాటు పోలీసులు గాయపడ్డారని, కొందరి పరిస్థితి బాగాలేదన్నారు. రంగపూర్ ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జరీ విభాగం చీఫ్ డాక్టర్ మరుఫల్ ఇస్లామ్ మాట్లాడుతూ... తీవ్ర గాయాలపాలైన తొమ్మిదేళ్ల బాలుడు చికిత్స పొందుతుండగానే మరణించాడని తెలిపారు.